సికిందర్ జా (1803-1829) 3వ నిజాం
- ఇతని ప్రధాని చందూలాల్ కర్నూలులో అహోబిలం దేవాలయం ను నిర్మించాడు
- సికిందర్ జా పేరుమీద గానే సికింద్రాబాద్ 1807 లో ఏర్పడింది
- ఇతని కాలంలో హెన్రీ రస్సెల్ 1816లో రస్సెల్ సైనిక దళం ఏర్పాటు చేశాడు
- ఇతని కాలంలోనే జాగీర్దార్లు తిరుగుబాట్లు చేసారు
- పిండారీల దాడులను తిప్పికొట్టడం లో మరియు స్థానిక తిరుగుబాట్లను అణచివేయడం లో రస్సెల్ సైనిక దళం కీలక పాత్ర పోషించింది
- తర్వాత కాలంలో రస్సెల్ సైనికదళం హైదరాబాద్ కంటింన్-జెంట్ ఫోర్స్ గా పిలువబడింది
- రస్సెల్ సైనికదళాల నిర్వహణ కొరకు ప్రధాని చందూలాల్ పామర్ & కో అనే వర్తక సంస్థ నుండి సుమారు 60 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు
- దీనికి బదులుగా బీరార్ యొక్క వర్తకపు హక్కులు పామర్ & కో కు ఇవ్వబడ్డాయి
- ఈ అప్పులు తిరిగి చెల్లించడంలో బ్రిటిష్ రెసిడెంట్ అధికారి అయిన చార్లెస్ మెట్కాఫ్ హైదరాబాద్ నవాబ్ కు సహకరించాడు దీనికి సర్కార్ ప్రాంతంలో శాశ్వతంగా ఇచ్చాడు