TS SI Mains Exam 2023 General Studies Question Paper with Answer Key (Questions from 51 to 100)

TSStudies
0
TSLPRB SI Final Exam 2023 General Studies Question Paper with Key

TS SI Final Exam Question Paper With Key 2023

TS SI Exam 2023 General Studies Question Paper

TSLPRB Police SI Preliminary Exam Date - 7 August 2022.

TSLPRB Police SI Final Written Exam 2023 Date - 8 & 9 April 2023

TS SI Final Written Exam held on 09-04-2023, 10 A.M to 1 P.M. (General Studies)

తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి (TSLPRB) SI, ASI ఫైన‌ల్ రాత‌ప‌రీక్షలో భాగంగా ఏఫ్రిల్ 9వ తేదీ ఉద‌యం 10:00 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1:00 గంట‌ వరకు General Studies ప‌రీక్ష‌ను నిర్వ‌హించారు.

51. ఎల్ -నినో ను ఈ క్రింది విధంగా కూడా పిలుస్తారు :
(1) వడగళ్లు     (2) దక్షిణ డోలాయనం     (3) టోర్నడో     (4) జెట్‌ ప్రవాహం
52. ఋగ్వేదమునకు సంభందించి ఈ క్రింది ప్రవ్రచనములలో ఏది సరియైనది కాదు ?
(1) బుగ్వేదం దేవాలయము గురించి కానీ, విగ్రహారాధన గురించి కానీ ప్రస్తావించలేదు.
(2) బుగ్వేదంలో రుద్రుని గురించి చాలా సార్లు ప్రస్తావించడం జరిగింది.
(3) ఉషాన్‌, స్త్రీ దేవత గూర్చి 300 పర్యాయములు ప్రస్తావించింది.
(4) అంత్యక్రియలకు సంభందించి బుగ్వేదము రెండు విధానాలు పాతిపెట్టడము, కాల్బడమును గురించి తెలుపుతున్నది.

53. వ్యవసాయము మరియు పరిశ్రమలు శాతవాహనుల కాలంలో బాగా వృద్ధి చెందినాయి. వివిధ వృత్తి పరమైన శాఖలు మరియు వారు నిర్వహించే పనిని జతపరచుము.

గ్రూప్‌-1                                     గ్రూప్‌-2

(శాఖలు)                                  (వృత్తులు)

(a) కోలికులు                      (i) కుండలు చేయువారు

(b) కులరికులు                   (ii) చేనేత పనివారు

(c) వధికులు                       (iii) వెదురు బుట్టలు అల్లేవారు

(d) వసకారులు                    (iv) వడ్రంగి పనివారు

(a)          (b)          (c)           (d)

(1)          (iv)         (iii)          (ii)           (i)

(2)          (ii)           (i)            (iv)         (iii)

(3)          (i)            (ii)           (iii)          (iv)

(4)          (iii)          (iv)         (i)            (ii)

54.  ఈక్రింది ఏ ఆకాంక్షం తో పాటు ఉప-ఆయన రేఖ అధిక పీడన పట్టీలు/మేఖలలు ఏర్పడతాయి?
(1)  {45^0}  ఉత్తర & దక్షిణ     (2)  {30^0}  ఉత్తర & దక్షిణ
(3)  {90^0}  ఉత్తర & దక్షిణ     (4)   {5^0} ఉత్తర & దక్షిణ

55. ప్రతిపాదన(A) : స్వీయ క్రమశిక్షణ, ధ్యానముతో ఎవరైనా ముక్తిని పొందగలరు అని హీనయానీయులు భావించిరి.
కారణం (R): బుద్దుని యొక్క సహకారము మరియు అనుగ్రహముతోనే అందరూ ముక్తిని పొందగలరు అని మహాయానీయులు భావించిరి.
సరియైన జవాబును కనుగొనుము.

(1) (A) మరియు (R) రెండూ సత్యము మరియు (A) కి (A) సరియైన వివరణ
(2) (A) మరియు (R) రెండూ సత్యము మరియు (A) కి (R) సరియైన వివరణ కాదు
(3) (A) సత్యము కానీ (R) అసత్యము
(4) (A) అసత్యము కానీ (R) సత్యము

56. ఈ క్రింది ప్రవచనములలో గుప్తులకు సంభందించి సరి కానిది ఏది ?

