1969 Movement in Telangana-1969 ఉద్యమం

TSStudies
0
1969 Movement in Telangana- తెలంగాణ ఉద్యమం 1969

ఉద్యమ కారణాలు(Causes for the 1969 Movement):
1. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆంధ్ర వారు సీఎం అయితే తెలంగాణ వారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి కానీ అలా జరగలేదు 
2. తెలంగాణ వారి భాష ముతక భాష అని వీరి యాస బాగుండదని అలానే తెలంగాణ వారు అనాగరికులు(Uncultured), సోమరిపోతులు(Lazy fellows) అని విమర్శించేవారు.  
3. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రా ముఖ్యమంత్రులు 15 సంవత్సరాలు పరిపాలన చేస్తే 1971 వరకు తెలంగాణ వ్యక్తి కేవలం ఒక సంవత్సరం మాత్రమే పాలన చేశారు. 
4. 1965 రాష్ట్ర ప్రభుత్వ పొదుపు చర్యల్లో భాగంగా తాత్కాలిక ఉద్యోగులను అందరిని రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. దీంతో తెలంగాణలో చాలా మంది ఇంజనీర్లు నిరుద్యోగులు అయ్యారు దీని ఫలితంగా ఇంజనీర్లు అసంతృప్తి ఎక్కువ అయింది. 
5. రెండు ప్రాంతాల సివిల్ సర్వీసు అధికారుల సీనియార్టీలను కలిపి కామన్ సీనియార్టీ లిస్టును చేసింది.  దీనివల్ల తెలంగాణ ఉద్యోగుల ప్రమోషన్లలో తీవ్ర అన్యాయం జరిగింది. 
6. ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోని ఫారెస్ట్ శాఖ సిబ్బందిలో కొంత మంది ని తెలంగాణ ప్రాంతంలో నియమించింది. 
7. 1967లో తెలంగాణలోని మాధ్యమిక పాఠశాలలో టీచర్ ఉద్యోగులను మిగులు నిధులు ఉపయోగించి నింపమని ఉద్యమం చేస్తే మిగులు నిధులు లేవని ఆర్థిక శాఖ ప్రకటించింది.
8. మిగులు నిధులు లేవన్న కారణంతో తెలంగాణలో ఉన్న ఒకే ఒక ప్రాజెక్టు అయినా పోచంపాడు ప్రాజెక్టును అర్ధంతరంగా నిలిపివేశారు ఈ కారణాలు తెలంగాణలో 1969 ఉద్యమానికి బీజం వేసి అని చెప్పవచ్చు(Lead to Telangana Movement). 

1968లో కొత్తగూడెం విద్యుత్ కేంద్రంలో ముల్కీలను అధికంగా నియమించారు ఈ విధంగా నియమించిన నాన్ముల్కీలను తొలగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. 
దీనితో నాన్ ముల్కీలు హైకోర్టులో కేసు వేయగా 1969 జనవరి 3న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జస్టిస్ కుప్పుస్వామి నాన్ ముల్కీలకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. 
నాన్ ముల్కీ లకు వ్యతిరేకంగా కొత్తగూడెంలో కార్మికుల నాయకుడైన కృష్ణ జనవరి 10న నిరాహార దీక్ష ప్రారంభించారు ఈ దీక్షకు పానుగంటి పిచ్చయ్య మద్దతు తెలిపారు. 
1969 జనవరి 23న పోడు కృష్ణమూర్తి తన దీక్షను విరమింపజేశారు 
జనవరి 8న ఖమ్మం పట్టణంలో గాంధీ చౌక్ వద్ద రవీంద్రనాథ్ నిరాహార దీక్ష(Hunger Strike) ప్రారంభించారు ఇతనికి మద్దతుగా గోగినేని సత్యనారాయణ దీక్ష చేపట్టారు. ఇతనికి  మద్దతుగా వరంగల్, ఖమ్మం ప్రాంతంలో నిరసనలు జరిగాయి. 
1969 జనవరి 22న అన్నాబత్తుల రవీంద్రనాథ్ దీక్షను ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం వ్యవస్థాపక సభ్యుడు మాజీ కార్యదర్శి అయిన బి. కిషన్ పండ్లరసాన్ని ఇచ్చి విరమింపజేశాడు. 
ఈ ఉద్యమం ఉధృత రూపం దాల్చడంతో జనవరి 18, 19న కాసు బ్రహ్మానంద రెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్షం ఒప్పందం జరిగింది ఈ ఒప్పందంలోని అంశాలు:

