Fundamental Rights of Indian Constitution (Articles 12-35)-16

TSStudies
0
Right Against Exploitation - Articles 23 - 24 of Indian Constitution notes in Telugu

 సుప్రీంకోర్టు తీర్పులు

ఎ.కె.గోపాలన్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ మద్రాస్‌ (1950)
ఒక వ్యక్తిని అరెస్టు చేస్తున్నప్పుడు అతనికి అరెస్టుకు గల కారణాలను తెలియచేయడం సంబంధిత పోలీస్‌ అధికారి బాధ్యత. అలాగే అరెస్టు కాబడిన వ్యక్తి తన వాదనను వినిపించేందుకు అవకాశం ఇవ్వాలి. దీనిని లాటిన్‌ పరిభాషలో “Audi Alteram Partem” (ఆడీ ఆల్టిరమ్‌ పార్చెమ్‌) అనగా “హియర్‌ ది అదర్‌ సౌండ్‌ టు” అని అర్థం. అంటే అభియోగం మోపడిన వ్యక్తికి తన నిర్జోషిత్వాన్ని వినిపించేందుకు అవకాశం ఇవ్వాలి.

అబ్బుల్‌ సమర్థ Vs స్టేట్‌ ఆఫ్‌ ఉత్తరప్రదేశ్‌ (1962)
అరెస్టైన వ్యక్తిని 24 గంటల్లో సమీప కోర్టులో హాజరు పరచకపోతే 24 గంటలు గడిచిన తర్వాత ఆ వ్యక్తి విడుదల చేయబడుటకు హక్కు కలిగి ఉంటాడని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.

జోగిందర్‌ కుమార్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ ఉత్తర ప్రదేశ్‌
ఒక వ్యక్తిని అరెస్టు చేసినప్పుడు ఆ సమాచారాన్ని కుటుంబ సభ్యులకు కాని, స్నేహితునికి కాని సంబంధిత వ్యక్తులకు కాని తెలియచేయాలి. 

ప్రకరణలు 23- 24 - పీడన నిరోధపు హక్కులు
  • ప్రకరణ 23(1) ప్రకారం, మానవులతో వ్యాపారం, బలవంతపు వెట్టిచాకిరిని ఈ ప్రకరణ నిషేధిస్తుంది.
  • వ్యక్తుల ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా ఏ పని చేయించరాదు. పై చర్యలకు పాల్పడినవారు పార్లమెంటు చేసిన చట్టాల ప్రకారం శిక్షార్హులు అవుతారు.
  • నిబంధన 23లో “బేగార్‌” అనే పదాన్ని ప్రయోగించారు. బేగార్‌ అనగా వెట్టిచాకిరి. ఉత్తర భారతదేశంలో “హాలీ” అంటారు. అనగా ఎలాంటి పారితోషికము లేకుండా వ్యక్తుల చేత పనిచేయించుకోవడం. దీనిని 1976లో వెట్టిచాకిరి చట్టం ద్వారా నిషేధించారు.
  • ఈ నిబంధన స్వయంగా అమలులోకి రాదు. అందుకే 1956లో పార్లమెంటు అశ్లీల, అసభ్య వ్యాపార నిరోధక చట్టాన్ని రూపొందించింది.
  • ప్రకరణ 23(2) ప్రకారం, ప్రజా ప్రయోజనం కోసం పౌరులపై ప్రభుత్వ ఉద్యోగులపై నిర్బంధ సేవలను విధించవచ్చు. దీనిని దోపిడి కింద పరిగణించరు.
ప్రకరణ-24 - బాల కార్మిక వ్యవస్థ రద్దు 
దీని ప్రకారం 14 సం.రాలలోపు వయస్సు ఉన్న బాలలను ప్రమాదకర మరియు ఇతర పనులలో వినియోగించరాదు. అలా వినియోగిస్తే నేరం అవుతుంది. చట్ట ప్రకారం శిక్షార్డులవుతారు. ఈ నిబంధన కూడా స్వయంగా అమలులోకి రాదు. దీనికి సంబంధించి పార్లమెంటు చట్టం చెయ్యాల్సి ఉంటుంది. ఇప్పటివరకు. తదనుగుణంగా చేయబడినవి
Article 24 meaning in telugu,Article 25 meaning in telugu,Article 23 and 24 meaning in telugu,article 26 meaning in telugu,article 27 meaning in telugu,article 28 meaning in telugu
బాలకార్మిక వ్యవస్థ నిషేధం - ముఖ్య చట్టాలు
  • ఫ్యాక్టరీల  చట్టం - 1948
  • గనుల చట్టం - 1958
  • బీడీ మరియు సిగరెట్ల కార్మికుల చట్టం - 1966
  • బాల కార్మిక వ్యవస్థ నిషేధ చట్టం - 1986
  • బాల కార్మిక హక్కులు, కమీషన్ల చట్టం - 2005
ఈ చట్టం ద్వారా జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో బాలల కోసం ప్రత్యేక కమీషన్లు ఏర్పాటు చేశారు. 
ఎం.సి. మెహతా Vs తమిళనాడు, 1997 కేసులో సుప్రీంకోర్టు 14 వయస్సు లోపల ఉన్న బాలలను ఏ రకమైన ప్రమాదకరమైన పరిశ్రమలలో కానీ, ఇతర పనులలో కానీ వినియోగించరాదని తీర్పు చెప్పింది. అలాగే 
బందువా ముక్తిమోర్చా Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా, 1997 కేసులో కూడా ఇదే తీర్పును సుప్రీంకోర్టు ప్రకటించి బాలల సంరక్షణకు ప్రత్యేక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని, బాలకార్మికులను పనిలో వినియోగించే యజమానిపై రూ. 20,000 వరకు జరిమానా విధించాలని పేర్కొంది.

