వివిధ రిట్లు - అర్ధం - పరిధి - ప్రాముఖ్యత
హెబియస్ కార్బస్ (Hebeas Corpus) - (బందీ ప్రత్యక్ష అధిలేఖ)ఈ పదము లాటిన్ భాష నుండి వచ్చింది. ఇది అతి పురాతనమైన రిట్. “హెబియస్” అనగా “Have" కార్బస్ అనగా “Body” అని అర్ధం వస్తుంది. అనగా ఒక వ్యక్తిని బౌతికంగా కోర్టు ముందు హాజరుపర్చడం. నిబంధన 19 నుండి 22 వరకు పొందుపరచిన వ్యక్తిగత స్వేచ్చలకు భంగం కలిగినప్పుడు ఈ రిట్‌ను జారీ చేస్తారు. అరెస్టు చేయబడిన వ్యక్తిని 24 గంటల్లోగా సమీప న్యాయస్థానం లో హాజరుపరచకపోతే, ఈ రిట్ దాఖలు చేసినచో వెంటనే ఆ వ్యక్తిని న్యాయస్థానం ముందు హాజరు పరచమని ఆదేశిస్తుంది.ఈ రిట్ ప్రధాన ఉద్దేశ్యము వ్యక్తిగత స్వేచ్చల పరిరక్షణ మరియు చట్టబద్ధత లేకుండా ఏ వ్యక్తిని కూడా నిర్చంధించకుండా మరియు శిక్షించకుండా కాపాడటం. ఈ రిట్‌ను ప్రభుత్వ సంస్థలకు, ప్రైవేటు వ్యక్తులకు కూడా జారీ చేయవచ్చు.మూడవ వ్యక్తి కూడా (Third Person) ఇందులో జోక్యం చేసుకునే హక్కు (Locus Standi- లోకస్ స్టాండై) ఉంటుంది. బాధితుల తరపున సామాజిక స్పృహ ఉన్న సంస్థ కాని లేదా వ్యక్తి కాని ఈ రిట్టును దాఖలు చేయవచ్చు. అందుకే దీనిని “ఉదారమైన రిట్టు” అంటారు. అలాగే వ్యక్తిగత స్వేచ్చల పరిరక్షణ సాధనం (Apostle of Personal Liberty) రక్షణ కవచం (Bull Work) అని కూడా అంటారు.మినహాయింపులుపార్లమెంటు స్వాధికారాలకు భంగం కలిగించిన కారణంగా వ్యక్తి నిర్బంధించబడినప్పుడు, అలాగే కోర్టు ద్వారా నేరారోపణ నిరూపితం అయి, ఖైదీగా శిక్షను అనుభవిస్తున్నపుడు ఇది వర్తించదు.మాండమస్ (Mandamus) (పరమాదేశ అధిలేఖ)భాషాపరంగా మాండమస్ అంటే “ఆదేశం” అని అర్ధం. సుప్రీం కోర్టు లేదా హైకోర్టు జారీచేసే అత్యున్నతమైన ఆదేశంగా చెప్పవచ్చు. ప్రభుత్వాధికారిగాని, సంస్థగాని తమ చట్టబద్ధమైన విధులను నిర్వర్తించనప్పుడు వాటిని నిర్వర్తించమని న్యాయస్థానము ఇచ్చే ఆదేశం.ప్రత్వాధికారులు సంస్థలు తమ విధులను చట్టబద్ధంగా నిర్వర్తించనప్పుడు ప్రజల హక్కులకు భంగం కలుగుతుంది. అలాంటి సందర్భాలలో వారిచేత తమ విధులను నిర్వర్తింపచేయడానికి ఈ రిట్‌ను జారీ చేస్తారు. మాండమస్ రిట్‌ను, పబ్లిక్ సంస్థలకు, క్వాజి పబ్లిక్ (Quasi-Public), జ్యుడీషియల్ సంస్థలకు, క్వాజి జ్యుడీషియల్ (Quasi Judicial) సంస్థలకు వ్యతిరేకంగా జారీ చేయవచ్చు.మినహాయింపులురాష్ట్రపతి, గవర్నర్‌లకు ఈ రిట్ వర్తించదు. వీరు తమ అధికారాలను, విధులను నిర్వర్తించనప్పుడు వాటిని నిర్వర్తించమని ఏ కోర్టు ఆదేశించలేదు.ప్రైవేటు వ్యక్తులకు, ప్రైవేటు సంస్థలకు వ్యతిరేకంగా కూడా ఈ రిట్‌ను జారీచేయడానికి వీలులేదు.మాండమస్ రిట్‌ను అంతిమ ప్రత్యామ్నాయంగా మాత్రమే జారీచేస్తారు.. అనగా, పరిపాలనా పరంగా ఉన్న ప్రత్యామ్నాయాల ద్వారా పౌరులు న్యాయాన్ని పొందలేనప్పుడు, ఈ రిట్ ద్వారా ఉపశమనం పొందవచ్చు. కనుక రిట్ జారీచేయడం అనేది కోర్టు విచక్షణపైన అధారపడి ఉంటుంది.అధికారాలు నిర్వర్తించే విధులలో తప్పనిసరిగా నిర్వర్తించాల్సిన విధులకే ఇది వర్తిస్తుంది. సంబంధిత. అధికారి విచక్షణా (Discretion) పూర్వకమైన విధులకు ఇది వర్తించదు.ప్రొహిబిషన్ (Prohibition) (నిషేధం)భాషా పరంగా ప్రొహిబిషన్ అనగా నిషేధించడం అని అర్ధం. ఏదైనా దిగువ కోర్టు లేదా ట్రిబ్యునల్ తమ పరిధిని అతిక్రమించి కేసులు విచారిస్తున్నప్పుడు ఆ విచారణను తదుపరి ఆదేశాల వరకు ఆపివేయమని కోర్టు అదేశీస్తుంది. ఈ రిట్టు ముఖ్య ఉద్దేశ్యం దిగువ కోర్టులు తమ పరిధులను అతిక్రమించకుండా నిరోధించడమే. ప్రొహిబిషన్ న్యాయ సంస్థలకు మాత్రమే వర్తిస్తుంది. పరిపాలనా సంస్థలకు చట్టపర సంస్థలకు వర్తించదు.