  • i) ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ ప్రాంతంలో నియమించిన ఉద్యోగులందరినీ వెంటనే తొలగించి వారి స్థానాల్లో స్థానికులను నియమించాలి 
  • ii) తప్పుడు ముల్కీ సర్టిఫికెట్ల ద్వారా ఉద్యోగాలు సంపాదించిన వారి విషయంలో విచారణ జరిపించాలి 
  • iii) ముల్కీ నిబంధనలను ప్రభుత్వ విభాగాలకే కాక స్వయంప్రతిపత్తిగల సంస్థలకు కూడా వర్తింప చేయాలి 
  • iv) ఆంధ్ర ప్రాంతానికి తరలించిన తెలంగాణ మిగులు నిధుల లెక్కలు చేసి నిధులను తెలంగాణ ప్రాంతం కోసం వినియోగించాలి 
  • v) రాజధాని నగరమైన హైదరాబాద్లో విద్యావసతులు విస్తరించాలి 
  • vi) ఉద్యోగస్తుల సీనియారిటీకి సంబంధించిన విషయంలో కేంద్ర ప్రభుత్వం న్యాయస్థానాల నిర్ణయాలను వెంటనే అమలు పరచాలి.
అఖిలపక్ష సమావేశం తర్వాత తెలంగాణ ప్రాంతంలో పనిచేయుచున్న 4500 మంది నాన్ ముల్కీలను ఆంధ్ర ప్రాంతానికి తరలించడానికి జనవరి 21, 1969 న రాష్ట్ర ప్రభుత్వం జీవో 36ను విడుదల చేసింది.
ఈ జీవోను సవాలు చేస్తూ ఆంధ్ర ఉద్యోగులు 1969 జనవరి 31న ఐదుగురు తెలంగాణ ఉద్యోగినులు హైకోర్టులో రిట్ దాఖలు చేశారు.
ఫిబ్రవరి 3 1969 న జీవో 36 రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు కొట్టివేసింది (జస్టిస్ చిన్నప్పరెడ్డి నేతృత్వంలో)
ఫిబ్రవరి 20, 1969 న హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ ముల్కీ నిబంధనలు రాజ్యాంగ బద్ధమేనని కానీ నాన్ముల్కీలను ఆంధ్ర ప్రాంతానికి పంపరాదని వారికి ఉన్న చోటనే సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించాలని మరో తీర్పు చెప్పింది.
మార్చి 8, 1969 న సుప్రీంకోర్టు సూపర్ న్యూమరీ పోస్టులు(Super Numery Posts) సృష్టించడాన్ని నిలిపివేసింది.
మార్చి 28, 1969న సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధమని జీవో 36ను కొట్టివేసింది.

పోలీసు కాల్పులు 

  • 1969 జనవరి 20న శంషాబాద్ సమీపంలో ఉన్న ఉమదానగర్ వద్ద తొలిసారిగా పోలీసు కాల్పులు జరిగాయి.
  • 1969 జనవరి 21న శంషాబాద్ కాల్పులకు నిరసనగా నిజాం కళాశాలలో పోలీసులకు వ్యతిరేకంగా "పోలీసు జులుం బంద్ ఖరో"  నినాదంతో విద్యార్థులు సభ నిర్వహించారు.
  • 1969 జనవరి 24న మెదక్ జిల్లా సదాశివపేట లో పోలీసు కాల్పులు జరిగాయి. ఇందులో శంకర్ అనే విద్యార్థి గాయపడి జనవరి 25 న మరణించాడు. తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శంకర్. 



Post a Comment

0Comments

Post a Comment (0)