History of 6th Nizam in Asaf Jahi Dynasty
మీర్ మహబూబ్ అలీఖాన్ (1869-1911): 6వ నిజాం
- ఇతను మైనర్ గా ఉన్నప్పుడే పాలకుడు అగుటచే పాలనా బాధ్యతలు ఒకటవ సాలార్జంగ్ మరియు షంషద్ లకు అప్పగించ బడ్డాయి
- ఇతని కాలంలో ఒకటవ సాలార్ జంగ్ సంస్కరణలు అన్నిటినీ పూర్తిగా అమలు చేశాడు
- 1883లో ఒకటవ సాలార్జంగ్ మరణించిన తర్వాత అప్పటి భారత గవర్నర్ జనరల్ లార్డ్ రిప్పన్ హైదరాబాద్ లో పర్యటించి హైదరాబాద్ పాలనా బాధ్యతలు మీర్ మహబూబ్ అలీఖాన్ కు అప్పగించాడు
- 1883లో చందా రైల్వే పథకం సంఘటన ఇతని కాలంలోనే జరిగింది
- 1881లో హైదరాబాద్ లో మొట్టమొదటి బాలికల పాఠశాల అయిన గ్లోరియా గర్ల్స్ హైస్కూల్ ఏర్పాటు చేయబడింది
- 1887లో చాదర్ ఘాట్ స్కూల్లోని ఇంటర్మీడియట్ శాఖ మరియు మదర్సా-ఇ-ఆలయాలను విలీనం చేసి ప్రఖ్యాత నిజాం కళాశాలను ఏర్పాటు చేశారు
- 1888లో తెలంగాణలోని ప్రజలు మొదటిగా ముల్కీ హక్కులను డిమాండ్ చేశారు
- అప్పట్లో స్థానికంగా అర్హులైన వారు లేరని ఉత్తర భారతదేశానికి చెందిన వారిని హైదరాబాదులో ఉద్యోగులుగా నియమించేవారు
- దీనిని ఖండిస్తూ 1888లో తెలంగాణ ప్రజలు ఈ విధానాన్ని రద్దు చేయాలని మహబూబ్ అలీ ఖాన్ ను కోరారు
- దీనికి స్పందించిన మహబూబ్ అలీఖాన్ 1888 లోనే ముల్కీ నిబంధనలను రూపొందించి స్థానికులకే ఉద్యోగులుగా నియమించాలని ఆదేశించాడు
- ముల్కీ అనగా స్థానికుడు కి అధికారం ఇచ్చుట
- 1919 తరువాత మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ ముల్కీ నిబంధనలను కచ్చితంగా అమలు చేశాడు
- ఇతని కాలంలో లెజిస్లేటివ్ కౌన్సిల్ (మంత్రి మండలి) ఏర్పాటు చేసారు
- ఇతని కాలంలో ఈ క్రింది నిర్మాణాలు జరిగాయి
- 1874-సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
- 1882-చంచలగూడ జైలు
- 1884-ఫలక్ నమా ప్యాలెస్ (వికారుద్దీన్ నిర్మించాడు)
- 1885-టెలిఫోన్ వ్యవస్థ
- 1890-నిజామియా అబ్జర్వేటరీ (సైన్స్ పరిశోధన కొరకు)
- వీటితోపాటు మోండా మార్కెట్, జింఖానా గ్రౌండ్, పరేడ్ గ్రౌండ్, బొల్లారం గోల్ఫ్ కోర్సులను నిర్మించి హైదరాబాద్ అభివృద్ధికి తోడ్పడ్డాడు
- 1908లో మూసీ ఉప్పెన సంభవించినప్పుడు ఇతను వరద బాధితుల కొరకు తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేశాడు. ఈ శిబిరంలో ఉన్న వారికి మూడు నెలల పాటు నెయ్యితో భోజనం అందించాడు.