ప్రకరణలు 25 - 28 - మత స్వాతంత్య్రపు హక్కులు
  • ప్రకరణ 25(1) - ప్రతి వ్యక్తి తన అంతరాత్మ ప్రభోదానుసారం ఏ మతాన్నైనా అవలంబించి, ఆచరించి ప్రచారం చేసుకోవడానికి స్వేచ్చ ఉంది.
  • ప్రకరణ 25(2) - అయితే ఈ స్వేచ్చ ప్రజాశాంతికి, నైతికతకు, ప్రజారోగ్యానికి భంగం కలిగించరాదు. అలాంటి సమయాలలో ప్రభుత్వం పరిమితులు విధించవచ్చు. మత విషయాలను నియంత్రించవచ్చు. అలాగే హిందూ మతంలో కొన్ని సామాజిక సంస్కరణలు చేపట్టవచ్చు.
ప్రకరణ-25లో రెండు వివరణలు ఉన్నాయి. అవి
  • సిక్కు మతస్థులు తలపాగా, కత్తి ధరించడం సిక్కు సాంప్రదాయంలో అంతర్భాగం
  • ప్రకరణ-25(2)(b)లో పేర్కొన్న “హిందువులు” అనే పదంలో సిక్కులు, జైనులు మరియు బౌద్దులు కూడా సమ్మిళతమై ఉన్నారు.
ప్రకరణ-26 - మత సంస్థలు - మతపరమైన వ్యవహార నిర్వహణలో స్వేచ్చ
  • ప్రజా శాంతికి, నైతికతకు ఆరోగ్యానికి భంగం కలిగించకుండా వ్యక్తులు మత సంస్థలను ఏర్పాటు చేసి నిర్వహించుకోవచ్చు.
  • అ మత సంస్థలను, ధర్మాదాయ సంస్థలను స్థాపించవచ్చు.
  • తమ తమ సంస్థలను నిర్వహించుకోవచ్చు.
  • స్థిర చరాస్థులను, సంపాదించుకోవచ్చు. 
  • అమలులో ఉన్న చట్టాలకు లోబడి వాటిని నిర్వహించుకోవచ్చు.
ప్రకరణ-27 - మతవ్యాప్తి లేదా మత పోషణకు గాను పన్నులు వసూలు చేయరాదు
మత ప్రాతిపదికపై ప్రజలపైన పన్నులు విధించరాదు మరియు వసూలు చేయరాదు. ఈ నిబంధన పన్నులు వసూలు చేయడాన్ని మాత్రమే నిషేధిస్తుంది. అయితే మత ప్రాతిపదికపైన ప్రత్యేక సేవలు అందించినందుకు గాను వ్రజల నుంచి ప్రభుత్వం రుసుము వసూలు చేయవచ్చు.
ఉదా. దేవాలయంలో ప్రత్యేక దర్శనాలకోసం, సేవల కోసం రుసుం వసూలు చేయడం రాజ్యాంగ బద్ధమే.

ప్రకరణ - 28 - విద్యాలయాల్లో మత బోధన నిషేధం
  • ప్రకరణ 28(1) ప్రకారం ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే ప్రైవేటు విద్యా సంస్థలలో ప్రత్యేక మత బోధన నిషేధం.
  • ప్రకరణ 28(2) ప్రకారం పై నిబంధనకు కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ప్రభుత్వం చేత నిర్వహించబడుతున్న దేవాదాయ ధర్మాదాయ సంస్థలలో ప్రత్యేక మత బోధన చేయవచ్చు. 
  • ప్రకరణ 28(3) ప్రకారం ప్రభుత్వ గుర్తింపు పొంది, ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందే (Aided) విద్యా సంస్థలలో ఒక వ్యక్తి ఐచ్చికంగా (Voluntarily), లేదా మైనర్‌ అయితే తల్లిదండ్రులు లేదా సంరక్షకుని అనుమతితో తప్ప, ప్రత్యేక మత ప్రార్ధన లేదా బోధనలలో పాల్గొనమని ఒత్తిడి చేయరాదు.

Post a Comment

0Comments

Post a Comment (0)