మత స్వేచ్చ - సుప్రీంకోర్టు తీర్పులు
బిజో ఇమాన్యువల్ Vs స్టేట్ ఆఫ్ కేరళ (1986) కేసులో, జాతీయ గీతం పాడడం వారి మత విశ్వాసానికి విరుద్ధం అవుతుందని వారు నిరూపించగలిగితే దానిని ఆలపించమని ఏ వ్యక్తిని ఒత్తిడి చేయరాదని పేర్కొంది. కేరళ పాఠశాలలలో జాతీయ గీతం ఆలపించడం తప్పని సరి చేసిన ఆదేశాన్ని ప్రశ్నిస్తూ ఈ కేసును సుప్రీం కోర్టులో వేసారు.స్టాలిన్ Vs మధ్యప్రదేశ్ కేసులో (1977) కేసులో మధ్యప్రదేశ్ ప్రభుత్వం మత మార్పిడులను నిషేధిస్తూ చేసిన చట్టం రాజ్యాంగ బద్ధమేనంటూ సుప్రీంకోర్టు సమర్థించింది.ఎస్.పి. మిట్టల్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా (1988) కేసులో, హిందు మతంలో అనేక ఉపశాఖలు ఉన్నాయి. రామకృష్ణ మఠం అనేది హిందు మతంలోని ఒక గొప్ప ఉపశాఖ. పీఠాలు, మఠాలు మత సంస్థల పరిధిలోకి వస్తాయి. అయితే ఆర్య సమాజం, అరబిందో సమాజం వంటివి మత సంస్థల క్రిందికి రావు అని సుప్రీంకోర్టు పేర్కొంది.ఎన్. రహమాన్ బర్కతి Vs బెంగాల్ స్టేట్ (1988) కేసులో, ప్రార్ధనా మందిరాలలో నిర్ణీత సమయం తరువాత లౌడ్ స్పీకర్‌లు వాడడం ధ్వని కాలుష్యానికి, ఇతరుల అసౌకర్యానికి దారితీస్తుంది. కావున వాటిపైన పరిమితులు విధించవచ్చని, అది మత స్వేచ్చకు భంగకరం కాదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందిభారత నాస్తిక సంఘం Vs ఆంధ్రప్రదేశ్ స్టేట్ కేసులో (1986) హిందూ మత సాంప్రదాయపరంగా పూజలు చేయడం, కొబ్బరికాయలు కొట్టడం, మత విశ్వాసాల్లో అంతర్భాగం వాటిని నిషేధించడం కుదరదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.సెయింట్ జే వియర్ కాలేజ్ Vs స్టేట్ ఆఫ్ గుజరాత్ (1974) కేసులో, లౌకికం అనే పదానికి సుప్రీం కోర్టు వివరణ ఇచ్చింది. లౌకికత్వం అంటే మతానికి, దేవునిపట్ల అతీతంగా వ్యవహరించడమే. దేవుని పట్ల ప్రత్యేక ద్వేషం కాని, వ్యతిరేకత గాని చూపని స్వభావం ప్రభుత్వం దేవుని నమ్మేవారిని, నమ్మనివారిని ఒకేలా చూడాలి.ఎ.ఎస్. నారాయణ Vs స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (1996) కేసులో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్చకులు వారసత్వంగా ఉన్న మిరాసీదారీ వ్యవస్థను రద్దు చేసింది. దీనిని ప్రశ్నిస్తూ టి.టి.డి పూజారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అర్చకుల నియామకాలు లౌకిక పరమైన చర్యలని, దానిని ప్రభుత్వం క్రమబద్దీకరణ చేయడం మత స్వేచ్చలకు, నిర్వహణకు విరుద్దం కాదని చెప్పింది.మనోహర్ జోషి Vs ఎన్.బి.పటేల్ (1995) కేసులో “హిందుత్వం” అనేది భారత ఉపఖండంలోని ప్రజలకు సంబంధించిన ఒక జీవన విధానం. మరియు ఒక మానసిక స్థితి అని దానిని మతంగా పరిగణించరాదని పేర్కొంది. ఎన్నికల్లో హిందుత్వ ప్రాతిపదికన ఓట్లు అడగడం లౌకిక రాజ్య స్వభావ వ్యతిరేకమని ప్రశ్నిస్తూ ఈ కేసు దాఖలైంది.ప్రకరణలు-29,30 - విద్యా సాంస్కృతిక పరమైన హక్కులు
- ప్రకరణ 29(1) - భారత దేశంలో నివసిస్తున్న ప్రజలు ప్రత్యేక భాషను, లిపిని, సంస్కృతిని కలిగి ఉంటే, వాటిని పరిరక్షించుకుని, పెంపొందించుకునే స్వేచ్చ ఉంటుంది.
