Asaf Jahi Dynasty Bit Bank 4

TSStudies
1. 4వ నిజాం ఎవరు 
నసీర్ ఉద్దౌలా 

2. అఫ్జల్ ఉద్దౌలా యొక్క పరిపాలన కాలం 
1857-1859

3. అఫ్జల్ ఉద్దౌలా యొక్క ప్రధాని పేరు 
1 వ సాలార్ జంగ్ (మీర్ తురబ్ అలీ ఖాన్)

4. హైదరాబాద్ రెసిడెన్సీ పైన దాడి చేసింది ఎవరు 
తురాబాజ్ ఖాన్ 

5. తురబాజ్ ఖాన్ దాడిని తిప్పి కొట్టినది ఎవరు 
డేవిడ్సన్ 

6. సిపాయిల తిరుగుబాటు కాలంలో బ్రిటిష్ వారికి సహకరించి 'స్టార్ అఫ్ ఇండియా' అనే బిరుదు పొందినది ఎవరు 
అఫ్జల్ ఉద్దౌలా
Note : దీనితో రాయచూర్, ఉస్మానాబాద్ ప్రాంతాలను తిరిగి పొందాడు 

7. అఫ్జల్ పేరు మీదుగా మొదటిగా నాణేలు ముద్రించిన ప్రధాని ఎవరు 
1వ సాలార్ జంగ్ 

8. పోస్ట్ ఆఫీస్ ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసారు 
1862

9. ఎవరి కాలంలో చౌమహల్ ప్యాలస్ నిర్మాణం పూర్తి అయింది 
అఫ్జల్ ఉద్దౌలా
Note : సలాబత్ జంగ్ 1750 లో దీని నిర్మాణాన్ని ప్రారంభించాడు 

10. నయాపూల్ వంతెనను(1859-66) నిర్మించినది ఎవరు 
అఫ్జల్ ఉద్దౌలా

11. అఫ్జల్ గంజ్ రైల్వే బ్రిడ్జి ను ఏ సంవత్సరంలో నిర్మించారు 
1860

12. అఫ్జల్ ఉద్దౌలా తరువాత నిజాం ఎవరు 
మీర్ మహబూబ్ అలీ ఖాన్ 

13. మీర్  మహబూబ్ అలీ ఖాన్ యొక్క పరిపాలన కాలం 
1869 - 1911

14. మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఎన్నవ నిజాం 
6 వ నిజాం 

15. మీర్ మహబూబ్ అలీ ఖాన్ యొక్క ప్రధాని ఎవరు 
1వ సాలార్ జంగ్ 
నోట్: ఇతను మైనరుగా ఉన్నప్పుడే పాలకుడగుటచే పాలన బాధ్యతలు 1వ సాలార్ జంగ్ మరియు షంషాద్ ఉమ్రా లకు అప్పగించబడ్డాయి 

16. 1వ సాలార్ జంగ్ ఎప్పుడు మరణించాడు 
1883
నోట్: ఇతని మరణం తరువాత పాలన బాధ్యతలు లార్డ్ రిప్పన్ మీర్ మహబూబ్ అలీ ఖాన్ కు అప్పగించబడ్డాయి 

17. చందా రైల్వే పథకం ఏ సంవత్సరంలో జరిగింది 
1883

18. హైదరాబాద్ లో మొట్టమొదటి బాలికల పాఠశాల ఏ సంవత్సరంలో నిర్మించబడింది 
1881 లో (గ్లోరియా హై స్కూల్)

19. నిజాం కళాశాలను ఎప్పుడు ఏర్పాటు చేసారు 
1887 లో (చాదర్ ఘాట్ లోని ఇంటర్మీడియట్ శాఖ మరియు మదర్సా-ఇ- అలియా విలీనం చేసి)

20. తెలంగాణాలో మొదటిసారిగా ముల్కీ హక్కులను ఎప్పుడు డిమాండ్ చేసారు 
1888 లో మీరు మహబూబ్ అలీ ఖాన్ కాలంలో 
నోట్: దీనికి స్పందించిన నిజాం 1888 లో ముల్కీ నిబంధనలు రూపొందించి స్థానికులనే ఉద్యోగులుగా నియమించాలని ఆదేశించాడు.

21. ముల్కీ అనగా అర్ధం ఏమిటి
స్థానికుడికి అధికారం ఇచ్చుట 
Note: 1919 లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వీటికి కచ్చితమైన అర్దాన్ని ఇచ్చి ఖచ్చితంగా అమలు  చేశాడు

***********************
మీర్  మహబూబ్ అలీ ఖాన్ 1893 లో లెజిస్లేటివ్ కౌన్సిల్ (మంత్రి మండలి) ఏర్పాటు చేసాడు
ఇతని కాలంలో ఈ క్రింది నిర్మాణాలు జరిగాయి
1874 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
1882 చంచలగూడ జైలు
1884 ఫలకనామ ప్యాలస్ (దీనిని వికారుద్దీన్ నిర్మించాడు)
1885 టెలిఫోన్ వ్యవస్థ
1890 నిజామియా అబ్జార్వేటరీ (సైన్స్ పరిశోధన కొరకు)
ఇంకా మోండా మార్కెట్, జింఖానా గ్రౌండ్, పరేడ్ గ్రౌండ్, గోల్ఫ్ కోర్సులను నిర్మించి హైదరాబాద్ అభివృద్ధికి కృషిచేశాడు
*************************

22. మూసీకి వరదలు ఏ సంవత్సరంలో వచ్చాయి
1908

23. 1 వ సాలార్ జంగ్ ఎంతమంది నిజాంల దగ్గర ప్రధానిగా చేసాడు
3

                                                                                          

Tags: TSPSC Group 2 Study Material in Telugu, TSPSC Notes in telugu, Asaf Jahi Dynasty Bit Bank in Telugu, Free Download TSPSC material in Telugu pdf