రాజ్యాంగ పరిషత్తు సమావేశాలు, చర్చలు
ముసాయిదా కమిటీ రెండు డ్రాఫ్ట్‌లను తయారు చేసింది. రాజ్యాంగ ముసాయిదా 1948 ఫిబ్రవరి 21వ తేదీన ప్రచురించబడింది. రాజ్యాంగ ప్రతిపై 7,635 సవరణలు ప్రతిపాదించగా అందులో 2478 చర్చకు వచ్చాయి.
రాజ్యాంగ పరిషత్ ఈ ముసాయిదాను 115 రోజులలో పరిశీలించింది.
ముసాయిదాను రాజ్యాంగపరిషత్తు 1949 నవంబర్ 26వ తేదీన ఆమోదించి చట్టంగా మార్చింది.
మొత్తం మీద రాజ్యాంగ రూపకల్పన కోసం 2 సం.రాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. మొత్తం 11 సమావేశాలు జరిగాయి. (పట్టిక చూడండి)
భారత రాజ్యాంగ పరిషత్తు చిట్టచివరి సమావేశము 1950 జనవరి 24న జరిగింది. ఆ రోజు సమావేశానికి హాజరైన సభ్యుల సంఖ్య 284. ఈ సమావేశంలో నూతన రాజ్యాంగం ప్రకారం భారత్ గణతంత్ర ప్రథమ అధ్యక్షుడిగా డా.రాజేంద్రప్రసాద్‌ను రాజ్యాంగ పరిషత్తు ఎన్నుకుంది.
భారత రాజ్యాంగం 1950 జనవరి 26..మండి అమలులోకి వచ్చింది. ఆ రోజునే గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు.
రాజ్యాంగ అమలు తేది
జనవరి 26ను రాజ్యాంగ అమలు తేదీగా నిర్ణయించడానికి చారిత్రక నేపథ్యం ఉంది. భారత జాతీయ కాంగ్రెస్ నెహ్రూ అధ్యక్షతన జరిగిన లాహోర్ సమావేశములో (1929, డిసెంబర్ 31) జనవరి 26ను పూర్ణ స్వరాజ్య దినోత్సవంగా ప్రకటించింది. ఆ సంఘటనకు గుర్తుగా జనవరి 26ను అమలు తేదీగా నిర్ణయించడం జరిగింది.
రాజ్యాంగ పరిషత్తు ఇతర విధులు
భారత రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ రచనతో పాటుగా కొన్ని సాధారణ చట్టాలను కూడా రూపొందించి ఆమోదించింది.
అందులోని ముఖ్యాంశాలు
1947 జులై 22వ తేదీన జాతీయ జెండాను ఆమోదించింది
రాజ్యాంగ పరిషత్తు కేంద్ర శాసన సభగా కూడా పనిచేసింది. స్వతంత్ర శాసనసభగా 1947 నవంబర్ 17వ తేదీన సమావేశమై, మొట్టమొదటి స్పీకర్‌గ్నా జి.వి. మావలంకర్‌ను ఎన్నుకుంది.
భారత రాజ్యాంగ పరిషత్తు చిహ్నంగా ఏనుగును గుర్తించడం.
దేవనాగరి లిపిలో గల హిందీని కేంద్ర ప్రభుత్వ భాషగా సెప్టెంబర్ 14న 1949లో ఆమోదించింది.
కామన్‌వెల్త్‌లో భారత సభ్యత్వాన్ని 1949 మే నెలలో ధృవీకరీంచింది.
మొట్టమొదటి రాష్ట్రపతిగా రాజేంద్రప్రసాద్‌ను రాజ్యాంగ పరిషత్తు జనవరి 24, 1950లో ఎన్నుకుంది. (అప్పటిదాకా ఎన్నికైన పార్లమెంటు ఏర్పడలేదు కనుక)
1950 జనవరి 24వ తేదీన జాతీయ గీతాన్ని మరియు జాతీయ గేయాన్ని ఆమోదించింది.
రాజ్యాంగ పరిషత్తు ముఖ్య కమిటీలు, అధ్యక్షులు (Babasaheb Ambedkar, Chairman, Drafting Committee of the Indian Constitution with other members)
రాజ్యాంగ పరిషత్తులో అతి ముఖ్యమైనది ముసాయిదా కమిటీ, అతిపెద్ద కమిటీ - సలహా కమిటీ.
ముసాయిదా కమిటీ, సభ్యుల సంఖ్య 6
బి.ఆర్. అంబేద్కర్ (ఛైర్మన్)
ఎన్. గోపాలస్వామి అయ్యంగార్ (సభ్యులు)
అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ (సభ్యులు)
డా. కె.యం. మున్షి (సభ్యులు)
సయ్యద్ మహమ్మద్ సాదుల్లా (సభ్యులు)
ఎన్. మాధవరావు (సభ్యులు) (బి.ఎల్. మిత్తల్ అనారోగ్య కారణంగా రాజీనామా చేయడంతో న వచ్చారు).
టి.టి.కృష్ణమాచారి (సభ్యులు)(డి.పి. ఖైతాన్ మరణించడం వలన ఆ స్థానంలో వచ్చారు.)
కమిటీ పేరు | చైర్మన్ |
ముసాయిదా కమిటీ | డా॥ బి.ఆర్. అంబేద్కర్ |
సలహా కమిటీ * హక్కుల కమిటీ, రాష్ట్రాల రాజ్యాంగాల కమిటీ | సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ |
సారథ్య కమిటీ * జాతీయ పతాక తాత్మాలిక కమిటీ, ఫైనాన్స్ & స్టాఫ్ కమిటి * రూల్స్ కమిటీ | రాజేంద్ర ప్రసాద్ |
కేంద్ర అధికారాల కమిటీ, కేంద్ర రాజ్యాంగ కమిటీ * రాష్ట్రాల సంప్రదింపుల కమిటీ | జవహర్లాల్ నెహ్రూ |
సుప్రీంకోర్టుపై తాత్కాలిక కమిటీ | వరదాచార్య |
హౌస్ కమిటీ, చీఫ్ కమిషనర్స్ ప్రొవిన్స్‌ల కమిటీ | భోగరాజు పట్టాభి సీతారామయ్య |
రాజ్యాంగ పరిషత్తు విధుల కమిటీ | జి.వి. మావలంకర్ |
సభా వ్యవహారాల కమిటీ | కె. యం. మున్షి |
రాజ్యాంగ ముసాయిదా ప్రత్యేక కమిటీ, ప్రుడెన్షియల్ కమిటీ | అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ |
భాషా కమిటీ | మోటూరి సత్యనారాయణ |
కమిటీ పేరు | చైర్మన్ |
ప్రాథమిక హక్కుల ఉపకమిటీ | జె.బి. కృపలాని |
మైనారిటీల సబ్‌కమిటీ | హెచ్.సి. ముఖర్జీ |
ఈశాన్య రాష్ట్రాల హక్కుల కమిటీ | గోపినాథ్ బోర్డోలాయ్ |
ప్రత్యేక ప్రాంతాల కమిటీ | ఎ.వి. టక్కర్ |