Indian Judiciary -Supreme Court, High Court, Judicial Activism
Practice Questions from Supreme Court of Indian Constitution
TSPSC నూతన ప్రమాణాల అనుగుణంగా రూపొందించబడిన అత్యంత ప్రామాణిక, విశ్లేషణాత్మక అనువర్తన ప్రశ్నలు
1. హైకోర్టు, సుప్రీంకోర్టుల న్యాయమూర్తులకు సంబంధించి ఏ విషయంలో పోలికలు ఉన్నాయి.
ఎ) తొలగింపు
బి) రాజీనామా
సి) స్వతంత్ర ప్రతిపత్తి
డి) పైవన్నియు
2. సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష అధికారం నుండి మినహాయించబడిన అంశాలు
ఎ) పార్లమెంటరీ ప్రక్రియలు
బి) మంత్రి మండలి సలహా
సి) సభాధ్యక్షుల నిర్ణయాలు
డి) పైవన్నియు
3. కొలిజియం వ్యవస్థలోని లోపాలను గుర్తించండి
ఎ) వృత్తిపరమైన ప్రీతి
బి) పారదర్శికత లేకపోవడం
సి) అనూహ్యమైన జాప్యం జరగడం
డి) పైవన్నియు
4. జాతీయ న్యాయ నియామకాల కమీషన్‌కు సంబంధించి సరైనది
ఎ) ఇది రాజ్యాంగపరమైన సంస్థ
బి) న్యాయ నియామకాలు, ఖాళీలను గుర్తిస్తుంది
సి) దీనికి అధిపతిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటారు.
డి) పైవన్నియు సరైనవి
5. సుప్రీం కోర్టు తీర్పులను
ఎ) రాష్ట్రపతి మార్చవచ్చు
బి) పార్లమెంటు మార్చవచ్చు
సి) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మార్చవచ్చు
డి) పైవేవియు కాదు
6. ఈ క్రింది ఏ అంశాలను సుప్రీంకోర్టు ఆవిష్కరించింది
ఎ) ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం
వి) మౌలిక నిర్మాణ సూత్రం
సి కొలిజీయం భావన
డి) పైవన్నియు
7. అమెరికా సుప్రీం కోర్టుకు భారత సుప్రీంకోర్టుకు మధ్యతేడా
ఎ) పదవి విరమణ వయస్సు
బి) అపరితమైన న్యాయ సమీక్ష అధికారం
సి) పై రెండు
డి) పై రెండూ కాదు
8. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దేనికి ఆపాదించవచ్చు
ఎ) న్యాయ సమీక్ష
బి) న్యాయ శాఖ క్రియాశీలత
సి) న్యాయ శాఖ పవిత్రత
డి న్యాయ శాఖ ఆధిక్యత
9. సుప్రీంకోర్టును రాజ్యాంగ పరిరక్షణ కర్తగా పేర్కొంటారు. దానికి ప్రాతిపదిక
ఎ) జీత భత్యాలు
బి) స్వతంత్ర సర్వీసులు
సి) న్యాయ సమీక్ష
డి) న్యాయశాఖ ఆధిక్యత
10. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం సుప్రీంకోర్టులోప్రారంభమైనప్పుడు ఆనాటి ప్రధాన న్యాయమూర్తి
ఎవరు
ఎ) ఎం. హిదయతుల్లా
బి) వి.ఆర్. కిష్ట అయ్యర్
సి) పి.ఎన్. భగవతి
డి) ఎ.ఎస్. ఆనంద్
11. ఈ క్రింది ఏ కోర్టు లేదా కోర్టులను కోర్ట్ ఆఫ్ రికార్ట్స్‌గా పరిగణిస్తారు
ఎ) సుప్రీం కోర్టు
బి) హైకోర్టును
సి) జిల్లా కోర్టును
డి) ఎ & బి
12. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను తరువాత కాలంలో మార్చవచ్చు. దీనిని ఏమంటారు
ఎ) క్యూరేటివ్ పిటిషన్
బి) రివిజన్ పిటిషన్
సి) ప్రాస్పెక్‌టివ్ ఓవర్ రూలింగ్
డి) స్టేర్ డెసిసిస్
13. ఈ క్రింది వానిలో ఏది సరిగా జతపరచబడలేదు.
ఎ) ఆర్షికల్ 124 - సుప్రీం కోర్టు నిర్మాణం
బి) ఆర్జికల్ 136 - స్పెషల్ లీవ్ పిటీషన్
సి) ఆర్టికల్ 143 - సలహా పరిధి
డి) ఆర్టికల్ 129 - ప్రారంభ పరిధి
14. ఈ క్రింది వాటిలో సుప్రీం కోర్టు అప్పీళ్ళ పరిధిలోనికి రానిదేది.
ఎ) రాష్ట్రపతి ఎన్నిక వివాదాలు
బి) సివిల్ వివాదాలు
సి) సలహా వివాదాలు
డి) క్రిమినల్ కేసులు
15. సుప్రీం కోర్టు సలహాను కోరే అధికారం ఎవరికి కలదు.
ఎ) రాష్ట్రపతి
బి) ప్రధానమంత్రి
సి) గవర్నర్
డి) పై అందరూ
16. రాజ్యాంగ వ్యాఖ్యానం సుప్రీం కోర్టు యొక్క ఏ పరిధిలోకి వస్తుంది.
ఎ) ప్రారంభ పరిధి
బి) సలహా పరిధి
సి) అప్పీళ్ళ పరిధి
డి) ప్రత్యేక పరిధి
17. న్యాయసమీక్ష అధికారం ఎవరికి ఉన్నది.
ఎ) పార్లమెంటు
బి) రాష్ట్రపతి
సి) సుప్రీంకోర్టు
డి) పై అందరికి
సమాధానాలు
1.డి 2.డి 3.డి 4.డి 5.డి 6.డి 7.సి 8.బి 9.సి 10.సి 11.డి 12.సి 13.డి 14.సి 15.ఎ 16.సి 17.సి