(1) గుప్త ముద్రికలపై 'గరుడ' చిహ్నమును ఉపయోగించినారు
(2) అలహాబాద్‌ ప్రశస్తి ఖరోప్టి లిపిలో వ్రాయబడింది
(3) కుమార గుప్తుని నాణెములు 'కార్తికేయుని' చిహ్నముతో తయారు చేయబడినాయి
(4) అధికార వికేంద్రీకరణ గుప్తుల పరిపాలన యొక్క ముఖ్య లక్షణము

57. అశోక చక్రవర్తికి సంబంధించిన ఈ క్రింది ప్రవచనములలో ఏది సరికానిది ?

(1) అశోకుని శాసనములు దక్షిణ దేశస్థులను చోళులు, పాండ్యులు, సత్యపుత్రులు మరియు కేరళపుత్రులని పేర్కొన్నాయి
(2) అశోకుని యొక్క ఒక శాసనము ప్రకారము సిరియా పాలకుడు అంటియోకస్‌ థియెస్‌, ఈజిప్ట్‌ పాలకుడు మూడవ టాలమీ ఫిలడెల్భస్‌, మాసిడోనియాకు చెందిన అంటిగోనస్‌ గోనటస్‌, సైరన్కు చెందిన మాగాస్‌ మరియు ఏపిరిస్కు చెందిన అలెగ్జాండరలు సమకాలికులని వీరి మధ్య రాయభారాలు నడిచినవని వివరించింది.
(3) సిలోన్‌ కు చెందిన మేఘవర్లుడు అశోకుని సమకాలికుడ్తుయ
(4) పాటలీపుత్ర నగరము నందు మూడవ భౌద్ధ సంగీతి, మొగ్గలిపుత్తతిస్స అధ్యక్షతన జరిగినట్లు ఎక్కడా అశోకుని శాసనములు వివరించుటలేదు.

58. ప్రతిపాదన(A): గాంధీ యొక్క సత్యాగ్రహం రెండు ముఖ్యమైన సిద్ధాంతములు సత్యము మరియు
కారణం (R); సత్యాన్ని విడువకుండా ఉండడమే సత్యాగ్రహము.

సరియైన జవాబును కనుగొనుము.
(1) (A) మరియు (R) రెండూ సత్యము మరియు (A) కి (A) సరియైన వివరణ
(2) (A) మరియు (R) రెండూ సత్యము మరియు (A) కి (R) సరియైన వివరణ కాదు
(3) (A) సత్యము కానీ (R) అసత్యము
(4) (A) అసత్యము కానీ (R) సత్యము

59. కోరియోలిస్‌ శక్తి ప్రభావం లేని ప్రాంతం
(1) భూమధ్యరేఖ     (2) కర్కటరేఖ     (3) మకరరేఖ     (4) ధృవాలు

60. రాజ్య నిర్వహణకు రాజ్యానికి ఉండవలసిన ఏడు అంగముల గురించి అర్థశాస్త్రములో వివరించబడింది. అవి :
(1) రాజు, రాజధాని, భాండాగారము, భూభాగము, పరిపాలన, దండ మరియు మిత్రరాజ్యాలు.
(2) రాజు, మంత్రులు, సైన్యము, రాజధాని, భాండాగారము, దండ మరియు మిత్రరాజ్యాలు 
(3) రాజు, పురోహితుడు, సైన్యము, రాజధాని, భాండాగారము, న్యాయం మరియు దండ.
(4) రాజు, పురోహితుడు, రాజధాని, భూభాగము, పరిపాలన, దండ మరియు న్యాయం.

61. కబీర్‌ కు సంబంధించినంతవరకు ఈ క్రింది ప్రవ్రచనములలో ఏది సరి కానిది ?
(1) కబీర్‌ విగ్రహారాధనను ఖండించెను.
(2) కబీర్‌ కుల వ్యవస్థను ఖండిస్తూ మానవులందరూ సమానమే అని భావించెను.
(3) తని యొక్క భోదనలు ముఖ్యంగా ఉర్దూ భాషలో లభ్యమవుతున్నాయి
(4) ఇతని యొక్క ఆనుచరులు కబీర్‌ ఫంథీలు అని పిలువబడినారు.

