Telangana Government Schemes-ఒంటరి మహిళలకు జీవన భృతి, సన్న బియ్యం పథకం

TSStudies
0
ఒంటరి మహిళలకు జీవన భృతి:  
ప్రారంభించిన తేదీ: 4 జూన్ 2017 
ప్రారంభించిన ప్రదేశం: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు 
ప్రారంభించిన వారు: జూపల్లి కృష్ణారావు 

రాష్ట్రవ్యాప్తంగా  1,21,875 మంది మహిళా లబ్ధిదారులు గలరు 
ఈ పథకం కింద లబ్ధిదారులకు నెలకు రూ. 1000/- లు  జీవనభృతి చెల్లిస్తారు 
ఈ పథకం ఏప్రిల్ 1, 2017 నుండి అమలు చేస్తున్నారు 
18 సంవత్సరాలు నిండి వివాహితులు భర్తకు కనీసం ఏడాది నుంచి దూరంగా ఉంటున్న మహిళలకు, అవివాహితులైన ఒంటరి మహిళలకు మృతి వర్తిస్తుంది. 
ఇందుకు అర్హతగా గ్రామీణ ప్రాంత మహిళలకు వయసు 30 సంవత్సరాలు, పట్టణ ప్రాంతాలలో అయితే 35 ఏళ్లుగా నిర్ణయించారు. దీనిలో లబ్ది పొందే మహిళా వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు ఉండాలి. 

రూపాయికే నల్లా  కనెక్షన్: 
గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని అన్ని నగరపాలక పురపాలక సంస్థల  పరిధిలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న తెల్ల రేషన్ కార్డు కుటుంబాలకు రూపాయికే నల్ల కనెక్షన్ పథకాన్ని అమలుచేయనున్నారు.

ఎకనామిక్ సపోర్ట్ పథకం:
ఈ పథకానికి 2018-19 బడ్జెట్లో రూ.1682.53 కోట్లు కేటాయించడం జరిగింది 
నిరుపేద, నిరుద్యోగ యువతకు జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించారు 
ఇందులో భాగంగా రూ.లక్ష యూనిట్ కు 80 వేల సబ్సిడీని, రెండు లక్షల యూనిట్ కు  రూ.1,20,000/-,  రూ.5 లక్షల యూనిట్ కు  రూ.2 లక్షల సబ్సిడీ అందిస్తోంది.

ఆపద్బంధు పథకం: 
వడదెబ్బ మృతులకు ప్రభుత్వం ఆపద్బంధు పథకం కింద ప్రభుత్వం రూ.50000/- సహాయం అందిస్తుంది. 

ప్రకృతి వైపరీత్యాల సహాయం: 
పిడుగుపాటు, వరదలు, భారీ వర్షాల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది. 

సన్న బియ్యం పథకం: 
తెలంగాణ రాష్ట్రంలోని హాస్టల్ విద్యార్థులకు పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి జనవరి 1, 2015 నుండి సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా 47.65 లక్షల మంది విద్యార్థులు లబ్ధిపొందుతున్నారు. 
ఈ పథకం ద్వారా విద్యార్థుల హాజరు శాతం గణనీయంగా పెరగడం జరిగింది.

ఆహారభద్రత పథకం:  
ప్రారంభించిన తేదీ: 1 జనవరి 2015 
ప్రారంభించిన వారు: ఈటెల రాజేందర్ 
ప్రదేశం: చెల్పూరు,  హుజూరాబాద్ మండలం కరీంనగర్ 

ముఖ్యాంశాలు 
రేషన్ కార్డు గల కుటుంబంలో ప్రతి ఒక్కరికి 6 కిలో గ్రాముల బియ్యం అందించడం ముఖ్య ఉద్దేశం 
కుటుంబంలో ఎంతమంది ఉన్న ప్రతి ఒక్కరికి 6 కిలోల బియ్యం అందిస్తారు. 

పార్థివ వాహనాలు:
ప్రారంభించిన తేదీ: 18 నవంబర్ 2016 
ప్రారంభించిన ప్రదేశం: హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రి 
ప్రారంభించిన వారు: డాక్టర్ సి లక్ష్మారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ 
రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రులలో మృతి చెందే పేదల మృతదేహాలను ఇళ్లకు తరలించేందుకు 50 అంబులెన్సులను (పార్థివ వాహనాలు) ప్రారంభించారు. 


Post a Comment

0Comments

Post a Comment (0)