Indian Constitution Practice Bits-39

TSStudies
0
Welfare Mechanism for Enforcement of Indian Constitution Previous Exams Bits in Telugu

Welfare Mechanism for Enforcement of Indian Constitution Practice Bits

జ్ఞానాత్మక , అవగాహన సంబంధిత ప్రాక్టీస్‌ క్వశ్చన్స్‌

1. ఏ ప్రకరణ ప్రకారం మైనారిటీలు విద్యాలయాలు ఏర్పాటు చేసుకోవచ్చు.

ఎ) ప్రకరణ 29 

బి) ప్రకరణ 30(2)

సి) ప్రకరణ 30(1)

డి) ప్రకరణ 31


2. లోక్‌సభలో ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను రాష్ట్రపతి ఏ ప్రకరణ ప్రకారం నామినేట్‌ చేస్తారు.

ఎ) ప్రకరణ 330 

బి) ప్రకరణ 331

సి) ప్రకరణ 332 

డి) ప్రకరణ 333


3. రాష్ట్ర విధాన సభలో గవర్నర్‌ ఏ ప్రకరణ ప్రకారంఒక ఆంగ్లో ఇండియన్‌ను నామినేట్‌ చేస్తారు.

ఎ) ప్రకరణ 330 

బి) ప్రకరణ 331

సి) ప్రకరణ 332 

డి) ప్రకరణ 333


4. మైనారిటీలకు ప్రాథమిక విద్యను మాతృభాషలో బోధించడానికి వీలు కల్పించే ప్రకరణ ఏది.

ఎ) ప్రకరణ 350 

బి) ప్రకరణ 350(A)

సి) ప్రకరణ 350(B) 

డి) ఏదీకాదు


5. స్రీ శిశు సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చే ప్రకరణ

ఎ) ప్రకరణ 15 

బి) ప్రకరణ 15(1)

సి) ప్రకరణ 15(2) 

డి) ప్రకరణ 15(3)


6. ఏ ప్రకరణ ప్రకారం వెనుకబడిన వర్గాల వారికి విద్యాపరమైన పయోజనాలను కల్పిస్తుంది.

ఎ) 15(1) 

బి) 15(3)

సి) 15(5) 

డి) ఏదీకాదు


7. ఏ ప్రకరణ ప్రకారము రాష్ట్రపతి, వెనుకబడిన తరగతుల వారి స్థితిగతులను పరిశీలించడానికి ఒక జాతీయ కమీషన్‌ను ఏర్పాటు చేయవచ్చును.

ఎ) ప్రకరణ 330 

బి) ప్రకరణ 340

సి) ప్రకరణ 350 

డి) ప్రకరణ 360


8. ఏ కేనులో ఓ.బి.సి.లలో క్రీమీ లేయర్‌నుప్రస్తావించారు.

ఎ) అశోక్‌ కుమార్‌ ఠాకూర్‌ 

బి) ఇందిరా సహాని

సి) బాలాజి 

డి) ఏదీకాదు


9. సామాజికంగా వెనుకబడిన వర్గాల్లో ఏ ప్రకరణ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నారు.

ఎ) ప్రకరణ 16(1)

బి) ప్రకరణ 16(2)

సి) ప్రకరణ 16(3)

డి) ప్రకరణ 16(4)


10. మొదటి బి.సి. కమీషన్‌ 1953 సం.లో ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది.

ఎ) కాకా సాహెబ్‌ కాలేకర్‌

బి) బల్వంత రాయ్‌ మెహతా

సి) వెంకటాచలయ్య

డి) ఎవరూ కాదు


11. 1978లో మొరార్డీ దేశాయ్‌ ప్రభుత్వం రెండవ బి.సి. కమీషన్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అధ్యక్షుడెవరు

ఎ) అశోక్‌ మెహతా 

బి) బి.పి. మండల్‌

సి) నరసింహరావు 

డి) ఎవరూ కాదు


12. రెండవ బి.సి. కమీషన్‌ ప్రధాన సిఫారసులను పేర్కొనుము.

ఎ) జనాభాలో బి.సి.లు 52% ఉన్నారు కనుక వీరికి విద్య ఉద్యోగాల్లో తగినంత ప్రాతినిధ్యం ఉండాలి.

బి) ఓ.బి.సి.లకు 27% రిజర్వేషన్లు కల్పించాలి.

సి) పై రెండూ

డి) ఏదీ కాదు


13. మైనారిటీ హక్కుల పరిరక్షణకు ఏర్పాటు చేయబడిన మైనారిటీ కమీషన్‌ మొట్టమొదట చట్టబద్ధంగా ఏర్పడిన సంవత్సరం

ఎ) 1956 

బి) 1992 

సి) 1984 

డి) 1979


14. షెడ్యూల్డ్‌ కులాలను నిర్ధారించే అధికారం ఎవరికి గలదు.

