మిషన్ కాకతీయ
ప్రారంభించిన తేది: 12 మార్చి 2015
ప్రదేశం: కామారెడ్డి జిల్లా లోని ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్ పాత చెరువు
ప్రారంభించిన వారు: సీఎం కేసీఆర్
నినాదం: మన ఊరు మన చెరువు
ముఖ్యాంశాలు
మిషన్ కాకతీయ కార్యక్రమం క్రింద 46 వేలకు పైగా చెరువులను పునరుద్ధరిస్తారు.
46,531 చెరువులను ప్రతి సంవత్సరం 20% చెరువులను అనగా 9,306 చెరువుల పునరుద్ధరణ చేయనున్నారు.
చెరువుల కుంటల పూడికలు తీసి నీటి నిల్వ సామర్థ్యం పెంచడం,
చెరువు కట్టలను బలోపేతం చేయటం,
చెరువు అలుగు తూములను మరమ్మతులు చేయడం,
చెరువులలో పెరిగిన తుమ్మ చెట్లను నరికివేయడం,
గొలుసుకట్టు చెరువులను బాగు చేయటం.
గొలుసుకట్టు చెరువులను బాగు చేయటం.
ఈ చెరువుల పునరుద్ధరణ వలన 10.17 లక్షల హెక్టార్లకు సాగునీటి వసతి కల్పించబడుతుంది
Note: 2016 మార్చి 24న వరంగల్ జిల్లాలోని హనుమకొండలోని పద్మాక్షమ్మ గూడం వద్ద మిషన్ కాకతీయ రెండవ దశను తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.
2018-19 బడ్జెట్ లో మిషన్ కాకతీయకు Rs.1,601 కోట్లు కేటాయించారు. దేశంలోనే తొలిసారిగా చెరువులకు జియో ట్యాగింగ్ ప్రక్రియ చేపట్టారు.