- ప్రకరణ-29(2) - ప్రభుత్వం నిర్వహిస్తున్న లేదా ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందుతున్న సంస్థలలో ప్రవేశానికి మతం, జాతి, కులం మరియు భాషా ప్రాతిపదికపైన వివక్షత చూపరాదు.
- ప్రకరణ-30(1) - మైనారిటీ వర్గాలవారు, ప్రత్యేక విద్యా సంస్థలను ఏర్పరచుకొని నిర్వహించుకోవచ్చు.
- ప్రకరణ - 30(1)(a) - మైనారిటీలు నిర్వహిస్తున్న విద్యా సంస్థలను, వాటి ఆస్తులను ప్రభుత్యం స్వాధీనం చేసుకున్నప్పుడు వారికి ప్రత్యేక నష్టపరిహారాన్ని చెల్లించాలి.
గమనిక: ప్రకరణ - 30(1)(a) క్లాజును 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో చేర్చారు.
- ప్రకరణ 30(2) - ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందజేసే సమయంలో విద్యా సంస్థలను అల్బ సంఖ్యాక వర్గాల వారు నడిపే సంస్థలు, అధిక సంఖ్యాక వర్గాల వారు నడిపే సంస్థలు అనే వివక్షత చూపరాదు.
ప్రత్యేక వివరణ
- మైనారిటీ అనే పదాన్ని రాజ్యాంగంలో ప్రస్తావించినప్పటికీ నిర్వచించబడలేదు. “మైనారిటీ” అనే పదాన్ని రాజ్యాంగంలో ప్రకరణ 29, 30లో ప్రస్తావించారు.
- మైనారీటీలుగా వర్గీకరించడానికి రాష్ట్రాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దేశంలో రెండు రకాలైన మైనారిటీ వర్గాలు ఉన్నాయి.
- అవి మతపరమైన మరియు భాషాపరమైన మైనారిటీలు.
- హిందువులు మినహా మిగతావారందరూ మతపరమైన మైనారిటీ క్రిందకి వస్తారు. భాషాపరమైన మైనారిటీలు రాష్ట్రాల వారిగా మారుతుంటారు, ఉదా. ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణాలో కన్నడిగులు, గుజరాతీలు, మరాఠీలు భాషాపరమైన మైనారిటీ వర్గాలవుతారు.
సుప్రీంకోర్టు తీర్పులు
కేరళ విద్య పాఠ్యాంశాల సవరణ బిల్లు (1958) కేసులో కేరళ ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవ, కమ్యూనిస్టు భావాలతో కూడిన పాఠ్యాంశాలను చేర్చడంతో ఈ బిల్లును సుప్రీంకోర్టు సలహా పరిధికి నివేదించారు. పాఠ్యాంశాలలో తీవ్రవాద భావజాలాన్ని చేర్చడం చెల్లదని సుప్రీంకోర్టు చెప్పింది.డి.ఏ.వి. కాలేజ్ Vs స్టేట్ ఆఫ్ పంజాబ్ 1971 కేసులో విశ్వవిద్యాలయాలు మరియు దాని అనుబంధ కళాశాలలలో పంజాబీ భాష మాత్రమే బోధన భాషగా ఉండాలని నిర్ణయించారు. అయితే ఇది చెల్లుబాటు కాదని సుప్రీంకోర్టు తీర్పుచెప్పింది.అల్ సేయింట్స్ Vs స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1980 కేసులో మైనారిటీ విద్యాసంస్థల నిర్వహణలో ప్రభుత్వం జోక్యం చేసుకోరాదని సుప్రీంకోర్టుతీర్పు చెప్పింది.టి.ఎం.ఎ.పాయ్ Vsస్టేట్ ఆఫ్ కర్ణాటక 2003 కేసులో మైనారిటీ విద్యాసంస్థల నిర్వహణలో ప్రభుత్వం ఏ సందర్భంలో జోక్యం చేసుకోవచ్చో, జోక్యం చేసుకోరాదో వివరణ ఇస్తూ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది.మైనారిటీ స్థాయి నిర్ణయించడానికి రాష్ట్రాన్ని మాత్రమే యూనిట్‌గా తీసుకోవాలి. మైనారిటీ అనే పాదంలో భాషాపరమైన మరియు మతపరమైన మైనారిటీలు ఉండవచ్చు. బోధన మరియు బోధనేతర సిబ్బంది నియామకాలు, వారిపై పాలనా నియంత్రణ సంబంధిత మేనేజ్‌మెంట్‌కే ఉంటుంది. ప్రభుత్వం ధనసహాయం పొందని మైనారిటీ విద్యాసంస్థ ఫీజులను నియంత్రించే అధికారం ప్రభుత్వానికి ఉండదు. అయితే క్యాపిటేషన్ ఫీజులను నియంత్రించవచ్చు.
Fundamental Rights of Indian Constitution (Articles 12-35)-17
20:58:00
0