ఎ) రాష్ట్రపతి

బి) ప్రధానమంత్రి

సి) షెడ్యూల్డ్‌ కులాల, తెగల కమీషన్‌

డి) సుప్రీం కోర్టు


15. జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఏ సం.లో ఏర్పాటు చేశారు.

ఎ) 1991 

బి) 1992

సి) 1993 

డి) 1994


16. 6వ షెడ్యూలు ఏ రాష్ట్రాలలోని గిరిజనులకు ప్రత్యేక పాలనా ఏర్పాట్లను గురించి తెలియచేస్తుంది.

ఎ) మేఘాలయ, అస్సాం, నాగాలాండ్‌, మణిపూర్‌

బి) అరుణాచల్‌ప్రదేశ్‌, నాగాలాండ్‌, అస్సాం, త్రిపుర

సి) అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం

డి) పైవేవీ కావు


17. రాజ్యాంగం ప్రకారం ఏ రాష్ట్రాలకు గిరిజన సంక్షేమం కోసం మంత్రి ఉండాలి.

ఎ) అస్సాం, నాగాలాండ్‌, మణిపూర్‌

బి) మధ్యప్రదేశ్‌, ఒరిస్సా, జార్ఖండ్, చత్తీస్‌ఘడ్‌

సి) ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్నాటక

డి) పైవేవీ కావు


18. చక్మా ఆదివాసులు ఏ రాష్ట్రానికి చెందినవారు.

ఎ) త్రిపుర 

బి) అరుణాచల్‌ ప్రదేశ్‌

సి) మిజోరాం 

డి) పై అన్నియు


19. మండల కమీషన్‌ నివేదికను అమలులోకి తీసుకువచ్చిన ప్రభుత్వం

ఎ) రాజీవ్‌ గాంధీ 

బి) వి.పి.సింగ్‌

సి) పి.వి.నరసింహ రావు 

డి) ఎవరూ కాదు


20. ఓ.బి.సి.ల్లో క్రీమీలేయర్‌ను గుర్తించడానికి ఎవరి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయబడింది.

ఎ) పి.ఎ.సంగ్మా 

బి) జీవన్‌ రెడ్డి

సి) రామానందన్‌ ప్రసాద్‌ 

డి) కృష్ణ


21. రామానందన్‌ సిఫారసుల మేరకు పార్లమెంటు ఏర్పాటు చేసిన కమీషన్‌ ఏది.

ఎ) నేషనల్‌ కమీషన్‌ ఫర్‌ బ్యాక్‌వర్డ్‌

బి) నేషనల్‌ కమీషన్‌ ఫర్‌ షెడ్యూల్డ్‌ క్యాస్ట్ 

సి) నేషనల్‌ కమీషన్‌ ఫర్‌ షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌

డి) నేషనల్‌ కమీషర్‌ ఫర్‌ మైనారిటీస్‌


22. ఎస్‌.సి. మరియు ఎస్‌.టి. క్రీమీలేయర్‌ గురించి సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్చు ఇచ్చింది.

ఎ) అశోక్‌కుమార్‌ ఠాకూర్‌ Vsబీహార్‌

బి) బాలాజి Vs కేరళ

సి) ఇందిరా సహానీ Vs ఉత్తరప్రదేశ్‌

డి) ఏదీకాదు


23. ప్రైవేటు రంగాల్లో ఎస్‌.సి. మరియు ఎస్‌.టి.లకు రిజర్వేషన్స్‌ ప్రకటించిన ప్రభుత్వం ఏది.

ఎ) ఎన్‌.డి.ఏ 

బి) యు.పి.ఏ

సి) పై రెండూ 

డి) ఏదీ కాదు


24. ఎస్‌.సి., ఎస్‌.టి.లకు ఏ ప్రకరణల ప్రకారము లోక్‌సభలోను రాష్ట్రాల విధాన సభల్లోను రిజర్వేషను కల్పించబడ్డాయి.

ఎ) ప్రకరణ 330, ప్రకరణ 332

బి) ప్రకరణ 332, ప్రకరణ 330

సి) ప్రకరణ 332, ప్రకరణ 334

డి) ప్రకరణ 334, ప్రకరణ 332



సమాధానాలు

1.సి 2.బి 3.డి 4.బి 5.డి 6.సి 7.బి  8.బి 9.డి 10.ఎ 11.బి 12.సి 13.బి 14.ఎ 15.సి 16.సి 17.బి 18.డి 19.బి 20.సి 21.ఎ 22.ఎ 23.సి 24.ఎ


Post a Comment

0Comments

Post a Comment (0)