History of 4th Nizam in Asaf Jahi Dynasty
నసీరుద్దౌలా (1829-57) - 4వ నిజాం
- 1834లో హైదరాబాద్ లో మొట్టమొదటి పాఠశాల అయినా సెయింట్ జార్జ్ గ్రామర్ హైస్కూల్ ఏర్పాటు చేయబడింది
- 1839లో నసీరుద్దౌలా సోదరుడు అయిన ముబారీజ్ ఉద్దౌలా హైదరాబాదులో వహాబీ ఉద్యమం చేపట్టాడు. ఇది బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమం
- ఈ ఉద్యమానికి మద్దతు పలికిన కర్నూల్ నవాబు - గులాం రసూల్ ఖాన్
- 1843లో చందూలాల్ తన ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో సిరాజ్ ఉల్ ముల్క్ హైదరాబాద్ కు ప్రధాని అయ్యాడు
- 1853లో బీరార్ ఒప్పందం ప్రకారం నసీరుద్దౌలా బ్రిటిష్ వారికి బీరార్, రాయచూర్, ఉస్మానాబాద్ ప్రాంతాలను ఇచ్చాడు
- బ్రూస్ నార్తజ్ తన ది రెబెలియన్ ఇన్ ఇండియా అనే పుస్తకంలో బీరార్ ఒప్పందం గురించి ఈ క్రింది విధంగా పేర్కొన్నాడు
- న్యాయదేవత చెవుల్లో దూది పెట్టి ఆమెను ఆంగ్లేయులు చెవిటి దాన్ని గుడ్డిదాన్ని చేశారు
- ఈ ఒప్పందాన్ని అవమానకరంగా భావించిన సిరాజ్ ఉల్ ముల్క్ అస్వస్థతకు గురై మరణించాడు
- దీంతో 24 ఏళ్ల మీర్ తురబ్ అలీఖాన్ (1వ సాలార్జంగ్) హైదరాబాద్ ప్రధాని అయ్యాడు
- ఇతని కాలంలోనే చాదర్ఘాట్ వంతెన నిర్మించబడింది
- 1854లో కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్ నిర్మించబడింది. ఇదే తరువాత కాలంలో గాంధీ హాస్పిటల్ గా మారింది
- 1857 మే 10న మీరట్ లో తిరుగుబాటు ప్రారంభం అయినపుడు హైదరాబాదుకు నసీరుద్దౌలా నవాబుగా ఉన్నాడు
- తిరుగుబాటు ప్రారంభమైన వారం రోజులకు నసీరుద్దౌలా మరణించడంతో అఫ్జల్ ఉద్దౌలా హైదరాబాద్ నవాబు అయ్యాడు.