Telangana Government Schemes-అమ్మ ఒడి పథకం

TSStudies
0
Telangana Government Schemes-amma odi scheme
అమ్మ ఒడి పథకం(102 వాహనాలు) 
ప్రారంభించిన తేది: 28 డిసెంబర్ 2016 
ప్రారంభించిన ప్రదేశ- హైదరాబాద్ 
ప్రారంభించిన వారు-రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి 

ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవానికి ముందు వైద్యశాలకు, ప్రసవం తర్వాత ఆసుపత్రి నుండి తల్లీబిడ్డలు, సహాయకులను ఇంటికి చేర్చేందుకు ప్రత్యేకంగా రూపొందించిన అమ్మ ఒడి వాహనాలను ప్రారంభించారు 

102 కాల్ సెంటర్ కు ఫోన్ చేసి ఈ వాహనాల సేవలను పొందవచ్చు. 
మొదటి విడతలో భాగంగా గిరిజన ప్రాంతాలైన ఉట్నూరు, ఏటూరునాగారం, ములుగు, భద్రాచలం, అచ్చంపేట, నాగర్ కర్నూలు, వనపర్తి తదితర ప్రాంతాలకు ఈ వాహనాలను కేటాయించారు. 
2018 జనవరిలో రెండో విడత కింద రాష్ట్రంలో 200 వాహనాలను కేసీఆర్ ప్రారంభించారు 
రాష్ట్రంలో ఇప్పటి వరకు 250 వాహనాలు అందుబాటులో ఉన్నాయి.
2017 సెప్టెంబర్ 10 నాటికి 12,836 మంది గర్భిణీ స్త్రీలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు 
ఈ పథకానికి 2018-19 బడ్జెట్లో Rs. 561 కోట్లు కేటాయించారు 

నోట్: 108 వాహనాలు వెళ్లలేని ప్రాంతాల్లోకి త్వరగా చేరుకొని వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 50 బైక్ అంబులెన్సులను ప్రారంభించింది.


గ్రామీణ ప్రాంతాల్లో ఏఎన్ఎంలకు 'రెక్కలు' పేరిట ద్విచక్ర వాహనాలు అందించడం జరిగింది 
ఇందులో భాగంగా ద్విచక్ర వాహన కొనుగోలుకు జాతీయ ఆరోగ్య మిషన్ క్రింద Rs.10000, జిల్లా స్థాయిలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తరపున Rs.5000 అందిస్తారు 

నోట్: తెలంగాణలో తొలి తల్లిపాల బ్యాంక్ ను నీలోఫర్ ఆసుపత్రిలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పాటిల్  2017 అక్టోబర్ 27న ప్రారంభించారు.



Post a Comment

0Comments

Post a Comment (0)