Telangana State Formation Practice Questions 14

TSStudies
1

Telangana State Formation Practice Questions & Telangana State Formation Model Papers

1. 1969 జనవరి 19 న అఖిలపక్ష సమావేశం ఎక్కడ జరిగింది
a) ఆనందనిలయం 
b) సంతోషం ఆలయం 
c) సెక్రటేరియట్ 
d) a మరియు b 


2. జీవో 36 ఏ రోజున విడుదల చేశారు 
a) 1969 జనవరి 19 
b) 1969 జనవరి 20 
c) 1969 జనవరి 21 
d) 1969 జనవరి 18  


3. అఖిలపక్ష సమావేశంలో తీర్మానించిన అంశాలకు సరికాని వ్యాఖ్య 
1) తెలంగాణలో నాన్ ముల్కీ ఉద్యోగుల స్థానాల్లో అర్హత కలిగిన ముల్కీలను నియమిస్తారు 
2) ఒకవేళ అర్హత గల వారు లభించకపోతే ఆ పోస్టులను ఖాళీగానే ఉంచి అర్హత గల తెలంగాణ వ్యక్తి లభించిన తర్వాత భర్తీ చేస్తారు 
3) తక్షణమే అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడానికి ఇద్దరు సీనియర్ అధికారులను నియమిస్తారు 
4) నాన్ ముల్కీలను తొలగించకుండా తెలంగాణ ముల్కీలకు కొత్త ఉద్యోగాలు సృష్టించి నియమిస్తారు.
a) 1, 2, 3, 4 సరైనవి 
b) 1, 2, 3 సరైనవి, 4 కాదు 
c) 1,2 సరైనవి, 3, 4 కాదు 
d) 1, 2, 3, 4 సరికావు 


4. ఖమ్మంలో రవీంద్రనాథ్ దీక్షకు ఏ రోజున విరమించాడు 
a) 1969 జనవరి 22 
b) 1969 జనవరి 8 
c) 1969 జనవరి 24 
d) 1969 జనవరి 25 


5. ఖమ్మంలో రవీంద్రనాథ్ నిరాహారదీక్షను ఎన్ని రోజులు కొనసాగించాడు 
a) 16 రోజులు 
b) 17 రోజులు 
c) 18 రోజులు 
d) 15 రోజులు 


6. జీవో 36 లోని అంశాలకు సరికానిది గుర్తించండి.  
1) 1956 నవంబర్ 1 నుండి నియమించబడిన నాన్ ముల్కీలను 1969 ఫిబ్రవరి 28లోపు బదిలీ చేయాలి 
2) తెలంగాణలో ఖాళీ అయిన స్థానాలలో తెలంగాణ ప్రాంతం వారిని నియమించాలి 
a) 1, 2 రెండు సరైనవి
b) 1 సరైనది, 2 కాదు 
c) 1, 2 సరికాదు 
d) 2 సరైనది, 1 కాదు 


7. జీవో 36 ఉత్తర్వుల తక్షణ అమలు కార్యకలాపాల పర్యవేక్షణ బాధ్యత ఈ క్రింది వారిలో ఎవరికి ఇవ్వబడింది 
a) శ్రీ ఐ జె నాయుడు  
b) ఆర్ విఠల్ రావు 
c) 1 & 2 
d) ఎవరు కాదు 


8. జీవో 36 పై ప్రభుత్వ కార్యదర్శి ఎం టి రాజు ఏ రోజున సంతకం చేశాడు 
a) 1969 జనవరి 21 
b) 1969 జనవరి 22 
c) 1969 జనవరి 19
d) 1969 జనవరి 20 


9. 1969 తెలంగాణ ఉద్యమ కాలంలో పి.వి.నరసింహారావు చేపట్టిన మినిస్ట్రీ ఏమిటి 
a) ఆర్థిక శాఖ 
b) విద్యాశాఖ 
c) హోంశాఖ 
d) రెవిన్యూ శాఖ 


