TSPSC నూతన ప్రమాణాల అనుగుణంగా రూపొందించబడిన అత్యంత ప్రామాణిక, విశ్లేేషణాత్మిక అనువర్తన ప్రశ్నలు
1. ఆధునిక రాజ్యాలు
ఎ) జాతీయ రాజ్యాలు
బి) లౌకిక రాజ్యాలు
సి) సంక్షేమ రాజ్యాలు
డి) పైవన్నియు
2. ఈ క్రింది వారిలో ఏ వర్గం యొక్క సంక్షేమం గురించి రాజ్యాంగంలో ప్రస్తావించబడలేదు
ఎ) వికలాంగులు
బి) ఆర్థికంగా వెనుకబడినవారు
సి) విద్యాపరంగా వెనుకబడినవారు
డి) సామాజికంగా వెనుకబడినవారు
3. జాతీయ బాలల విధానం 2013 ప్రకారం అంతర్గతంగా ఉన్న అంశాలు
ఎ) అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటన
బి) ఐక్య రాజ్య సమితి బాలల హక్కులపై తీర్మానాలు
సి అంతర్జాతీయ ప్రోటోకాల్
డి) పైవన్నియు
4. సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకంలో అంశం
ఎ) దీనిని 1975 అక్టోబర్‌లో ప్రవేశపెట్టారు
బి) బాలల యొక్క భౌతిక, మానసిక, సామాజిక వికాసానికి కృషి చేయడం
సి) వివిధ శాఖలు అమలు చేస్తున్న పథకాలను సమన్వయం చేయడం
డి) పైవన్నియు
5. ఈ క్రింది వాటిలో ఏది సరిగా జతపరచబడినది
ఎ) వికలాంగుల హక్కుల చట్టం - 1995
బి) మానసిక ఆరోగ్య చట్టం - 1987
సి) బాల కార్మిక నిషేధ నియంత్రిత చట్టం - 1986
డి) పైవన్నియు సరైనవి
6. గ్రామీణ పేదరికానికి కారణాలు
1) ఆదాయాల్లో వ్యత్యాసం
2) అవిద్య
3) కుల వ్యవస్థ
4) వ్యవసాయం పై అతిగా ఆధారపడడం
ఎ) 1, 2, 3, 4
బి) 1, 2, 3
సి) 2, 3, 4
డి) 1, 4
7. భారత రాజ్యాంగంలో ఆహార భద్రతకు సంబంధించి ప్రత్యక్ష పరోక్ష సంబంధం ఉన్న ప్రకరణలు
1) 21 2) 39
3) 47 4) 43
ఎ) 1, 2, 3
బి) 1, 2, 4
సి) 1, 2, 3, 4
డి) 2, 4
8. జాతీయ ఆహార కమీషన్‌కు సంబంధించి సరైనది
ఎ) ఇందులో ఒక ఛైర్మన్ ఐదుగురు సభ్యులుంటారు
బి) ఇద్దరు మహిళ సభ్యులు తప్పనిసరిగా ఉండాలి
సి) ఒక సభ్యుడు షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలకు చెంది ఉండాలి
డి) పైవన్నియు సరైనవి
9. స్వయం సహాయక గ్రూపుల విధులు
ఎ) పొదుపును ప్రోత్సహించడం
బి) అంతర్గత రుణాలు ఇవ్వడం
సి) సభ్యుల సమస్యలను చర్చించడం
డి) పైవన్నియు
10. స్వయం సహాయక గ్రూపుల ప్రాముఖ్యతను తెలియచేసే అంశాలు
ఎ) పేదరిక నిర్మూలన
బి) ఉద్యోగ అవకాశాలు పెంపొందించడం
సి) ఆదాయ పెరుగుదలకు కృషి చేయడం
డి) పైవన్నియు
సమాధానాలు
1.డి 2.బి 3.డి 4.డి 5.డి 6.ఎ 7.ఎ 8.డి 9.డి 10.డి