తెలంగాణలో ప్రసిద్ధి చెందిన కవులు
సుద్దాల హనుమంతు
పందొమ్మిదవ శతాబ్దపు మధ్యకాలంలో పేరొందిన రచయితలలో ఒకరు
ఇతని రచనలు మొత్తం వెట్టిచాకిరి, భూస్వాములు, స్వేచ్ఛ, సమానత్వం, కమ్యూనిజం కి సంబంధించినవి
అతని పాటల్లో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన పాట 'పల్లెటూరి పిల్లగాడ పసుల గాసే మొనగాడా'
ఈ పాటను మాభూమి సినిమా లో పెట్టారు
కాళోజి నారాయణరావు (1914-2001)
తెలంగాణ మాండలికాల యొక్క ఆవశ్యకతను నొక్కి చెప్పిన వ్యక్తి కాళోజీ నారాయణరావు
సెప్టెంబర్ 9 తెలంగాణ మాండలిక దినోత్సవం (కాళోజీ జన్మదిన సందర్భంగా)
నినాదాలు
'అక్షరం రూపం దాల్చిన సిరా చుక్క లక్ష మెదళ్ళకు కదలిక'
'అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంటు -సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా'
దాశరథి
రచనలు
అగ్నిధార, రుద్రవీణ
'తిమిరంతో సమరం' రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది
నా తెలంగాణ కోటి రతనాల వీణ; అని సగర్వంగా ప్రకటించారు
ఇది నేటికీ ఉద్యమస్ఫూర్తిని రగిలిస్తూనే ఉంటుంది
వట్టికోట ఆళ్వారుస్వామి (తెలంగాణ వైతాళికుడు)
ఇతని రచనలు
జైలు లోపల (జైలు జీవితం కథల సంపుటి)
ప్రజల మనిషి (నవల తెలంగాణ ప్రజల జీవిత నేపథ్యం)
గంగు (నవల 1940-45 మధ్య రాజకీయ సాంఘిక ప్రజా ఉద్యమాల చిత్రీకరణ)
సినారె (డాక్టర్ సి.నారాయణరెడ్డి, రాజన్న సిరిసిల్ల)
పూర్తి పేరు సింగిరెడ్డి నారాయణరెడ్డి
తెలుగు కవి సాహితీవేత్త అయిన నారాయణ రెడ్డి సినారె గా ప్రసిద్ధి చెందాడు
రచనలు ఈయన తొలి రచన నవ్వని పువ్వు (1953)
కర్పూర వసంతరాయలు, నాగార్జునసాగరం
మధ్యతరగతి, మందహాసం (ఋతుచక్రం దీనికి సాహిత్య అవార్డు లభించింది)
విశ్వంభర (జ్ఞానపీఠ అవార్డు 1988 లో లభించింది)
సామల సదాశివ
స్వస్థలం దహేగావ్, అదిలాబాద్
వ్యాస సంకలనాలు
మలయమారుతాలు, సంగీత శిఖరాలు, యాది,
స్వరలయలు (దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది)
నందిని సిద్ధారెడ్డి
అతను రాసిన పాట 'నాగేటి సాలల్లో న తెలంగాణ నా తెలంగాణ'
నిర్వహించిన పదవులు
మంజీరా రచయితల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు
తెలంగాణ రచయితల వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు
అందెశ్రీ
'జయ జయ జయహే తెలంగాణ' (తెలంగాణ యొక్క రాష్ట్ర గీతం)
గోరటి వెంకన్న
'పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల' అనే పాట ఎక్కువగా ప్రాచుర్యం పొందినది
గద్దర్
'అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా' అనే పాట ప్రసిద్ధి