బొడ్డెమ్మ పండుగ
గుంట బొడ్డెమ్మ
పందిరి బొడ్డెమ్మ
బాయి బొడ్డెమ్మ
- బొడ్డెమ్మ పండుగ అనేది కన్నెపిల్లలకు సంబంధించిన పండుగ
- ఈ పండుగ వినాయక చవితి తరువాత వచ్చే భాద్రపద బహుళ పంచమి నుండి తొమ్మిది రోజులు అనగా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమికి ముందు వచ్చే అమావాస్య వరకు జరుపుకునేదే బొడ్డమ్మ పండుగ
- బొడ్డెమ్మను తయారు చేసుకునే విధానాన్ని బట్టి నాలుగు రకాలు
గుంట బొడ్డెమ్మ
పందిరి బొడ్డెమ్మ
బాయి బొడ్డెమ్మ
- చెక్కపీటపై పుట్టపన్నును 5 దొంతరలుగా వేస్తూ పైన కలశాన్ని పెట్టడం పీఠ బొడ్డెమ్మ ప్రత్యేకత
- పుట్టమన్నుతో బొడ్డెమ్మను చేసి దాని చుట్టూ పందిరి వేస్తారు దీనిని పందిరి బొడ్డెమ్మ అంటారు
- బావిలా గొయ్యి తీసి తయారు చేసేది బాయి బొడ్డెమ్మ
- గుంటల రూపంలో చేసే బొడ్డెమ్మను గుంట బొడ్డెమ్మ అంటారు
- బతుకమ్మ ను కొలిచే రీతిలోనే అన్ని రకాల పువ్వులతో పూజిస్తారు. ముఖ్యంగా గౌరీ పూజ చేయడం, బొడ్డెమ్మ పేర్చడం, పాటలు పాడటం మొదలగునవి.