10. 1969 తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శంకర్ ఏ రోజున ఎక్కడ మరణించాడు.
a) 1969 జనవరి 25, ఉస్మానియా హాస్పటల్ 
b) 1969 జనవరి 29, సదాశివపేట 
c) 1969 జనవరి 24, సదాశివపేట 
d) 1969 జనవరి 28, సదాశివపేట


11. "ఆందోళనలు తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించాయని" చెప్పిన కేంద్ర హోం మంత్రి ఎవరు? 
a) వెంగళరావు 
b) మర్రి చెన్నారెడ్డి 
c) డాంగే 
d) చవాన్



12. ప్రజల అభిప్రాయం తెలుసుకొనుటకు జనవాక్య సేకరణ చేయాలని సూచించింది ఎవరు? 
a) నీలం సంజీవరెడ్డి 
b) మర్రి చెన్నారెడ్డి 
c) పివి నరసింహారావు 
d) వి.వి.గిరి



13. ఢిల్లీ నుండి వచ్చిన మర్రి చెన్నారెడ్డి కి ఘనస్వాగతం పలికిన 29-08-1969 నాటి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎవరు? 
a) లక్ష్మీబాయి 
b) కుముద్  నాయక్ 
c) లక్ష్మీనారాయణ 
d) విజయ్ కుమార్ 



14. ఆగస్టు 30 1969 నాటి సదాలక్ష్మి అధ్యక్షతన జరిగిన రెడ్డి హాస్టల్ సభలో మాట్లాడిన నాయకులు ఈ క్రింది వానిలో ఎవరు? 
a) చెన్నారెడ్డి 
b) కొండా లక్ష్మణ్ బాపూజీ 
c) మదన్మోహన్,యస్ బి గిరి 
d) పై అందరూ



15. తెలంగాణ అనగా శ్రీశైలం, ద్రాక్షారామం, కాలేశ్వరం మధ్య ఉన్న 20 జిల్లాలు కానీ 9 జిల్లాలు మాత్రమే కాదు అన్న నాటి సమాచారం మంత్రి ఎవరు? 
a) ఏ వాసుదేవరావు 
b) చెన్నారెడ్డి 
c) సంజీవరెడ్డి 
d) వెంగళరావు



16. ఆగస్టు 14, 1969లో అరెస్టు అయి సెప్టెంబర్ 1, 1969 లో విడుదల అయిన శాసనసభ సభ్యులు?
a) గోవర్ధనరెడ్డి 
b) సుధాకర్ రావు 
c) ఈశ్వరీబాయి 
d) పై వారందరూ



17. సెప్టెంబర్ 3, 1969 అసెంబ్లీలో మాణిక్ రావు, తెలంగాణ వాదులకు మధ్య గంటన్నర వాగ్వివాదం జరిగినప్పుడు మాణిక్ రావు ఏ శాఖ మంత్రి? 
a) హోం శాఖ 
b) సమాచార శాఖ 
c) కార్మిక శాఖ 
d) ప్రజా సంబంధాల శాఖ



18. విద్యార్థుల ఉద్యమంలో ఉపాధ్యాయులు చేతులు కలిపారని వచ్చిన ఆరోపణలను ఖండించినది ఎవరు? 
a) పాల్వాయి గోవర్ధనరెడ్డి 
b) మర్రి చెన్నారెడ్డి 
c) కె.వి. అయ్యర్
d) శ్రీధర్ రెడ్డి



19. 06-09-1969 నాటి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించిన సభలో తెలంగాణ వాదనను గట్టిగా వినిపించింది ఎవరు?
a) మర్రి చెన్నారెడ్డి 
b) బి వి రాజు 
c) కొండా లక్ష్మణ్ బాపూజీ 
d) ఎవరు కాదు



20. రక్షణల అమలుకూ రాజ్యాంగ సవరణ వెలువడదు కాబట్టి రిక్రూట్ మెంట్ ను వికేంద్రీకరణ చేయాలని సూచించిన కమిటీ?
a) లలిత్ కుమార్ 
b) భార్గవ 
c) వాంఛూ కమిటీ  
d) పై ఎవ్వరూ కాదు




Post a Comment

1Comments

Post a Comment