భారత ప్రభుత్వ చట్టం - 1919 లేదా మాంటెగు-ఛెమ్స్‌ఫర్డ్ సంస్కరణలు
ప్రకటన చేసింది. క్రమంగా బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
అందులో భాగంగా, భారత రాజ్య కార్యదర్శి, లార్డ్ మాంటెగు 1917 నవంబర్‌లో భారత దేశాన్ని సందర్శించి వైస్రాయ్ ఛేమ్స్‌ఫర్డ్ మరియు భారతీయ నాయకులతో చర్చలు జరిపి ఈ సంస్కరణలను ప్రకటించారు. . అందువల్ల వీటిని మాంటెంగు ఛెమ్స్‌ఫర్జ్ సంస్కరణలు అంటారు.
గమనిక :. ఈ చట్టాన్ని 1919లో రూపొందించినప్పటికీ, 1921 నుంచి అమల్లోకి వచ్చింది.
ముఖ్యాంశాలు
భారత రాజ్య కార్యదర్శి జీతభత్యాలను భారత ఆదాయం నుండి కాకుండా బ్రిటీషు నిధి నుండి చెల్లిస్తారు.
రాష్ట్ర స్థాయిలో ద్వంద్వ పాలన (Dyarchy) ప్రవేశపెట్టారు. రాష్ట్రాల అధికారాలను రిజర్వుడు (Reserved) మరియు
ట్రాన్సఫర్ద్ (Transferred) రకాలుగా విభజించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పరిధిని ఖచ్చితంగా నిర్దేశించింది.
రిజర్వుడు విభాగంలో 28 పాలనాంశాలను, ముఖ్యంగా విత్తం, భూమి శిస్తు, న్యాయం, నీటి పారుదల, పరిశ్రమలు, మొదలగు వాటిని ఇందులో పేర్కొన్నారు.
ఈ అంశాలకు సంబంధించిన పరిపాలనా వ్యవహారాలను బ్రిటీష్ కౌన్సిలర్ల సహాయంతో ఆయా రాష్ట్రాల గవర్నర్లు నిర్వహిస్తారు. అయితే బ్రిటీష్ కౌన్సిలర్లు తమ విధి నిర్వహణలో రాష్ట్ర శాసనసభకు బాధ్యత వహించరు.
ట్రాన్స్‌ఫర్డ్ విభాగంలో 22 అంశాలను పేర్కొనడం జరిగింది. స్థానిక పాలన, వ్యవసాయం, ప్రజా ఆరోగ్యం, విద్య, సహకారం, మొదలగు అంశాలు వీటిలో ఉన్నాయి.
రాష్ట్ర గవర్నర్ ఈ అంశాల పాలనా వ్యవహారాలను భారతీయ మంత్రుల సహాయంతో నిర్వహిస్తారు. భారతీయ మంత్రులు ఆయా రాష్ట్ర శాసనసభల్లో సభ్యులై ఉంటారు మరియు తమ విధుల నిర్వహణలో శాసనసభకు బాధ్యత వహిస్తారు.
దేశంలో మొట్టమొదటిసారి కేంద్ర స్థాయిలో ద్విసభాపద్ధతిని (Bicameralism) ప్రవేశపెట్టారు. ఎగువసభను రాష్ట్రాల
మండలి (Council of States) గా, దిగువసభను కేంద్ర శాసన సభ (Central Legislative Assembly) గా వ్యవహరిస్తారు.
ఎగువసభ అయిన కేంద్ర కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్‌లో 60 మంది సభ్యులుంటారు. ఇందులో 34 మంది ఎన్నికయినవారు, 26 మంది గవర్నర్ జనరల్‌చే నియమించబడినవారు ఉంటారు. వీరి పదవీకాలం 5 సం॥. అధ్యక్షుడిని వైస్రాయ్ నియమిస్తారు.
దిగువసభ అయిన సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో 145 మంది సభ్యులుంటారు. ఇందులో 104 మంది ఎన్నికయినవారు మరియు 41 మంది నియమించబడినవారు ఉంటారు. ఈ సభ పదవీకాలం 3 సం॥.
మత ప్రాతినిధ్యం సిక్కులకు, క్రిస్టియన్లకు, ఆంగ్లో-ఇండియన్లకు మరియు ఐరోపా వారికి కూడా వర్తింపచేశారు.
ఆస్థి మరియు పన్ను చెల్లింపు ప్రాతిపదికపై పరిమితమయిన ఓటు హక్కును కల్పించారు.
లండన్‌లో భారత్ వ్యవహారాలను, ముఖ్యంగా రెవెన్యూ, పరిపాలన, మొదలగు అంశాలను పర్యవేక్షించడానికి భారత హై కమీషనర్ అనే పదవిని సృష్టించారు.
కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌ను వేరు చేశారు.
ఆక్యార్త్ సిఫారసు మేరకు 1921 లో సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ ను వేరు చేసారు.
లీ (Lee) కమిషన్ సూచనమేరకు (1923-24) భారతదేశానికి విడిగా ఒక పబ్లిక్ సర్వీస్ కమీషన్ (1926), ఒక ఆడిటర్ జనరల్‌ను ఏర్పాటు చేయడం జరిగింది.
కేంద్ర, రాష్ట్రాల మధ్య మరియు వివిధ రాష్ట్రాల మధ్య ఉత్పన్నమయ్యే వివాదాలను పరిష్కరించే అధికారం వైస్రాయికి ఇవ్వడం జరిగింది. ఈ చట్ట అమలు తీరును సమీక్షించడానికి 10 సం॥ తర్వాత చట్టబద్ధత కలిగిన కమీషన్‌ను
ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
విమర్శ : ఈ చట్లం ప్రతిపాదించిన అంశాలపై అనేక విమర్శలు వచ్చాయి.
- 1919 సంస్కరణలు అసంతృప్తి, నిరాశతోపాటుగా, “సూర్యుడు లేని ఉదయంగా ఉందని” బాలగంగాధర్ తిలక్ అభిప్రాయపడ్డారు
- ఈ సంస్కరణలు బ్రిటీషువారు ప్రకటించి ఉండాల్సింది కాదని ఈ చట్టాన్ని భారతీయులు స్వీకరించడం తగదని శ్రీమతి అనీబిసెంట్ వ్యాఖ్యానించారు.
- భారతదేశంలో ద్వంద్వ పాలన అనేది దాదాపు దూషణ పదంగా మారింది. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని నీవు “డైయార్క్వి అని అరవడం విన్నాను అని సర్ బట్లర్ అనే రచయిత అభిప్రాయపడ్డారు.
- ద్వంద్వ పాలన ఒక ఆదర్శంగా ఎప్పడూ భావించబడలేదు. ఇంకో ఉత్తమ ప్రయోజన స్థితికి ఇది ఒక మెట్టు మాత్రమే. ఈ ఉత్తమ ప్రయోజనం పేరు పరిపూర్ణ స్వపరిపాలిత భారతదేశం అని పలాండే అను రచయిత పేర్కొన్నారు.
ఈ సంస్కరణలు స్వపరిపాలనవైపు ప్రముఖమైన ముందంజ కనుక, భారత రాజ్యాంగ చరిత్రలో ముఖ్యమైన పరిణామంగా పరిగణించబడింది. అలాగే వీలయినంతమందికి అవసరమైనంత ప్రేరణ, భవితవ్యం కోసం అనుభవం సంపాదించడానికి చాలినంత అవకాశాన్ని యిచ్చిందని కూడా చెప్పవచ్చు.