సెర్షియోరరి (Certiorari) (ఉన్నత న్యాయస్థాన పరిశీలనాధికారం)భాషా పరంగా. సెర్షియోరారి-అనగా “సుపీరియర్” లేదా “టు బి సర్టిఫైడ్” లేదా “బ్రింగ్ ద రికార్డ్స్” అని అర్ధం. ఏదైనా దిగువ కోర్టు తమ పరిధిని అతిక్రమించి కేసును విచారించి తీర్పు చెప్పినప్పుడు, ఆ తీర్పును రద్దు చేసి, కేసును పై స్థాయి కోర్టుకు బదిలీ చేయమని ఇచ్చే ఆదేశం. ఈ రిట్ ఉద్దేశము కూడా దిగువ న్యాయస్థానాలు తమ పరిధులను అతిక్రమించకుందా నిరోధించడమే.సెర్షియోరారి ప్రైవేటు సంస్థలకు, శాసన సంస్థలకు వ్యతిరేకంగా జారీ చేయబడదు, అయితే ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్న పరిపాలనా సంస్థలకు వ్యతిరేకంగా జారీచేయవచ్చని ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఎన్విరాన్-లీగల్ యాక్షన్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా (1996) కేసులలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.ప్రొహిబిషన్, సెర్షియోరరి మధ్యతేడాలుప్రొహిబిషన్, సెర్షియోరరిల రిట్ల యొక్క ఉద్దేశ్యం ఒక్కటే. దిగువ కోర్టులు తమ పరిధులను అతిక్రమించకుండా నియంత్రించడం, అయితే ప్రక్రియలో తేడా ఉంది. కేసు ప్రారంభదశలో ఉంటే ప్రొహిబిషన్ రిట్, తీర్పు వెలువడిన తరువాత సెర్షియోరరి రిట్టును జారి చేస్తారు.సెర్షియోరరి రిట్టు దిగువ కోర్టులను నియంత్రిండానికే కాక, అవి చేసిన తప్పిదాలను కూడా సవరిస్తుంది. రిట్టు కేవలం నిలుపుదల చేస్తుంది. (Prohibition is preventive where as certiorari is curative)కోవారంటో (Quo-Warranto) (అధికార పృచ్చ)భాషాపరంగా దీన్ని “బై వాట్ వారంట్” (By What Warrant) అంటారు. అనగా “ఏ అధికారము చేత” అని ప్రల్నించడం. ప్రజా సంబంధమైన పదవులలోకి అక్రమంగా ప్రవేశించినా లేదా ప్రజా పదవులను దుర్వినియోగపరిచినా పదవిలో ఉన్న వ్యక్తి తాను ఆ పదవిలో కొనసాగడానికి చట్టబద్ధంగా ఉన్న అధికారాన్ని న్యాయస్థానాలు ప్రశ్నిస్తాయి. చట్టబద్ధత లేకపోతే ఆ పదవి నుండి వెంటనే తొలగిపొమ్మని ఆదేశిస్తాయి. ఈ రిట్టు ప్రధాన ఉద్దేశ్యం ప్రజా పదవుల దుర్వినియోగాన్ని అరికట్టడం.ప్రజా పదవి అనగా చట్టము చేత ఏర్పాటైన స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థ. ఉదాహరణకు ప్రభుత్వ కార్పోరేషన్ చైర్మన్‌లు, డైరెక్టర్‌లు, మంత్రులు, ముఖ్యమంత్రులు, మొదలైనవి.ఈ రిట్టు కొరకు బాధితుడు మాత్రమే న్యాయస్థానాల్లో కేసు వేయాలనే నియమము లేదు, ప్రజా పదవులను దుర్వినియోగం నుండి కాపాడాలి అనే సామాజిక స్పృహ ఉన్న ఏ పౌరుడైనా కోర్టును ఆశ్రయించవచ్చు.మూడవ వ్యక్తి కూడా (Third Person) ఇందులో జోక్యం చేసుకునే హక్కు (Locus Standi- లోకస్ స్టాండై) ఉంటుంది.ఇన్‌జంక్షన్ (Injunction) (నిలుపుదల ఆదేశం)ఈ రిట్టు గురించి రాజ్యాంగంలో ప్రస్తావన లేదు. కేవలం సివిల్ వివాదాలలో యథాతథ స్థితిని (Status Quo-Ante) కొనసాగించడానికి దీనిని జారీ చేస్తారు. భర్తీ చేయడానికి వీలుపడని నష్టాన్ని అరికట్టేందుకు ఇన్‌జంక్షన్‌ను జారీ చేస్తారు. కనుక ప్రాథమిక హక్కుల రక్షణకు ఈ రిట్టుకు సంబంధం లేదు.
వివిధ రిట్లు - సారాంశం పట్టిక
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|