62. భారతదేశపు నాణ్యమైన మరియు అతిపెద్ద బొగ్గు నిక్షేపాలు గల ప్రదేశం 
(1) గోండ్వానా శిల    (2) దక్కను ట్రాప్‌ (నాపల)
(3) వింధ్యా శిల         (4) కడపశిల

63. 1857 సిపాయిల తిరుగుబాటు ఫలితములో ఏది సరి అయినది కాదు?
(1) ఈస్ట్‌ ఇండియా కంపెనీచే భారతదేశములో నిర్వహిస్తున్న కంపెనీ పరిపాలనను బ్రిటిష్‌ ప్రభుత్వానికి బదలాయించడము జరిగింది.
(2) ఔద్  ప్రాంతంలో సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్న ఎక్కువ మంది 'తాలూక్‌ దార్ల" కు తిరిగి 
వారిఎస్టేట్లను అప్పగించడము జరిగింది.
(3) 1857 సిపాయిల తిరుగుబాటుకు కారణము పాలకులు మరియు పాలితుల మధ్య సంబంధము లేకపోవడమే అని భావించింది ప్రభుత్వము. అందులో భాగంగానే 1861 లో ఇండియన్‌ కౌన్సిల్స్‌ చట్టాన్ని ప్రవేశపెట్టడము జరిగింది.
(4) తాత్కాలికంగా ముస్లిమ్‌ సిపాయిలు ఇండియన్‌ఆర్మీలో ప్రవేశానికి అనర్హులు అని ప్రకటించడం

64. ప్రచండ చక్రవాతాలు (టైపూనులు) ప్రధానంగా ఈ మండలాలలో సంభవిస్తాయి:
(1) {6^0}\& {20^0} భూమధ్యరేఖకు ఉత్తర & దక్షిణంగా 
(2) {30^0} భూమధ్యరేఖకు ఉత్తర & దక్షిణంగా 
(3) {45^0} నుండి {50^0} భూమధ్యరేఖకు ఉత్తర & దక్షిణంగా 
(4) భూమధ్యరేఖకు {60^0} ఉత్తర & దక్షిణంగా 

65. ఈ క్రింది వానిని జతపరచుము.

గ్రూప్‌-1              గ్రూప్‌-2

(రాజులు)            (వంశములు)
(a) కనిష్కుడు            (i) పార్థియనులు
(b) మినాండర్‌           (ii) శకులు
(c గొడోఫర్నిస్‌           (iii) కుషానులు
(d) మావోస్‌              (iv) ఇండో-గ్రీకులు

(a)          (b)          (c)           (d)

(1)          (iii)          (iv)         (i)            (ii)

(2)          (iii)          (i)            (ii)           (iv)

(3)          (iii)          (ii)           (iv)         (i)

(4)          (ii)           (i)            (iv)         (iii)

66. 2023, ఫిబ్రవరిలో జరిగిన హైద్రాబాద్‌ ఈ-పిక్స్‌ ఫార్ములా-ఇ కారు రేసు విజేత ఎవరు?
(1) లూకాస్‌ డి గ్రాసీ (2) మిచ్‌ ఎవన్స్‌    (3) ఆంటోనియో ఫీలిక్స్‌ డ కోస్టా (4) జిన్‌-ఎరిక్‌- వెర్గ్న్

67. బెంగాల్‌ స్వదేశి ఉద్యమంలో స్వదేశీ మరియు బహిష్కరణ ఉద్యమాలకు అనుగుణంగా ఎన్నో సంస్థలు వెలసిల్లినాయి. ఈ క్రింది సంస్థలు వాటిని స్థాపించిన నాయకులతో జతపరచుము.

     గ్రూప్‌-I                             గ్రూప్‌-II
     (సంస్థలు)                           (స్థాపించినవారు)
(a) డాన్సొసైటీ                    (i) కృష్ణకుమార్మిత్రా
(b) స్వదేశీ బాందవ్సమితి      (ii) పులిన్దాస్
(c) అంటీ-సర్క్యులర్సొసైటీ    (iii) ఆశ్విన్కుమార్దత్
(d) ఢాకా అనుశీలన్సమితి      (iv) సతీష్చంద్ర ముఖర్జీ

(a)          (b)          (c)           (d)

(1)          (i)          (ii)         (iii)            (iv)

(2)          (ii)          (iii)            (iv)           (i)

(3)          (iii)          (i)           (iv)         (ii)

(4)          (iv)           (iii)            (i)         (ii)


