Nature and Salient features of Indian Constitution-5

TSStudies
0
Important sources of indian constitution

రాజ్యాంగ పరిషత్ - రాజ్యాంగ రచన అనుసరించిన పద్ధతి

రాజ్యాంగ రచనలో రాజ్యాంగ పరిషత్తు ఏ అంశాన్నీ ఓటింగ్‌ ద్వారా ఆమోదించలేదు. ప్రతి ప్రతిపాదనను, సమస్యను సుదీర్షంగా చర్చించి సర్దుబాటు, సమన్వయం లేదా ఏకాభిప్రాయ సాధన ద్వారా పరిష్కరించిందని ప్రఖ్యాత రాజ్యాంగ నిపుణులు గ్రాన్‌విలె ఆస్టిన్‌ పేర్కొన్నారు.

సమ్మతి పద్ధతి (Consensus)
ఒక సమస్య లేదా ప్రతిపాదన వచ్చినప్పుడు కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, చర్చల ద్వారా ఇంచుమించు అందరు సభ్యులు ఒప్పుకునేలా చేసే పద్ధతి. ఈ పద్ధతి ద్వారా సమాఖ్య వ్యవస్థ ప్రాంతాల ప్రత్యేకత, భాషకు సంబంధించిన అంశాలను పరిష్కరించారు.

సమన్వయ పద్ధతి (Accommodation)
ఒక సమస్యపై మధ్యే మార్గాన్ని సాధించడం. పరస్పర వ్యతిరేక వాదనలు ఉన్నప్పుడు సుదీర్షంగా చర్చించి గుణ దోషాలపై వివేచనతో, తర్మబద్ధంగా ఒక అభిప్రాయానికి రావడం.

రాజ్యాంగం - ముఖ్య ఆధారాలు (Important sources of Indian Constitution)
భారత రాజ్యాంగ రచనా క్రమంలో ఆనాటి ప్రపంచ రాజ్యాంగాల ప్రభావం గణనీయంగా ఉంది. భారత రాజ్యాంగానికి అత్యంత ముఖ్యమైన ఆధారం భారత ప్రభుత్వ చట్టం, 1935. అందుకే భారత రాజ్యాంగాన్ని 1935 చట్టం యొక్క నకలుగా వర్ణిస్తారు.

 ఆధారం గ్రహించిన అంశాలు
 1935 చట్టంకేంద్ర, రాష్ట్రాలతో సమాఖ్య వ్యవస్థ, ఫెడరల్‌ కోర్టు, రాష్ట్రపతి పాలన (ప్రకరణ 356),
గవర్నర్‌ పదవి, విచక్షణాధికారాలు, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు, ఇతర పరిపాలన అంశాలు.
 బ్రిటీష్‌ రాజ్యాంగంపార్లమెంటు/క్యాబినెట్‌ తరహా పాలనా పద్ధతి, ద్విసభా పద్దతి, సమన్యాయ పాలన, శాసన నిర్మాణ ప్రక్రియ, శాసన సభ్యుల స్వాధికారాలు, స్పీకరు, డిప్యూటి స్పీకరు, కంప్ట్రోలర్‌,
ఆడిటర్‌ జనరల్‌, అటార్నీ జనరల్‌, మొదలగు పదవులు మరియు రిట్లు జారీచేసే విధానం.
 అమెరికా రాజ్యాంగంప్రాథమిక హక్కులు, న్యాయసమీక్ష స్వతంత్ర్య ప్రతిపత్తి కలిగిన న్యాయశాఖ, ఉపరాష్రపతి
రాజ్యసభకు చైర్మన్‌గా వ్యవహరించడం, రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానం, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు. రాజ్యాంగ సవరణ బిల్లుకు రాష్ట్రాలు ఆమోదం తెలపడం.
 కెనడా రాజ్యాంగంబలమైన కేంద్ర ప్రభుత్వం, గవర్నర్‌లు నియమించే పద్ధతి. అవశిష్ట అధికారాలను కేంద్రానికి
ఇవ్వడం, ప్రకరణ 143 ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను కోరడం.
 ఐర్లాండు రాజ్యాంగంఆదేశిక సూత్రాలు, రాష్ట్రపతిని ఎన్నుకునే నైష్పత్తిక ప్రాతినిధ్యం, ఒక ఓటు బదిలీ పద్ధతి,
రాజ్యసభకు విశిష్ట సభ్యుల నియామకం.
 వైమార్‌ రిపబ్లిక్‌ (జర్మనీ)జాతీయ అత్యవసరపరిస్థితి, ప్రాథమిక హక్కులు రద్దుచేసే అధికారం, మొదలగునవి.
(వైమార్‌ అనునది జర్మనీ దేశ రాజ్యాంగ పరిషత్తు సమావేశమైన నగరము.)
 ఆస్ట్రేలియా ఉమ్మడి జాబితా, పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశము
(బిల్లు ఆమోదంలో వివాదం ఏర్పడితే) వాణిజ్య, వ్యాపార లావాదేవీలు, అంతర్రాష్ట్ర వ్యాపారము.
 దక్షిణాఫ్రికా రాజ్యాంగ సవరణ విధానం, రాజ్యసభ సభ్యుల ఎన్నిక పద్ధతి, మొదలగు అంశాలు.
 ఫ్రాన్స్ గణతంత్ర విధానం, స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాతృత్వం, తాత్కాలిక సభాధ్యక్షుల నియామకం
 రష్యా ప్రాథమిక విధులు, దీర్హకాలిక ప్రణాళిక, సామ్యవాద సూత్రాలు
 జపాన్ నిబంధన 21లో పేర్కొనబడిన “చట్టం నిర్దేశించిన పద్ధతి.
 స్విట్జర్లాండ్  ప్రధానమంత్రి, మంత్రిమండలి మధ్య సమిష్టి బాధ్యత

important sources of indian constitution,Sources of Indian Constitution,What are the Main Sources of the Indian Constitution,What are the various sources of the Indian Constitution,TS Studies,Preamble of Indian Constitution

Post a Comment

0Comments

Post a Comment (0)