కేసిఆర్ కిట్ (రెండు వేల విలువ కలిగిన 16 వస్తువుల తో కూడుకొని ఉంటుంది)
ప్రారంభించిన తేదీ: 3 జూన్ 2017
ప్రారంభించిన ప్రదేశం - పేట్లబురుజు మోడ్రన్ మెటర్నటీ ఆస్పత్రి హైదరాబాద్
ప్రారంభించిన వారు - కేసీఆర్
మొట్టమొదటి కేసిఆర్ కిట్ను అందుకున్న వారు - మేకల సబిత
ఈ పథకం పుట్టే బిడ్డ సంరక్షణ కోసం ఉద్దేశించినది
ఈ పథకంలో భాగంగా గర్భిణీ దశ నుండి ప్రసవానంతరం వరకు వివిధ దశలలో నాలుగు విడతలుగా రూ. 12000/- ఇవ్వబడుతుంది.
అదే ఆడశిశువు పుడితే రూ. 13000/- ఇవ్వబడును
రెండు సార్లు వైద్య పరీక్షలు చేయించుకున్న తర్వాత రూ.3000/- ప్రసవించిన తర్వాత ఆడబిడ్డ పుడితే రూ.5000/- మగ బిడ్డ పుడితే రూ.4000/- బిడ్డ పుట్టిన మూడవ నెలలో టీకాలు తీసుకున్న తర్వాత రూ.2000/- తొమ్మిదవ నెలలో టీకాలు తీసుకున్న తర్వాత రూ.3000/- ఆర్థిక సహాయం లభించును.
20 జనవరి 2018 నాటికి ఈ పథకం ద్వారా నమోదు చేసుకున్న గర్భిణీల సంఖ్య 746507.
ఇప్పటివరకు 1,46,253 మందికి కేసీఆర్ కిట్లు పంపిణీ చేయడం జరిగింది.
ఈ పథకం అమలు ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది
2017 జనవరిలో 33% ఉండగా 2017 డిసెంబర్ నాటికి 49% గా కలదు.
దీని ముఖ్య ఉద్దేశం
సంస్థాగత కాన్పులను ప్రోత్సహించడం, శిశుమరణాల రేటును ప్రసూతి మరణాలను తగ్గించడం.
నోట్: ఈ పథకం కు ప్రేరణ తమిళనాడులోని ముత్తులక్ష్మి ప్రసవ పథకం.
స్త్రీ నిధి (10 లక్షల వరకు వడ్డీ లేని రుణం)
రాష్ట్రంలో 4.22 లక్షల స్వయం సహాయక గ్రూపుల్లోని 50 లక్షల మంది సభ్యులకు ఉపయోగపడేలా గ్రూపుల రుణ పరిమితిని రూ.5 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచింది.
జనవరి 2018 నాటికి 30 జిల్లాలో 1,07,042 స్వయం ఉపాధి సంఘాలకు 960.02 కోట్లు ఇవ్వడం జరిగింది.
స్త్రీ నిధి రుణాల పంపిణీలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రథమ స్థానంలో కలదు.
2017-18 ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన లక్ష్యాన్ని మించి 130.56% రుణాలు జారీ చేసింది.
షీ క్యాబ్స్
ప్రారంభించిన తేది: 8 సెప్టెంబర్ 2015
మహిళ క్యాబ్ డ్రైవర్లను ప్రోత్సహించడానికి ఈ పథకం ప్రారంభించారు
ఈ పథకం క్రింద వాహన కొనుగోలుకు 35%సబ్సిడీ లభిస్తుంది
Pnarayanarao
ReplyDelete