Evolution of Indian Constitution-6

TSStudies

భారత కౌన్సిల్‌ చట్టం - 1909 లేదా మార్లే - మింటో సంస్కరణలు

history of indian constitution in telugu,,indian constitution history in telugu,భారత రాజ్యాంగం, Indian polity study material in telugu pdf,free download indian polity study material pdf,ts studies,ts study circle,indian polity notes in telugu,tspsc indian polity syllabus in telugu,Constitution of India study material in telugu,tspsc Constitution of India notes in telugu,tspsc Constitution of India notes in telugu,tspsc group 2 Constitution of India notes in telugu,Preamble to the Constitution of India in telugu,What is the Preamble of the Constitution of India in telugu,ts studies,tsstudies,tspsc group 2 indian polity  notes in telugu, tspsc group 2 indian polity notes in telugu,Indian Councils Act 1861,Indian Councils Act 1892,Indian councils act 1909,morley minto act,Morley-Minto Reforms,
మార్లే - మింటో సంస్కరణల ప్రధాన ఉద్దేశం 1892 చట్టంలోని లోపాలను సంస్కరించడం మరియు దేశంలో తీవ్రవాద జాతీయవాదంతో ఏర్పడిన పరిస్థితిని ఎదుర్కొనడం. కాంగ్రెస్ లోని మితవాదులను మచ్చిక చేసుకోవడానికి బ్రిటీషువారు వీటి ద్వారా ప్రయత్నించారని చెప్పవచ్చు.
Note: ఆనాటి భారత కార్యదర్శి లార్డ్ మార్లే, భారత వైస్రాయ్ మింటో పేర్లతో ఈ చట్టాన్ని చుసించటం జరిగింది. అందువల్ల దీనిని మింటో - మార్లే సంస్కరణ చట్టం అంటారు. 
మొదట భారత రాజ్య కార్యదర్శి పేరు, ఆ తరువాత భారత వైస్రాయ్‌ పేరు ఉచ్చరించడం ఆనవాయితీ కనుక
మింటోమార్లే సంస్కరణలు అనడం కంటే మార్లే-మింటో సంస్కరణలు అనడమే సబబు. అలాగే, ఆ తరువాత
1919లో రూపొందించిన చట్టాలను కూడా మాంటెగు-చెమ్స్‌ఫర్జ్‌ సంస్కరణలు అంటారు. వీరు ఈ సంస్కరణలను తీసుకురావడానికి చొరవ తీసుకొనడం వల్ల, వారి పేర్లతో ఆ సంస్కరణలు అమలులోకి వచ్చాయి. 
ఈ చట్టంలోని ముఖ్యాంశాలు
6 కేంద్ర, రాష్ట్ర శాసనమండళ్ళలో సభ్యుల సంఖ్యను పెంచారు.
శాసన ప్రక్రియ కోసం వైస్రాయ్‌ కార్యనిర్వాహక కౌన్సిల్‌లోని సభ్యుల సంఖ్యను 16 నుండి 60కి పెంచారు. అలాగే మద్రాసు, బెంగాల్‌, యునైటెడ్‌ ప్రావిన్స్‌, బీహార్‌ మరియు ఒరిస్సా రాష్ట్రాల శాసనమండళ్ళలో సభ్యత్వ సంఖ్యను 50కి
పెంచారు. పంజాబ్‌, అస్సాం, బర్మాలలో 30కి పెంచారు.
గవర్నర్‌ జనరల్‌ శాసన మండలిలో 4 రకాల సభ్యులు ఉంటారు.
1. నామినేటెడ్‌ అధికార సభ్యులు
2. నామినేటెడ్‌ అనధికార సభ్యులు
3. హోదా రీత్యా సభ్యులు
4. ఎన్నికయిన సభ్యులు.
అయితే, మెజారిటీ సభ్యులు అధికార సభ్యులు కావడం వల్ల బిల్లులు ఆమోదించడం ప్రభుత్వానికి సులభం అయ్యేది.
వైస్రాయ్ మరియు  గవర్నర్‌ల యొక్క కార్యనిర్వాహక మండలిలో మొట్టమొదటిసారిగా భారతీయులకు సభ్యత్వాన్ని
కల్పించారు. ఆ విధంగా సభ్యత్వాన్ని పొందిన మొదటి భారతీయుడు “సత్యేంద్ర ప్రసాద్‌ సిన్హా".
మహమ్మదీయులకు మరియు వ్యాపార సంఘాల సభ్యులకు ప్రత్యేక ప్రాతినిధ్యాన్ని కల్పించారు. మహమ్మదీయులకు వారి జనాభాకు మించిన ప్రాధాన్యతను ఈ చట్టం కల్పించింది. మహమ్మదీయ సభ్యులను మహమ్మదీయులే ఎన్నుకునే వీలు కల్పించబడింది. ఇందుకోసం ప్రత్యేక మతపరమైన నియోజక గణాలు ఏర్పాటు చేశారు.
ఆ విధంగా ఈ చట్టం మత తత్వానికి చట్టబద్ధత కల్పించినట్లయింది.అందుకే లార్డ్ మింటోను మత నియోజక గణాల పితామహుడిగా (Father of Communal Representation) విమర్శిస్తారు.
ప్రెసిడెన్సీ కార్పోరేషన్లకు, విశ్వవిద్యాలయాలకు, భూస్వాములకు, వ్యాపార సంస్థలకు కూడా ప్రత్యేక ప్రాతినిధ్యాన్ని
కల్పించారు.
కేంద్ర, రాష్ట్ర శాసనమండళ్ళలో సభ్యులు సైనిక, దౌత్య, మతపరమైన విషయాలు మినహా, మరి ఏ ఇతర అంశంపైనైనా ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలు అడిగేందుకు అధికారం లభించింది. కేంద్ర, రాష్ట్ర శాసనమండళ్ళలో పోటీచేయు అభ్యర్థులకు ఖచ్చితమైన అర్హతలను నిర్ణయించింది.
విమర్శ :
1909లోని అంశాలు “అసలైన స్వరూపానికి బదులు కేవలం నీడ వంటి ఆకారాన్ని” (shadow rather than substance) మాత్రమే అందించాయని, దీనిని చంద్ర కాంతితో పోల్చడం జరిగింది. హిందువులకు, ముస్లింలకు మధ్య వేర్పాటు బీజాలు నాటీ అడ్డుగోడలు సృష్టించిందని, భారత విభజనకు ఈ చట్టం దారి తీసిందని జవహర్‌లాల్‌ నెహ్రా పేర్కొన్నారు.