ప్రకరణ 32 - రిట్లు - పరిధి - పరిమితులు
ప్రాధమిక హక్కుల పరిరక్షణకు జారీచేసే ప్రత్యేక ఆదేశాలను న్యాయ శాస్త్ర పరిభాషలో రిట్లు (Writs) అంటారు. రిట్లు జారి చేసే పద్ధతిని బ్రిటిష్ రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది. రిట్లు జారీ చేసే అధికారం నిబంధన-32 ప్రకారం సుప్రీం కోర్టుకు, నిబంధన 226 ప్రకారం రాష్ట్ర హైకోర్టులకు కల్పించారు. అదే విధంగా పార్లమెంటు ప్రత్యేక చట్టం ద్వారా ఈ అధికారాన్ని జిల్లా న్యాయస్థానాలకు కూడా కల్పించవచ్చు. కానీ, ఇంత వరకు పార్లమెంటు అలాంటి చట్టాలను రూపొందించలేదు కనుక, సుప్రీం కోర్టు, హైకోర్టులకు మాత్రమే రిట్లు జారీచేసే అధికారం ఉంది. అయితే రిట్లు జారీ చేసే విషయంలో సుప్రీం కోర్టు, హైకోర్టు మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి. వాటిని క్రింది విధంగా పరిశీలించవచ్చు.
సుప్రీం కోర్టు - నిబంధన 32
హైకోర్టు - నిబంధన 226
సుప్రీం కోర్టు కేవలం ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసమే రిట్లు జారీ చేస్తుంది. ప్రధాన పరిధిలోకి వస్తుంది.
ప్రాధమిక హక్కుల పరిరక్షణతో పాటు ఇతర హక్కుల పరిరక్షణకు కూడా ప్రత్యేక పరిస్థితులలో కూడా రిట్లు జారీ చేయవచ్చు.
సుప్రీం కోర్టు దేశంలో ఏ వ్యక్తికైనా, ప్రభుత్వ సంస్థకైనా రిట్లు జారీ చేయవచ్చు . సుప్రీం కోర్టు జారీ చేసిన రిట్లు అన్ని ప్రాంతాలకు వర్తిస్తాయి
రాష్ట్ర హైకోర్టు జారీ చేసిన రిట్లు ఆ రాష్ట్ర భూభాగంలో నివసించే వారికే వర్తిస్తాయి.
ఈ నిబంధన క్రింద జారీ చేసే రిట్లు, హక్కుగా మరియు రక్షణగా వర్తిస్తుంది. అనగా, రిట్టును ఒక హక్కుగా డిమాండ్ చేయవచ్చు. ఇది కోర్టు విచక్షణపైన ఆధారపడదు. దీనిని కోర్టు నిరాకరించడానికి అవకాశం ఉండదు. అందుకే దీనిని రెమిడియల్ రైట్ (Remedial Right) అంటారు.
ఈ నిబంధన ప్రకారం హైకోర్టు జారీచేసే రిట్టు కోర్టు విచక్షణపైన ఆధారపడి ఉంటుంది. బాధితులు ఈ రిట్టును హక్కుగా డిమాండ్ చేయలేరు. ఇతర హక్కుల పరిరక్షణలో, భాగంగా రాజ్యాంగం ఈ అధికారాన్ని హైకోర్టుకు కల్పించిందే తప్ప ప్రత్యేకంగా పై అధికారాలు ఇవ్వలేదు.
అత్యవసర పరిస్థితుల్లో ఇది రద్దవుతుంది
అత్యవసర పరిస్థితుల్లో ఇది రద్దు కాదు.
ఈ ప్రకరణ యొక్క విషయ పరిధి తక్కువ
ఈ ప్రకరణ యొక్క విషయ పరిధి విసతమైనది.
ప్రత్యేక వివరణప్రాధమిక హక్కుల పరిరక్షణలో సుప్రీం కోర్టుకు ప్రత్యేక, ప్రధాన మరియు ప్రాథమిక విచారణ పరిధి ఉంటుంది (Primary and Original). అందుకే సుప్రీం కోర్టును “ప్రాథమిక హక్కుల పరిరక్షణ కర్త” అంటారు.ప్రాధమిక హక్కుల పరిరక్షణలో సుప్రీంకోర్టు మరియు హైకోర్టులకు ఉమ్మడి పరిధి ఉంటుంది. అనగా పౌరులు ప్రాథమిక హక్కుల పరిరక్షణకు ప్రకరణ 32 ప్రకారం నేరుగా సుప్రీంకోర్టును గాని లేదా ప్రకరణ. 226 ప్రకారం హైకోర్టును గాని ఆశ్రయించవచ్చు.సాధారణంగా పౌరులు హైకోర్టు ద్వారా తగిన రక్షణ, ఉపశమనం లభిస్తుందని భావిస్తే, మొదట హైకోర్టును ఆశ్రయించాలని కనుభాయ్ బ్రహ్మభట్ Vs గుజరాత్ 1972 కేసు లో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.
Fundamental Rights of Indian Constitution (Articles 12-35)-19
22:16:00
0