Evolution of Indian Constitution-12

TSStudies
క్యాబినెట్‌ మిషన్‌ (1946) (క్యాబినెట్ రాయబారం) [Cabinet Mission Plan 1946]
బ్రిటన్‌ ప్రధాన్‌ ఆట్లి, మార్చి 1946లో పార్లమెంట్‌లో భారతదేశానికి అధికార బదిలీకి సంబంధించి ఒక చారిత్రాత్మక ప్రకటన చేశారు. “అల్ప సంఖ్యాకుల హక్కుల పట్ల మాకు అవగాహన ఉంది. అల్బసంఖ్యాకులు నిర్భయంగా జీవించాలి. అయితే అధిక సంఖ్యాకుల పురోగతిని కాదనే అల్పసంఖ్యాక వర్గాన్ని కూడా మనం అనుమతించలేము” అని పేర్కొన్నారు. అందులో భాగంగా బ్రిటన్‌లో క్యాబినెట్‌ మంత్రులయిన సర్‌ స్టాఫర్డ్‌ క్రిప్స్‌ ఎ.వి.అలెగ్జాండర్‌, లార్డ్‌ పెథిక్‌ లారెన్స్‌ సభ్యులుగా గల మంత్రుల బృందం భారత పర్యటన ప్రారంభించారు. ఈ రాయబారానికి సర్‌ పెథిక్‌ లారెన్స్‌ ఛైర్మన్‌గా వ్యవహరించారు. 1946 మే 16న వీరు తమ ప్రణాళికను వెల్లడించారు.
ముఖ్యాంశాలు
  • బ్రిటీషు పాలిత భారతదేశం, స్వదేశీ సంస్థానాలు కలిపి ఇండియన్‌ యూనియన్‌ అనే రాజకీయ వ్యవస్థ ఏర్పడుతుంది. ఆ యూనియన్‌ విదేశీ వ్యవహారాలు, రక్షణ, కమ్యూనికేషన్‌ వంటి జాతీయ ప్రాముఖ్యత గల అంశాలు నిర్వహిస్తుంది.
  • కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేని పాలనాంశాలపై శాసనాధికారం రాష్ట్రాలకు సంక్రమిస్తుంది.
  • ప్రాంతీయ ప్రభుత్వాలకు శాసన నిర్మాణ శాఖలు ఏర్పాటవుతాయి.
  • పరిపాలనా నిర్వహణకై 14 మంది సభ్యులతో కూడిన ఒక తాత్మాలిక ప్రభుత్వం ఏర్పాటవుతుంది.
  • పాకిస్తాన్‌ అనే మరొక దేశం ఏర్పడే భావన ఆచరణ సాధ్యం కాదు.
  • రాజ్యాంగాన్ని రూపొందించేందుకు ప్రత్యేక రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటవుతుంది.
తాత్కాలిక ప్రభుత్వం (1946)
బ్రిటీషు ప్రభుత్వం 1946 ఆగస్హు 24వ తేదీన తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రకటించింది. దీనికి అనుగుణంగా 1946 సెప్టెంబర్‌ 2వ తేదీనతాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటయింది.
ప్రారంభంలో సందేహించిన ముస్లింలీగ్‌, 1946 అక్టోబర్‌ 29వ తేదీన తాత్కాలిక ప్రభుత్వంలో చేరింది. కాంగ్రెస్‌ తరపున వల్లభ్‌భాయ్‌ పటేల్‌, రాజేంద్ర ప్రసాద్‌, అరుణా అసఫ్‌ అలీ, రాజగోపాలాచారి, జగ్జీవన్‌రామ్‌ వంటి ప్రముఖులు, ముస్లిం లీగ్‌ తరపున లియాఖత్‌ అలీఖాన్‌, జె.ఎన్‌ మండల్‌, గజ్నేఫర్‌ అలీఖాన్‌ వంటి నాయకులు మంత్రులుగా, జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రధానిగా వ్యవహరించారు.

ఆట్లి ప్రకటన (1947) [Attlee Statement]
1947 ఫిబ్రవరి 20వ తేదీన కామన్స్‌ సభలో మాట్లాడుతూ, 1948 జూన్‌ నాటికి బ్రిటీషు ప్రభుత్వం భారత దేశం నుంచి వైదొలగుతుందని ప్రకటించాడు. దీనినే ఆట్లి ప్రకటన అంటారు.
ఈ ప్రకటనను బ్రిటీషు వారు జారీచేసిన వాటిలో అత్యుత్తమమైనదిగా గాంధీ పేర్కొన్నారు

మౌంట్‌బాటన్‌ ప్రణాళిక 1947) [Mountbatten Plan]

