Asaf Jahi Dynasty-3

TSStudies
History of Asaf Jahi Dynasty in Telugu
నాజర్ జంగ్ (1748-50) 
  • నిజాం  ఉద్దౌలాగా పిలువబడ్డాడు 
  • ముజఫర్ జంగ్ యొక్క కుట్ర కారణంగా హిమ్మత్ ఖాన్ చే  కాల్చి చంపబడ్డాడు 
ముజఫర్ జంగ్ (1750-51)
  • ఇతను అసఫ్ జాహీ పాలకుడిగా పరిగణించబడడు  
  • ఇతను నిజాముల్ ముల్క్ కుమార్తె ఖైరున్నీసా యొక్క కుమారుడు 
  • ఇతను డూప్లేకు ఝుపార్ జంగ్ అనే బిరుదు ఇచ్చాడు 
  • ఇతను ఫ్రెంచ్ వారికి మచిలీపట్నం, యానం, దివి ప్రాంతాలను బహుమతిగా ఇచ్చాడు 
  • 1751 లో కడప, కర్నూలు నవాబులకు నాయకుడైన హిమ్మత్ ఖాన్ కడపలోని రాయచోటి దగ్గర లక్కిరెడ్డిపల్లె వద్ద ముజఫర్ జంగ్ ను హతమార్చాడు 
  • దీనితో హైదరాబాదులో ఫ్రెంచ్ అధికారి అయినా బుస్సీ  సలాబత్ జంగ్  ను హైదరాబాద్ నవాబు ని చేశాడు  
సలాబత్ జంగ్ (1751-1761) 
  • ఇతను 1752 లో ఉత్తర సర్కారులను (కొండపల్లి, ఏలూరు, రాజమండ్రి, శ్రీకాకుళం) బహుమానంగా ఇచ్చాడు 
  • 1759 లో ఈ ఉత్తర సర్కారులను సలాబత్ జంగ్ ఫ్రెంచి నుండి తిరిగి తీసుకున్నాడు 
  • 1759 లో సలాబత్ జంగ్ బ్రిటిష్ వారికి మద్దతు పలికి  క్రింది నాలుగు ప్రాంతాలను వారికి బహుమానంగా ఇచ్చాడు 
  1. మచిలీపట్నం 
  2. నిజాంపట్నం 
  3. వకాల్ మన్నార్ 
  4. కొండపల్లి (కొంత భూభాగం) 
  • సలాబత్ జంగ్ కాలంలో  క్రింది యుద్ధాలు జరిగాయి 
1756 తుమ్మపాలెం యుద్ధం 
1757 బొబ్బిలి యుద్ధం 
1758 చందుర్తి యుద్ధం 
1759 కొండూరు యుద్ధం 
1760 వందవాసి యుద్ధం 
  • 1761 లో నిజాం అలీ సలాబత్ జంగ్ ను  బీదర్ కోట లో  బంధించి తానే పాలకుడిని ప్రకటించుకున్నాడు