68. భారతదేశంలో బాక్ట్సైట్‌ నిల్వలు అత్యధికంగా గల రాష్ట్రం ఏది?
(1) జార్ఖండ్     (2) మహారాష్ట్ర     (3) ఒడిషా     (4) గుజరాత్‌

69. ప్రతిపాదన(A): ఫిరోజ్‌ షా తుగ్లక్‌, హిందూ సమాజములోని పూజారులయిన బ్రాహ్మణులపై కూడా జిజియా పన్నును విధించెను.
కారణం (R): ఫిరోజ్‌ షా తుగ్లక్‌ అభిప్రాయములో మానవులందరూ సమానమే మరియు ఎవరూ ఎక్కువ తక్కువ కాదు.
సరియైన జవాబును కనుగొనుము.
(1) (A) మరియు (R) రెండూ సత్యము మరియు (A) కి (A) సరియైన వివరణ
(2) (A) మరియు (R) రెండూ సత్యము మరియు (A) కి (R) సరియైన వివరణ కాదు
(3) (A) సత్యము కానీ (R) అసత్యము
(4) (A) అసత్యము కానీ (R) సత్యము

70. జైన మత స్థాపకుడు అయిన మహావీరుడు తన 72 ఏట క్రీపూ 527 లో నేటి బీహార్‌ నందుగల పావలో మరణించెను. ఈ సందర్భాన్ని రెండు ప్రాంతీయ రాజ్య ప్రజలు గౌరవ సూచకంగా దీపాల పండుగగా జరుపుకొనిరి. జైన సాంప్రదాయము ప్రకారము నేటి ప్రముఖ హిందూ పండుగ 'దీపావళి' నాటి దీపాల పండుగ కొనసాగింపే. ఈ పండుగ జరుపుకున్న రెండు రాజ్యాలను గుర్తించుము.
(1) హార్యంకులు మరియు శాక్యులు (2) చేది మరియు విదేహాలు
(3) మల్లకిలు మరియు లిచ్చవులు (4) ఉగారులు మరియు భోగులు

71. మహమ్మద్‌ బిన్‌ తుగ్గక్‌ కాలము నాటి ఈ క్రింది ముఖ్య ఘటనలను కాలక్రమానుసారం మొదటి నుండి చివరి వరకు క్రమము చేయండి.
(a) రాగి నాణిములను ప్రవేశపెట్టడము,
(b) ఢిల్లీ నుండి దౌలతాబాద్‌ కు రాజధాని మార్పు.
(c) గంగా యమునా అంతర్వేదిలో పన్నులను/ఆదాయము పెంచడము.
(d) ఖురసాన్‌ పైకి దండయాత్ర.
(1) a, c, d, b    2) c, a, b, d    (3) a, d, b, c    (4) c, b, a, d

72. సాంప్రదాయము ప్రకారము, బహమనీ సుల్తానులలోని ఒకరికి దైవకృతమైన శక్తులు ఉన్నాయని మరియు దక్కన్లో ఈయన వర్షాలు కురిపించాడని ప్రజలు భావించేవారు. కావున ఈయన వాలి(సాధువు) అనే బిరుదును పొందినాడు. ఆయన ఎవరు?
(1) అల్లాఉద్దీన్‌ బహమన్‌ షా (2) ముజాహిద్‌ షా
(3) మొదటి అహమ్మద్‌ షా (4) మొదటి ముహమ్మద్‌ షా

73 మాంగోలో-ద్రవిడియన్లు ఎక్కువగా గల ప్రాంతం :
(1) ఒడిషా     (2) తెలంగాణ     (3) కర్ణాటక     (4) గుజరాత్‌

74. రాగి ఖనిజ నిక్షేపాలు విస్తారంగా లభించే రాష్ట్రం ఏది?
(1) రాజస్థాన్‌     (2) మద్యప్రదేశ్‌     (3) జార్ధండ్‌     (4) పశ్చిమ బెంగాల్‌

75. అక్బర్‌ కు సంబంధించినంతవరకు ఈ క్రింది ప్రవచనములలో సరికానిది ఏది ?
(1) రాజులు 'దైవాంశసంభూతులు' అను అభిప్రాయమును అక్బర్‌ నమ్మెను.
(2) ప్రజల బాగోగులను స్వయంగా తెలుసుకొనుటకు సూర్యోదయ సమయానికే అక్బర్‌ ఝురోకా-ఇ-దర్శన్ను ప్రవేశపెట్టిను.
(3) 1580 సంవత్సరం నాటికి అక్బర్‌ 'ఐన్‌-ఇ-దహసలా' అను నూతన రెవెన్యూ విధానమును ప్రవేశపెట్టెను.
(4) అక్బర్‌ తన పరిపాలన కాలంలో మూడు కోటలు లాహోర్‌, ఆగ్రా మరియు ఢిల్లీల యందు నిర్మించెను 