భారతదేశ రాజ ప్రతినిధి మరియు గవర్నర్‌ జనరల్‌గా నియమితుడయిన మౌంట్‌బాటన్‌ దేశంలోని రాజకీయ ప్రముఖలతో సంప్రధింపులు జరిపి, సమైక్య భారతదేశ ప్రాతిపదికమీద కాంగ్రెసుకు, ముస్లిం లీగుకు అంగీకారం కుదర్చడం సాధ్యం కాదని, దేశ విభజన ఒక్కటే మిగిలిన పరిష్కారంగా భావించి ప్రణాళిక తయారు చేశారు.
ముఖ్యాంశాలు
  • ఇండియన్‌ యూనియన్‌ భారత్‌, పాకిస్తాన్‌ అనే రెండు రాజ్యాలుగా విభజితమవుతాయి.
  • 1948 జూన్‌కు బదులుగా 1947 ఆగస్టు 15వ తేదీన రెండు దేశాలుగా విభజితమవుతాయి.
  • అస్సాం భారతదేశ అంతర్భాగంగా ఉండిపోగా, బెంగాల్‌, పంజాబ్‌లను మత ప్రాతిపదికపై విభజించడం జరుగుతుంది. అయితే ముస్లింలు అధికంగా ఉండే సిల్బట్‌ (బెంగాల్‌) అనే జిల్లా విషయంలో మాత్రం అది తూర్పు బెంగాల్‌లో చేరడమా లేక అస్సాంలో చేరడమా అనే విషయం ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా జరుగుతుంది.
  • బెలూచిస్థాన్‌, వాయువ్య ప్రాంతాలు భారతదేశంలో కానీ, పాకిస్తాన్‌లో గానీ చేరే విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది.
  • పంజాబ్‌, బెంగాల్‌ మరియు అస్సాం వంటి రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలను విభజించే విషయంలో రెండు సరిహద్దు సంఘాలను నియమించడం జరుగుతుంది.
  • బ్రిటన్‌ ఆధ్వర్యంలోని కామన్‌వెల్త్‌ కూటమిలో చేరే విషయంలో భారత్‌, పాకిస్తాన్‌లకు పూర్తి స్వేచ్చ ఉంటుంది.
భారత స్వాతంత్ర్య చట్టం (1947) [Indian Independence Act 1947]
భారతదేశ వ్యవహారాల నిర్వహణ, నియంత్రణ కోసం రూపొందించిన చిట్టచివరి చట్టం ఇదే. బ్రిటన్‌ ప్రధాని క్లిమెంట్‌ ఆట్లి ఆధ్వర్యంలో భారతీయ గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ లూయిస్‌ మౌంట్‌బాటన్‌ సలహా మేరకు 1947 జులై 4వ తేదీన బ్రిటీషు పార్లమెంటులో భారత స్వాతంత్ర్య ముసాయిదాను ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై బ్రిటీషు రాణి 1947 జులై 18వ తేదీన సంతకం చేసింది. ఇది 1947 ఆగస్తు 14 అర్ధరాత్రి (తెల్లవారితే శుక్రవారం) నుండి అమలులోకి వచ్చింది.
ముఖ్యాంశాలు
  • ఇండియా, పాకిస్తాన్‌ అనే రెండు స్వతంత్ర దేశాలు ఏర్పడతాయి. వీటి కోసం వేరు వేరు రాజ్యాంగ పరిషత్తులు కూడా ఏర్పాటు చేయబడ్డాయి.
  • స్వదేశీ సంస్థానాలపై బ్రిటీషు సార్వభౌమాధికారం రద్దవుతుంది.
  • భారత వ్యవహారాల కార్యదర్శి పదవి కూడా రద్దవుతుంది.
  • బ్రిటీషు రాజు లేక రాణికి ఉన్న భారత చక్రవర్తి అనే బిరుదు రద్దవుతుంది.
  • వైస్రాయ్‌ పదవి రద్దు అవుతుంది.
  • రాజ్యాంగ పరిషత్తు తాత్మాలిక పార్లమెంటుగా పనిచేసి చట్టాలను రూపొందిస్తుంది.
  • గవర్నర్‌ జనరల్‌, రాష్ట్ర గవర్నర్లు రాజ్యాంగపరమైన అధిపతులుగా వ్యవహరిస్తారు.
  • లార్డ్  మౌంట్‌బాటన్‌ మొదటి గవర్నర్‌ జనరల్‌గా నియమించబడ్డాడు. 
ప్రముఖుల వ్యాఖ్యానాలు 
నడిరాత్రి గంటకొట్టగానే, ప్రపంచం మొత్తం నిద్రావస్థలో మునిగి ఉన్నప్పుడు భారతదేశం మేల్కొని ఊఫిరిని‌, స్వేచ్భను పొందుతుంది. భారతదేశ ప్రజలు, విశాల మానవాళి సేవకోసం ప్రయాణాన్ని చేయడం ఈ సమయంలో అవశ్యకం. "భారతదేశ సేవ అంటే దేశంలోని కోట్లాది పీడితుల సేవ. - నెహ్రూ
మన స్వల్పమైన బాధల వల్ల, త్యాగాల వల్ల. ఈ విజయం లభించినా, ఇది ప్రపంచ శక్తుల సంఘటనల ఫలితం కూడా అని తెలుసుకోవాలి. బ్రిటీషు పాలకుల ప్రజాస్వామ్య ఆశయాలు, వారి చారిత్రక సాంప్రదాయాలు కూడా కొద్దో, గొప్పో కారణాలు అయ్యాయని కూడా తెలుసుకోవాలి. - రాజేంద్రప్రసాద్‌.