History of 5th Nizam in Asaf Jahi Dynasty
అఫ్జల్ ఉద్దౌలా (1857-69): 5వ నిజాం
- ఇతని కాలంలో 1857 తిరుగుబాటు జరిగింది
- ఆ సమయంలో ఔరంగాబాద్ తిరుగుబాటుదారుడైన మీర్ ఫిదా అలీని కెప్టెన్ అబ్బాస్ హతమార్చాడు
- అప్పుడే హైదరాబాద్ రెసిడెన్సీ భవనంపై దాడి చేశాడు. కానీ ఆ దాడిని డేవిడ్సన్ తిప్పికొట్టాడు
- ఇతను తిరుగుబాటు కాలంలో బ్రిటిష్ వారికి మద్దతు పలికి స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదు పొందాడు
- రాయచూర్, ఉస్మానాబాద్ ప్రాంతాలను బ్రిటిష్ వారి నుండి తిరిగి పొందాడు
- ప్రధాని 1వ సాలార్జంగ్ పేరు మీదుగా అఫ్జల్ మొదటిగా నాణెములు ముద్రించాడు
- ఇతని కాలంలో అనేక శాఖలు ఏర్పాటు చేయబడ్డాయి. ఉదా. కస్టమ్స్ శాఖ, అటవీశాఖ, ప్రజా పనుల శాఖ
- 1862 లో పోస్ట్ ఆఫీస్ ను ఏర్పాటు చేశాడు
- 1869లో హైదరాబాద్ లో మొట్టమొదటి తపాలా బిళ్ల ప్రవేశపెట్టబడింది. అదే సంవత్సరంలో తపాల శాఖ ఏర్పాటు చేయబడింది
- చౌమహల్లా ప్యాలెస్ నిర్మాణం ఇతని కాలంలో పూర్తయింది
- 1859-66 మధ్యకాలంలో అఫ్జల్గంజ్ (నయాపూల్) వంతెన నిర్మించబడింది
- అఫ్జల్గంజ్ రైల్వే బ్రిడ్జి 1860లో నిర్మించారు