జోగిని వ్యవస్థ
- ఇది తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశం అంతా కనపడే ఒక సాంఘిక సమస్య
- ఇది ద్రావిడ సంస్కృతి లోని భాగం
- ఇందులో తక్కువ వయసున్న (5-6 సం.లు) కల్గిన దళిత అమ్మాయిలను గ్రామదేవతలతో(ఎల్లమ్మ,పోచమ్మ) వివాహం జరిపిస్తారు
- ఈ కార్యక్రమం పోతరాజు ఆధ్వర్యంలో జరుగును. దీనినే 'జోగుపట్టం' అంటారు
- బాలిక రజస్వల కాగానే చేసే మరొక కార్యక్రమం - మైల పట్టం
- ఈ రెండు కార్యక్రమాలకు డబ్బులు ఖర్చు పెట్టే భూస్వామికి ఆ అమ్మాయితో 'సమాగమా ' నిర్వహిస్తారు
- ఈ వ్యవస్థ భూస్వామ్య వ్యవస్థ యొక్క అవశేషము
- ఈ జోగిని లు తమ జీవితం మొత్తం భూస్వాములు, గ్రామ పెద్దలకే అంకితమవ్వాలి
- ఈ వ్యవస్థపై తెలంగాణ ప్రాంతంలో చాలా పరిశోధనలు చేసిన వ్యక్తి - హేమలత లవణం
- తెలంగాణలో పది జిల్లాలకు(పాతవి) గాను తొమ్మిది జిల్లాల్లో ఈ వ్యవస్థ కనబడుతుంది.
- ఈ వ్యవస్థ లేని ఒకే ఒక జిల్లా - ఖమ్మం
- ఈ వ్యవస్థలో అధికంగా జోగినిల ను గుర్తించిన జిల్లా - కరీంనగర్
- వేములవాడ రాజరాజేశ్వర దేవాలయం లో జోగినిలను ప్రత్యేకంగా 'శివసత్తులు' అంటారు
- నిజామాబాద్ లో జోగినిల పునరావాసం కోసం నెలకొల్పిన గృహం - 'చెల్లి నిలయం'
దేవదాసి వ్యవస్థ
- దేవ అనగా దేవుడు, దాసి అనగా సేవలు చేసేవారు
- వీరిని 'భోగంవారు' అంటారు
- ఇది ఆర్య సంస్కృతి.
- ఇది కూడా తెలంగాణతో పాటు దక్షిణ భారత దేశమంతా విస్తరించిన సామాజిక సమస్య
- దీనిలో కూడా కన్యలను దేవుడితో వివాహం జరుపుతారు
- వీరు తరువాత కాలంలో వారి జీవన విధానం కొరకు వేశ్యలుగా మారుతారు
- ఈ వ్యవస్థపై అత్యధికంగా పోరాటం చేసినది - ముద్దు లక్ష్మిరెడ్డి
- దేవదాసీలు గుడి ఆవరణలో భరతనాట్యం చేసేవారు
Good information thank you
ReplyDelete