తెలంగాణ పుణ్యక్షేత్రాలు
యాదగిరి గుట్ట / యాదాద్రి భువనగిరి
ఇక్కడ శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడు
దీనినే ఋషుల ఆరాధన క్షేత్రం అంటారు
'యాదగిరి సుప్రభాతం'ను కంపోజ్ చేసింది 'వంగిపురం నరసింహాచార్యులు'
ధర్మపురి
ఇది గోదావరి నదీ తీరాన జగిత్యాల కు దగ్గరగా ఉన్న పుణ్యక్షేత్రం
ఇక్కడ లక్ష్మీనరసింహుడు యోగ, ఉగ్రరూపంలో కొలువుండటం ప్రత్యేకత
ఇది వైదిక విద్యలకు, జ్యోతిష్య శాస్త్రానికి పవిత్ర స్థలం
గోదావరి తీరాన వెలిసిన అన్ని క్షేత్రాలలో అతి పురాతనమైనది
తీర్ధాల సంగమేశ్వర స్వామి ఆలయం
ఇది ఒక శైవ క్షేత్రం
ఇది ఖమ్మం జిల్లాలో ఆకేరు, బుగ్గేరు, మున్నేరు అనే మూడు నదులు కలిసే ప్రాంతంలో ఉన్నది
సిరిచెల్మ శైవ క్షేత్రం (మల్లికార్జున స్వామి)
ఇది ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండలానికి దగ్గరగా సిరిచెల్మ గ్రామంలో ఉన్నది
ఇక్కడ గర్భగుడిలో రెండు నందులు, ఉండటం రాహు కేతువులకు పూజలు చేయడం ప్రత్యేకత
వేములవాడ రాజరాజేశ్వర స్వామి (రాజన్న సిరిసిల్ల)
ఇది శైవ క్షేత్రం దీనిని దక్షిణ కాశి/బెనారస్ అంటారు
స్థలపురాణం ప్రకారం వేములవాడను లేంబాలవాటిక, భాస్కర క్షేత్రం, హరి హర క్షేత్రం అని పిలుస్తున్నారు
ఇక్కడ శివుడు రాజరాజేశ్వరస్వామి రూపంలో ఉండి కుడిప్రక్కన రాజరాజేశ్వర దేవిని(పార్వతి), ఎడమ ప్రక్కన లక్ష్మీ సహిత సిద్ధి వినాయకుడుతో ఉన్నాడు
శివరాత్రి రోజున 100 మంది అర్చకులతో మహాలింగార్చన జరుగుతుంది
భక్తులు చేసే పూజలలో ప్రముఖమైనది 'కోడె మొక్కు'. భక్తులు గిత్తను తీసుకువచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయించి ప్రాంగణంలో కట్టేసి దేవాలయానికి దక్షిణంగా ఇస్తారు. దీని వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్మకం
కొమరవెల్లి మల్లన్న దేవాలయం
ఇక్కడ మల్లికార్జున స్వామి దేవాలయం ఉన్నది
వాస్తు శైలి - దక్షిణ భారత శైలి - కాకతీయ చాళుక్య
ఇది సిద్దిపేట జిల్లాలో ఉన్నది
ఈ ఆలయం ఉన్న గుట్ట ఇంద్రకీలాద్రి
శివరాత్రి రోజు 'పెద్ద పట్నం' నిర్వహిస్తారు
ఇది బీసీ కులాలైన కర్మ, గొల్ల, ముదిరాజులకు ప్రసిద్ధి
ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయం
ఇది వరంగల్ రూరల్ జిల్లా లోని వర్ధన్నపేట మండలం లో గల ఐనవోలు లో ఉన్నది
దీనిని 11వ శతాబ్దంలో కాకతీయులు నిర్మించారు
దీనిని ఎక్కువగా పూజించేవారు యాదవులు
ఆలంపూర్ దేవాలయాలు
ఇది జోగులాంబ గద్వాల జిల్లాలో తుంగభద్ర నది ఒడ్డున ఉన్న 5వ శక్తి పీఠం
ఇక్కడ జోగులాంబ ఆలయం ఉన్నది
దీనితోపాటు నవబ్రహ్మ ఆలయం, బాలబ్రహ్మేశ్వర ఆలయం ఉన్నాయి
మన్యంకొండ దేవాలయం
ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉన్నది
ఇది మహబూబ్ నగర్ లోనే అతి పెద్దది. దీనిని 2వ తిరుపతిగా పేరుగాంచినది
కురుమూర్తి దేవస్థానం (మహబూబ్ న్గగర్)
ఇది తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం తో పోలికలు కలిగి ఉంటుంది
ఇక్కడ ప్రతి ఏటా పెద్ద మొత్తంలో జాతర సాగుతుంది
ఈ జాతర 'కురుమూర్తి జాతర' గా ప్రసిద్ధి గాంచినది
కాతలిక్ చర్చ్ (మెదక్)
ఇది ఆసియాలోనే అతిపెద్దది. ప్రపంచంలో వాటికన్ తరువాత రెండవ అతి పెద్దది
నిర్మాణం తెల్లని గ్రానైట్
ఎత్తు 173 అడుగులు