76. అరబ్బుల దండయాత్ర నాటికి సింధ్‌ రాజధాని ఏది ?
(1) దేవల్‌    (2) ముల్తాన్‌     (3) భటిండా     (4) అలోర్‌

77. భారతదేశం లోని ఏ రాష్ట్రం గొర్రెల పెంపకంలో ముందున్నది 
(1) ఆంధ్రప్రదేశ్‌     (2) తెలంగాణ     (3) కర్ణాటక     (4) మహారాష్ట్ర

78. ఔరంగజేబ్‌ జిజియా పన్నును ఏ సంవత్సరములో హిందువులపై ప్రవేశపెట్టెను
(1) క్రీ.శ.1658     (2) క్రీ.శ.1675     () క్రీ.శ.1679    (4) క్రీ.శ.1680

79. డీజిల్‌ ఇంజన్ల లోకోమోటిన్లను ఉత్పత్తిచేయు ప్రదేశం _____
(1) వారణాసి     (2) చైన్నై     (3) హైదరాబాద్‌     (4) ముంబాయి

80. గాంధీ యొక్క మత మరియు నైతిక అభిప్రాయములు ఎ౦తో ఉన్నతమయినవి; కాని రాజకీయాల్లో వీటిని అనుసరించడము అర్ధం కానటువంటి విషయము. ఏ వైస్రాయ్‌ గాంధీ అభిప్రాయాలను ఉద్దేశించి తన అభిప్రాయమును త్ర విధంగా వ్యక్తం చేసెను ?
(1) లార్డ్‌రీడింగ్‌     (2)లార్డ్ ఇర్విన్     (3) లార్డ్‌ విల్లింగడన్‌     (4) లార్డ్‌ ఛేమ్స్ ఫర్డ్ 

81. ఈ క్రింది వానిని జతపరుచుము
    గ్రూప్‌-1                                                        గ్రూప్‌-2
(ఆలయములు)                                             (నిర్మాతలు)
(a) రాజరాజేశ్వర ఆలయము- తంజావూర్‌          (i) నందివర్మ
(b) సూర్య దేవాలయము-కోణార్క్‌                       (ii) అరుమోళివర్మన్‌
(c) విజయనారాయణ దేవాలయము- బేలూర్‌     (iii) మొదటి నరసింహదేవుడు
(d) వైకుంఠ పెరుమాళ్‌ దేవాలయము కంచి       (iv) బిట్టిదేవ మరియు విష్ణువర్ధనుడు

(a)          (b)          (c)           (d)

(1)       (i)        (ii)           (iii)        (iv)

(2)       (ii)       (iv)          (i)          (iii)

(3)       (ii)       (iii)          (iv)        (i)

(4)       (iv)      (i)            (ii)         (iii)

82. భౌద్ధ మత సాంప్రదాయములో స్థూపము ప్రత్యేకతను కలిగి ఉంది. స్థూప కట్టడములు ముఖ్య పట్టణముల శివారులలో నిర్మించబడినాయి. ఈ సందర్భంగా ఏ జత సరి అయినటువంటిది కాదు?
(1) మృగదవ స్థూపము - మధుర
(2) ధర్మ రాజిక స్థూపము - తక్షశిల
(3) సాంచి స్థూపము - విదిశ
(4) అమరావతి స్థూపము - ధరణికోట

83. క్రింది వానిలో ఒక గ్రహాన్ని భూమి యొక్క కవల అంటారు.
(1) బుధుడు     (2) అంగారకుడు     (3) శుక్రుడు     (4) 4 నెప్ట్యూన్‌

84. రేఖాంశ లోయలను డూన్స్‌ అని కూడా అంటారు, అవి ఎక్కడ కలవు.
(1) ఉన్నత హిమాలయాలు (2) ట్రాన్స్‌ హిమాలయాలు
(3) నిమ్న హిమాలయాలు    (4) శివాలిక్ కొండలు 

