Asaf Jahi Dynasty Bit Bank 3

TSStudies
0
1. నిజాం అలీ తరువాత పాలకుడు ఎవరు 
సికిందర్ జా (Sikander Jah)

2. సికిందర్ జా పరిపాలన కాలం 
1803 - 1829

3. సికిందర్ జా యొక్క ప్రధాని పేరు 
చందూలాల్

4. సికింద్రాబాద్ ఎవరి పేరు మీదుగా ఏర్పడింది 
సికిందర్ జా 

5. కర్నూల్ లోని అహోబిలం దేవాలయాన్ని నిర్మించింది ఎవరు 
చందూలాల్ 

6. హెన్రీ రస్సెల్ సైనిక దళాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసాడు 
1816

7. ఫిండారి దాడులను, స్థానిక తిరుగుబాటులను తిప్పి కొట్టడంలో కీలక పాత్ర పోషించింది 
రస్సెల్ సైనికదళం 

8. ప్రధాని చందూలాల్ రస్సెల్ సైనికదళ నిర్వహణ కొరకు ఎవరి వద్ద 60 లక్షల రూపాయలు అప్పు తీసుకొన్నాడు 
పామర్ & కో 

9. పామర్ & కో వద్ద ఎంత వడ్డీకి అప్పు తీసుకున్నాడు 
25%

10. పామర్ & కో వర్తకుల దగ్గర ఎంతకి అప్పు తీసుకునేవారు 
12%

11. చందూలాల్ పామర్ & కో కి అప్పు తీర్చలేక ఏ ప్రాంతాన్ని వర్తకపు హక్కులు ఇచ్చాడు 
బీరార్ 
Note : ఈ అప్పులను చెల్లించడంలో బ్రిటిష్ రెసిడెంట్ అధికారి అయిన చార్లెస్ మెట్ కాఫ్ హైదరాబాద్ నవాబుకు సహకరించాడు. దీనికి ప్రతిఫలంగా సర్కారు ప్రాంతంను శాశ్వతంగా ఇచ్చాడు . 

12. 3వ నిజాం ఎవరు 
సికిందర్ జా 

13. 4వ నిజాం ఎవరు 
నాసిరుద్దౌలా 

14. నాసిరుద్దౌలా పరిపాలన కాలం 
1829 -1857

15. హైద్రాబాదులో మొట్టమొదటి పాఠశాల ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసారు 
1834 లో సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ 

16. వహాబీ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు 
ముబారిజ్ ఉద్దౌలా (ఇతను నాసిరుద్దౌలా సోదరుడు)

17. వహాబీ ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభమైనది 
1839

18. వహాబీ ఉద్యమానికి మద్దతు పలికిన కర్నూల్ నవాబు ఎవరు 
గులాం రసూల్ ఖాన్ 

19. చందూలాల్ తన పదవికి ఎప్పుడు రాజీనామా చేసాడు 
1843

20. చందూలాల్ తరువాత నిజాం యొక్క ప్రధాని ఎవరు 
సిరాజ్ ఉల్ ముల్క్ 

21. 1853 బీరార్ ఒప్పందం ప్రకారం నిజాం ఏ ప్రాంతాలని కోల్పోవలసి వచ్చింది 
బీరార్, రాయచూర్, ఉస్మానాబాద్ 

22. 'ది రెబెలియన్ ఇన్ ఇండియా' అనే పుస్తకం రచించినది ఎవరు 
బ్రూస్ నార్తజ్ 
Note : ఈ పుస్తకం లో బీరార్ ఒప్పదం గురించి 'న్యాయ దేవత చెవుల్లో దూది పెట్టి ఆమెను ఆంగ్లేయులు చెవిటిదాన్ని , గుడ్డిదాన్ని చేశారు' అని పేర్కొన్నాడు. 

23. ఎవరి కాలంలో చాదర్ ఘడ్ వంతెన నిర్మించబడింది 
నాసిరుద్దౌలా 

23. కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్ ఎప్పుడు నిర్మించబడింది 
1854
Note : తర్వాతి కాలంలో ఇది గాంధీ హాస్పిటల్ గా మారింది 

24. సిరాజ్ ఉల్ ముల్క్  తరువాత ఎవరు నిజాం యొక్క ప్రధాని అయ్యారు 
మీరు తురబ్ అలీ ఖాన్ (1వ సాలార్ జంగ్)

25. మీరట్ తిరుగుబాటు ఎప్పుడు ప్రారంభమైనది 
1857 మే 10 న 
Note : ఇది ప్రారంభమైన వారం రోజులకు నసీరుద్దౌలా మరణించడంతో అఫ్జల్ ఉద్దౌలా హైదరాబాద్ నవాబు అయ్యాడు 

                                                                                          

Tags: TSPSC Group 2 Bit Bank in Telugu, Telangana History Study Material in Telugu, Asaf Jahi Dynasty, Telangana History Practice Questions in Telugu

Post a Comment

0Comments

Post a Comment (0)