1. అసఫ్ జాహీలు ఏ ప్రాంతానికి చెందినవారు
సౌదీ అరేబియా (అప్పటిలో టర్కీ రాజ్యంలో భాగం)
2. భారతదేశ సంస్థానంలలో అతి పెద్దది
హైదరాబాద్
3. అసఫ్ జాహీలు ఏ తెగకు చెందిన వారు
తురాని తెగ
4. మీర్ ఖమ్రుద్దీన్ ఏ మొఘల్ చక్రవర్తుల దగ్గర పనిచేసాడు
ఔరంగజేబు (4000 మన్సబ్ దారి ర్యాంక్ ), 1వ షా అలం (అవధ్ సుభేదార్), పారుఖ్ షియార్,(దక్కన్ సుభేదారు), మహమ్మద్ షా రంగీలా (మాళ్వ సుభేదరు & మొఘల్ ప్రధాని)
5. మహమ్మద్ షా రంగీలా ను కీలుబొమ్మగా నియంత్రించిన వారు
సయ్యద్ సోదరులు (అబ్దుల్లా & హుస్సేన్)
6. సయ్యద్ సోదరులను హతమార్చడంలో కీలక పాత్ర పోషించినది
మీర్ ఖమ్రుద్దీన్
7. మీర్ ఖమ్రుద్దీన్ ఏ యుద్ధం లో ముభారీజ్ ఖాన్ ను ఓడించి దక్కన్ లో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు
షకర్ ఖేదా యుద్ధం
8. షకర్ ఖేదా యుద్ధం ఎప్పుడు జరిగింది
1724 అక్టోబర్
9. ఏ యుద్ధం ద్వారా అసఫ్ జాహీల పాలన ప్రారంభం అయింది
షకర్ ఖేదా యుద్ధం
10. అసఫ్ జాహీల అధికారిక బాష
1. పారశీకం 2. ఉర్దూ
11. నిజాం ఉల్ ముల్క్ యొక్క బిరుదులు
i). చిన్ కిలీచ్ ఖాన్ (ఔరంగజేబు తో)
ii) నిజాం ఉల్ ముల్క్ (ఫరూక్ షియార్ తో )
iii). ఫతే జంగ్ (ఫరూక్ షియార్ తో )
iv). అసఫ్ జా (మహమ్మద్ షా రంగీలా చే)
12. నిజాం ఉల్ ముల్క్ రాజధాని
ఔరంగాబాద్
13. నిజాం ఉల్ ముల్క్ ఎవరెవరికి శాంతి ఒప్పందం కుదిరిచ్చాడు
నాదిర్ షా & మహమ్మద్ షా
14. నిజాం ఉల్ ముల్క్ ఎక్కడ మరణించాడు
మహారాష్ట్రలోని బుర్హాన్ పూర్ లో
15. నిజాం ఉల్ ముల్క్ యొక్క పెద్ద కుమారుడు పేరు
ఘాజి ఉద్దీన్
16. నిజ్జం ఉల్ ముల్క్ యొక్క రెండవ కుమారుడు
నాజర్ జంగ్
17. నిజాం ఉల్ ముల్క్ యొక్క కలం పేరు
షాకిర్
18. ప్రజల క్షేమాలే ముఖ్యమని మరణ శాసనం లో రాసుకున్న అసఫ్ జాహీ పాలకుడు ఎవ్వరు
నిజాం ఉల్ ముల్క్
19. నిజాం ఉల్ ముల్క్ యొక్క పరిపాలన కాలం
1724 - 1748
20. కర్నల్ యుద్ధం ఎప్పుడు జరిగింది
1739 లో (నాదిర్ షా vs మహమ్మద్ షా రంగీలా)
21. నాజర్ జంగ్ యొక్క పరిపాలన కాలం
1748 - 1750
22. నిజాం ఉద్దౌలా గా ఎవరిని పిలుస్తారు
నాజర్ జంగ్
23. నాజర్ జంగ్ ఎవరిచేత హతమార్చబడ్డాడు
హిమ్మత్ ఖాన్
24. నాజర్ జంగ్ హత్యకు కుట్ర పన్నినది ఎవరు
ముజఫర్ జంగ్
25. ముజఫర్ జంగ్ డూప్లే కు ఇచ్చిన బిరుదు
ఝఫర్ జంగ్
Tags: Asaf Jahi Dynasy, Nijaams of Hyderabad, TSPSC Notes, TSPSC Group 2 Practice Questions, Telangana History Bit Bank in Telugu, Telangana History Study Material in Telugu