85. 1526 సంవత్సరం మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రాహీం లోడి తరపున నిజమైన రాజపుత్ర వీరునిగా పోరాటం చేసిన గ్వాలియర్ పాలకుడు ఎవరు?
(1) రాజా విక్రమ్ జిత్     (2) రాజా ఇంద్రజిత్‌     (3) రాజా హేమరాజ్‌     (4) రాజా మేదినీ రాయ్‌

86. దక్షిణ భారతదేశంలో అతితక్కువ మానవాభివృద్ది సూచి (HDI) గల రాష్ట్రం :
(1) కర్ణాటక     (2) కేరళ (3) తెలంగాణ (4) ఆంధ్రప్రదేశ్‌

87. ప్రస్తుత సొలిసిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ఎవరు?
(1) ముకుల్‌ రోహత్గి     (2) గోపాల్‌ సుబ్రమణ్యం    (3) తుషార్‌ మెహతా      (4) కె. కె. వేణుగోపాల్‌

88. క్రింది వాటిలో ఏది కరేవా నేలలో భాగం కాదు ?
(1) పుల్వామా (2) కుల్గాం (3) గుల్మార్గ్ (4) పాలంపూర్ 

89. ఖిర్గంగా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో కలదు 
(1) హర్యాణా     (2) పశ్చిమ బెంగాల్‌     (3) ఉత్తర్‌ ప్రదేశ్‌     (4)  హిమాచల్‌ ప్రదేశ్‌

90.  గాలి యొక్క వేగాన్ని దేనితో కొలుస్తారు 
(1) అనిమో మీటర్      (2) హైగ్రోమీటర్‌     (3) థెర్మోమీటర్‌     (4) విండ్‌ వేన్‌

91. క్రింది వాటిలో అత్యంత పొడి ఎడారి వీటి?
(1) పెరూవియన్‌ ఎడారి     (2) మెక్సికన్‌ ఎడారి
(3) గోభీ ఎడారి         (4) కలహరీ ఎడారి

92. ఈ క్రింది ప్రవచనములలో పీష్వాలకు సంబంధించి సరికాని ప్రవచనము ఏది?
(1) 1713 సంవత్సరములో ఛత్రపతి సాహు, బాలాజీ విశ్వనాథ్‌ ను పీష్వాగా నియమించెను.
(2) తండ్రి మరణనంతరము 1720 లో బాజీరావు పీష్వాగా నియమించబడిఅతహని మరణంగా 1750 వరకు కొనసాగెను.
(3) పీష్వా బాలాజీ బాజీరావు కాలంలోనే ఛత్రపతి రామ్రాజ్‌ అనేక అధికారములను పీష్వాకు బదలాయించెను. దీంతో పీష్వానే మరాఠ రాజ్యానికి నిజమైన పాలకుడు ఆయెను
(4) పీష్వా బాజీరావు “హిందూ-పాద్‌ -పాద్షాహి' అను నినాదమును వ్యాప్తి చేసెను.

93. ఈ క్రింది వానిని జతపరుచుము
    గ్రూప్‌-1                                    గ్రూప్‌-2
(సాంఘిక సంస్కర్తలు)                 (పత్రికలు మరియు మాగజిన్స్‌)
(a) రాజా రామ్‌ మోహన్‌ రాయ్‌  (i) తత్వభోధిని
(b) బాలశాస్త్రీ జంబేకర్‌‌           (ii) ముకుల్‌
(c) శివనాథ శాస్త్రి                   (iii) సంబాద్‌ కౌముది
(d) దేవేంద్రనాద్‌ టాగోర్‌         (iv) దర్పణ్‌

(a)          (b)          (c)           (d)

(1)       (iii)        (ii)         (iv)        (i)

(2)       (iii)        (iv)        (ii)         (i)

(3)       (i)          (ii)         (iii)        (iv)

(4)       (ii)          (i)         (iv)        (ii)

94. సింధూ నాగరికతకు చెందిన అనేక ప్రదేశములు నదీ పరీవాహక ప్రాంతాలలో విలసిల్లినాయి. ఈ క్రింది ప్రదేశములకు సంబంధించిన నదులను జతపరుచుము.

