Telangana Government Schemes-Aasara Pension Scheme(ఆసరా పథకం)

TSStudies
0

తెలంగాణ ప్రభుత్వ పథకాలు

ఆదాయ పరిమితి పెంపు పథకం:
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అల్పాదాయ వర్గాలుగా పరిగణించడానికి గతంలో ఉన్న ఆదాయ పరిమితిని పెంచింది. గ్రామాలలో గతంలో రూ. 60000 ఉండగా దానిని ఒక లక్షా 50 వేల రూపాయలకు, పట్టణాలలో గతంలో రూ.75000 ఉండగా రెండు లక్షలకు ఆదాయ పరిమితిని పెంచింది.


ఆసరా పథకం(Aasara Pension Scheme):
ప్రారంభించిన తేది: 8 నవంబర్ 2014
ప్రదేశం: కొత్తూర్  ర్రం(గారెడ్డి జిల్లా)
ప్రారంభించిన వారు: కేసీఆర్

ముఖ్యాంశాలు:
ప్రభుత్వం ప్రజలకు సాంఘిక భద్రత, సంక్షేమం దృష్ట్యా ఈ పథకాన్ని ప్రారంభించారు
ఇది రాష్ట్ర వ్యాప్తంగా 2014 డిసెంబర్ 10 నుండి అమలులోకి వచ్చింది
వృద్ధులకు(రక్షణ పేరుతొ), వితంతువులకు(జీవనాదారం పేరుతొ), చేనేత, మర నేత కార్మికులకు(చేయూత పేరుతొ), కల్లుగీత కార్మికులకు, ఎయిడ్స్ బాధితులకు(భరోసా పేరుతొ) ప్రతినెల  వీరందరికీ రూ. 1000 చెల్లిస్తారు.

ఆసరా పింఛన్ల కు అర్హత వయసు:
వృద్ధులకు 65 సంవత్సరాలు వితంతువులకు 18 సంవత్సరాలు
నేత కార్మికులకు 50 సంవత్సరాలు
వికలాంగులకు కనీస వయస్సు అర్హత లేదు కానీ కనీసం 40 శాతం వైకల్యం కలిగిన వారు అర్హులు వినికిడి లోపం 51% ఉన్నవారు అర్హులు వికలాంగులకు భద్రత పేరుతో రూ.1500 చెల్లిస్తారు

వృద్ధులకు, కల్లుగీత కార్మికులు, ఎయిడ్స్ బాధితులకు గులాబీ రంగు కార్డులు
వితంతువులకు నీలం రంగు కార్డులు
వికలాంగులకు లేత ఆకుపచ్చ రంగు కార్డులను అందజేస్తారు.
ప్రతినెల 35,73,777 మంది లబ్ధిదారులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారు.
2015 మార్చి నెల నుండి మహిళా బీడీ కార్మికులకు రూ.1000 జీవనభృతి కల్పించింది.
బోధకాలుతో బాధపడేవారికి కూడా జీవనభృతి కింద రూ.1000 అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 41,78,291 మందికి సంవత్సరానికి 5,326 కోట్ల పెన్షన్లు అందిస్తుంది.
2018-19 బడ్జెట్లో ఆసరా పథకంకు రూ.532 6.89 కోట్లు కేటాయించారు.
  • రాష్ట్రంలో అత్యధిక ఫించన్ దారులు  కలిగిన జిల్లా-నిజామాబాద్
  • రాష్ట్రంలో అత్యల్ప ఫించన్ దారులు కలిగిన జిల్లా-కొమరం భీం ఆసిఫాబాద్

ఫించన్ రకం  అత్యధిక అర్హులు గల జిల్లా  అత్యల్ప అర్హులు గల జిల్లా
వృద్ధాప్య  నల్గొండ  కొమురం భీమ్ ఆసిఫాబాద్ 
వితంతు  హైదరాబాద్  కొమురం భీమ్ ఆసిఫాబాద్ 
దివ్యాంగులు  నల్గొండ కొమురం భీమ్ ఆసిఫాబాద్ 
కల్లు గీత కార్మికులు నల్గొండ హైదరాబాద్
నేత కార్మికులు రాజన్న సిరిసిల్ల  హైదరాబాద్
ఒంటరి మహిళలు ఖమ్మం  జనగామ 
బీడీ కార్మికులు  నిజామాబాద్  నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం 
కళాకారులు హైదరాబాద్  --

Post a Comment

0Comments

Post a Comment (0)