States Reorganisation Commission - రాష్ట్రాల పునర్విభజన కమిషన్

TSStudies
0
SRC 1953 December 29

రాష్ట్రాల పునర్విభజన కమిషన్ 1953 డిసెంబర్ 29


1948లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు పరిశీలనకై S K థార్ కమీషన్ ఏర్పాటు చేయబడింది..

1948 డిసెంబర్ లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకై జేవీపీ (JVP) కమిటీ ఏర్పాటు చేశారు.
భారతదేశాన్ని భాష ప్రాతిపదికన పునర్విభజన చేయటానికి రాష్ట్రాల పునర్విభజన కమీషన్ 1953 డిసెంబర్ 22న ఏర్పాట్లు చేస్తున్నట్లు భారత ప్రధాని నెహ్రూ లోకసభలో ప్రకటించారు.

1953 డిసెంబర్ 22న కేంద్ర ప్రభుత్వం సయ్యద్ ఫజల్ అలీ నాయకత్వంలో రాష్ట్రాల పునర్విభజన కమీషన్ ఏర్పాటు చేసింది.
ఈ కమీషన్ లోని మిగతా ఇద్దరు సభ్యులు 
1. హృదయేంద్ర కుంజ్రూ  (HN కుంజ్రూ)
2. కోవలం మాధవ ఫణిక్కర్ (KM ఫణిక్కర్)

ఈ కమిటీ విజ్ఞాపనలు సమర్పించడానికి చివరి తేదీ ని 1954 ఏప్రిల్ 3 గా నిర్ణయించారు.

ఈ కమిటీ పనితీరుకు కొన్ని మార్గదర్శక సూత్రాలు సూచించబడ్డాయి 
1. రాష్ట్రాలు ఏర్పాటు చేయడంలో భారతదేశపు ఐక్యతకు భద్రతకు భంగం కలుగరాదు.

2. రాష్ట్రాల ఏర్పాటు యావత్ ఆర్థిక పరిపాలన సౌకర్యాలకు అనుగుణంగా ఉండాలి

3. జాతీయ అభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలకు ప్రతిబంధకంగా రాష్ట్రాల ఏర్పాటు ఉండరాదు.



20 నెలలు కస్టపడి ఈ కమిటీ తన నివేదికను 1955 సెప్టెంబర్ 30 న సమర్పించినది.


కమిషన్ పనితీరు (S.R.C's in Actions / Working of SRC)

1. రాష్ట్రాల వైశాల్యాన్ని(Area) ప్రాతిపదికగా తీసుకోలేదు 
2. భాషా ప్రాతిపదికను(Languages basis) గురించి సుదీర్ఘ చర్చ చేసింది 
3. భాషా ప్రాతిపదికను అంగీకరించిన కమిషన్ బొంబాయి రాష్ట్రం విషయంలో దానిని అమలు చేయలేదు.
4. భూసంస్కరణలను వెనకబడిన తనాన్ని(Land Reforms, Backwardness) కారణంగా చూపి తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఉంచాలని సూచించిన కమిషన్ హైదరాబాద్ రాష్ట్రంలోని కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు ఈ సూత్రాన్ని వర్తింపజేయలేదు.
5. రాష్ట్రాల సరిహద్దులను నిర్ణయించటానికి జిల్లాను ప్రాతిపదికగా తీసుకుని కమిషన్ కొన్ని సందర్భాలలో ఈ సూచనను ఉల్లంఘించింది(Violated the References). పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్, గిరిజనులు గల మధ్యప్రదేశ్ ల విషయంలో కమిషన్ ఎటువంటి మార్పులు చూపించలేదు.
కమిషన్ వందల 1954 జూన్, జూలై నెలల్లో అభిప్రాయ సేకరణ కోసం హైదరాబాద్ సందర్శించింది.
వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరించింది. 

ఇందులో వచ్చిన అభిప్రాయాలు (Different Opinions)

1. హైదరాబాద్ రాష్ట్రాన్ని భాషా ప్రాతిపదికపై మూడు భాగాలు చేసి తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రం తో కలిపి విశాలాంధ్ర ఏర్పాటు చేయాలి
2. హైదరాబాద్ రాష్ట్రాన్ని యధాతధంగా(Stand-Still) ఉంచాలి
3. హైదరాబాద్ రాష్ట్రాన్ని విభజించి తెలంగాణలోని పది జిల్లాల ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలి.
ఎస్ ఆర్ సి (SRC) ఏర్పాటుతో తెలంగాణాలో విశాలాంధ్ర అనుకూల, వ్యతిరేక వర్గాలు ఏర్పడ్డాయి.
విశాలాంధ్ర అనుకూల వర్గం: 
1) బూర్గుల రామకృష్ణారావు
2) నరసింగరావు 
3) పాగపుల్లారెడ్డి

ప్రత్యేక తెలంగాణ వర్గం:
1) కొండా వెంకటరంగారెడ్డి 
2) మర్రి చెన్నారెడ్డి 
3) హయగ్రీవాచారి 

SRC ఎస్సార్సీ నివేదిక (S.R.C Report)

1. హైదరాబాదును విడదీసి ఆంధ్రాలో కలపడాన్ని వ్యతిరేకించింది
2. మరాఠీ భాషను మాట్లాడే ప్రాంతాలను మహారాష్ట్రలోను, కన్నడ బాషా మాట్లాడే ప్రాంతాలను కర్ణాటకలోను కలపాలని సూచించింది
3. 1961 లో జరిగే సాధారణ ఎన్నికల తర్వాత అనగా ఐదు సంవత్సరముల తరువాత ఏర్పడిన హైదరాబాద్ రాష్ట్ర నూతన అసెంబ్లీలోని 2/3వ వంతు మెజార్టీ సభ్యులు విలీనాన్ని  ఒప్పుకుంటే విశాలాంధ్రను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపింది.
4. ఈ విధమైన నిర్ణయం కేవలం హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీ మాత్రమే తీసుకోవాలని చెప్పింది.

ఎస్సార్సీ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం భారత దేశంలో ఉన్న A B C D రాష్ట్రాలను రద్దుచేసి,  1956 నవంబర్ 1న 14 భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేసింది.


Post a Comment

0Comments

Post a Comment (0)