గ్రూప్‌-1                    గ్రూప్‌-2

     (ప్రదేశములు)                (నదులు)
(a) హరప్పా                       (i) సింధూ
(b) మొహెంజోదారో‌           (ii) రావి
(c) కాళిభంగన్‌                   (iii) రంగోయి
(d) భన్వాళి                        (iv) ఘగ్గర్‌

(a)          (b)          (c)           (d)

(1)          (i)           (ii)         (iii)        (iv)

(2)          (iii)         (iv)        (ii)         (i)

(3)          (iv)         (iii)        (i)          (ii)

(4)          (ii)          (i)          (iv)        (iii)

95. రాంఘర్  బొగ్గు గనులు ఈ రాష్ట్రంలో కనుగొనబడ్డాయి 
(1) ఒడిషా    (2) కర్ణాటక     (3) జార్ధండ్‌     (4) పశ్చిమ బెంగాల్‌

96. రాజ పురోహితుని యొక్క పాత్ర విజయనగర రాజుల కాలములో చాలా ముఖ్యమైనది. ఈ క్రింది పురోహితులు మరియు ఆయా రాజులతో జతపరుచుము.

గ్రూప్‌-1                              గ్రూప్‌-2

(రాజ పురోహితులు)            (రాజులు)
(a) కృష్ణశక్తి ఆచార్య                (i) రెండవ దేవరాయలు
(b) నరసింహ ఆచార్య‌           (ii) రెండవ హరిహర రాయలు
(c) రంగనాథ దీక్షితులు         (iii) రామ రాయలు
(d) తాతాచార్యులు                  (iv) కృష్ణదేవరాయలు

(a)          (b)          (c)           (d)

(1)          (i)          (ii)         (iii)            (iv)

(2)          (ii)          (i)            (iv)           (iii)

(3)          (iii)          (iv)           (i)         (ii)

(4)          (i)           (ii)            (iv)         (iii)

97. బుతుపవన అడవులు ఈ మండలానికి చెందినవి 
(1) శుష్క/పొడి ప్రాంతం (గ్2) ఆర్ధ/తేమ ప్రాంతం
(3) అతి శుష్క/పొడి ప్రాంతం (4) అర్థ ఆర్థ్ర ప్రాంతం

98. గుప్తుల పరిపాలనకు సంభందించి ఈ క్రింది ప్రవ్రచనములలో సరికానటువంటిది ఏది ?
(1) వికేంద్రీకృత పరిపాలనే గుప్తుల పరిపాలన యొక్క ముఖ్య లక్షణము.
(2) 'ఆయుక్తక' మరియు 'విషయపతి'లు జిల్లా అధికారులు.
(3) గుప్తుల యొక్క సామ్రాజ్యము ఆహారములు (రాష్ట్రములు)గా ఆహారములు ప్రదేశ లేదా విషయములు (జిల్లాలు)గా విభజింపబడింది.
(4) గ్రామము పరిపాలనలో ఆఖరు విభజన, గ్రామ, పల్లి, గుల్మ మరియు కేతక అను అనేక రకములైన గ్రామములు గుప్తుల కాలంలో కనబడతాయి,

99. సరికాని జతను గుర్తించుము.
(1) అనుమకొండ శాసనము - గణపతిదేవుడు
(2) బయ్యారము శాసనము - మైలాంబ
(3) చందుపట్ల శాసనము - పువ్వుల ముమ్మిడి
(4) ద్రాక్షారామ శాసనము - మల్యాల హేమాద్రి

100. షేర్షా కాలంలో ప్రధానంగా నలుగురు మంత్రులు వివిధ భాధ్యతలను నిర్వహించేవారు. మంత్రులు మరియు వారు నిర్వహించిన విధులను జతపరుచుము.

గ్రూప్‌-I                                                  గ్రూప్‌-II
(a) దివాన్‌-ఇ-అరిజ్                         (i) రెవెన్యూ మరియు ఆర్థిక మంత్రి
(b)దివాన్‌-ఇ--విజారత్‌                    (ii) అధికార పత్రాలను తయారు చేయడము మరియు వివిధ                                                                      అధికారులకు పంపడము
(c) దివాన్‌-ఇ-రిసాలత్‌                     (iii) సైనిక మంత్రి
(d) దివాన్‌-ఇ-ఇన్లా                            (iv) విదేశాంగ మంత్రి

(a)          (b)          (c)           (d)

(1)          (i)          (ii)         (iii)            (iv)

(2)          (iv)          (i)            (ii)           (iii)

(3)          (ii)          (iv)           (iii)         (i)

(4)          (iii)           (i)            (iv)         (ii)



Post a Comment

0Comments

Post a Comment (0)