తెలంగాణలో చిత్రకళ
గౌరీ శంకర్
ఈయన అసాధారణ మనుషులను శ్రామిక జీవన సరళిని చిత్రాలుగా చిత్రీకరించాడు
ఏలె లక్ష్మణ్
కల్లు కోసం చెట్టు ఎక్కే గీతపనివారు, వీధుల్లో నడిచే పురుషులు, స్త్రీలు చిత్రాలకు ప్రధాన వస్తువులు
ఈయన ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర యొక్క ప్రభుత్వ అధికారిక చిహ్నాలను రూపొందించారు
కాపు రాజయ్య
ఇతను బోనాలు, ఎల్లమ్మజోగి, తెలంగాణ పండుగ, కృష్ణ గోపిక, వసంతకేళి, కోలాటం వంటి చిత్రాలను చిత్రించాడు ఇతను చిత్రించిన బోనాలు చిత్రాన్ని లండన్ స్టూడియో మ్యాగజైన్ కు ముఖచిత్రంగా ప్రచురించారు
పాకాల తిరుమలరెడ్డి
ఇతను పల్లెటూరు బడిపంతులు, మోటార్ హార్బర్, చంద్రముఖి, గుల్ మహల్ చెట్టు, చంద్రుడు వంటి చిత్రాలను చిత్రీకరించాడు
ఇతను సుధర్మ ఆర్ట్ గ్యాలరీ అనే పేరుతో నారాయణగూడలో ఒక మ్యూజియంను ఏర్పాటుచేశాడు
కొండపల్లి శేషగిరిరావు
ఇతను రాయగిరి రాళ్లు, శకుంతల, హరిజనోద్యమం (కుడ్య తైలవర్ణచిత్రం), దమయంతి (తైలవర్ణం), తెలుగు తల్లి చిత్రం (తెలుగు మహాసభలు) వంటి చిత్రాలను చిత్రించాడు