Telangana Government Schemes-మహిళా శిశు సంక్షేమం

TSStudies
0
Telangana Government Schemes-మహిళా శిశు సంక్షేమం
మహిళా శిశు సంక్షేమం 
మహిళా శిశు సంక్షేమానికి రూ.1799 కోట్లు కేటాయించడం జరిగింది

బతుకమ్మ చీరల పంపిణీ పథకం 
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన నిరుపేద మహిళలందరికీ చీరలను కానుకగా అందించారు 
రాష్ట్రంలోని 1,04,57,600 మందికి రేషన్ షాపుల ద్వారా సెప్టెంబర్ 18, 19, 20 తేదీలలో చీరలు పంపిణీ చేశారు.
పవర్ లూమ్, హ్యాండ్లూమ్ కార్మికులకు ఉపాధి కల్పించడం కోసం వారు నేసిన చీరలు కొనుగోలు చేసి మహిళలకు అందజేశారు. 

ఆరోగ్య లక్ష్మి 
ప్రారంభించిన తేదీ: 01. 01. 2015 
రాష్ట్రంలో 31,711 అంగన్ వాడీ  కేంద్రాలు, 3,989 మినీ అంగన్ వాడీ కేంద్రాలలో ప్రారంభించారు 
ముఖ్య ఉద్దేశం 
గర్భిణీలకు బాలింతలకు చిన్న పిల్లలకు సంపూర్ణ పోషకాహారం అందించడం 
ఈ పథకం ద్వారా 9,46,115 మంది 7 నెలల నుండి 3 సంవత్సరాలలోపు పిల్లలు,  5,03,360 మంది 3-6 సంవత్సరాల పిల్లలు మరియు 3,66,860 మంది గర్భిణీ స్త్రీలు, బాలింతలు లబ్ధి పొందుతున్నారు 
ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వ సాయం ప్రతి మహిళలకు రూ.3.50 లు ఇవ్వగా రాష్ట్రం దానికి ఐదురెట్లు ఎక్కువగా అనగా రూ.17.50 కలిపి ప్రతి మహిళలపై రూ.21 ఖర్చు చేయటం జరుగుతుంది 
ఈ పథకానికి 2018-19 బడ్జెట్లో రూ.298 కోట్లు కేటాయించడం జరిగింది 
అంగన్ వాడీ  కేంద్రాల హెల్ప్ లైన్: 155209

తెలంగాణ టీకా వాహనాలు 
ప్రారంభించిన తేదీ: 6 మే 2017 
ప్రారంభించిన ప్రదేశం: హైదరాబాదు కోఠి లోని పి హెచ్ ఎం సి  లో 
ప్రారంభించిన వారు: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి 
మిషన్ ఇంద్రధనస్సులో భాగంగా ఇంటింటికి వెళ్లి పిల్లలకు టీకాలు అందించే 'తెలంగాణ టీకా బండి' ద్విచక్ర వాహనాలను దేశంలోనే తొలిసారిగా ప్రారంభించారు 
టీకాల శాతాన్ని 80% పెంచే ఉద్దేశంతో ప్రారంభించారు (ప్రస్తుతం తెలంగాణలో అన్ని రకాల సేవలు పొందే చిన్నారులు 67% గలరు)

దీపం పథకం 
వంట కోసం కిరోసిన్ వాడని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరికీ దీపం కనెక్షన్లు అందిస్తుంది 
ఇప్పటివరకు 9.37 లక్షల మందికి దీపం కనెక్షన్లు అందించింది. దీనికి 150 కోట్లు కేటాయించారు. 


Post a Comment

0Comments

Post a Comment (0)