History of 7th Nizam in Asaf Jahi Dynasty
మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ (1911-1948): 7వ నిజాం
- తెలంగాణ హైదరాబాద్ చరిత్రలో మీర్ ఉస్మాన్ అలీఖాన్ ది గ్రేట్ గా పరిగణించబడతాడు
- ఇతను పురాతన హైదరాబాద్ రాజ్యాన్ని ఆధునికంగా తీర్చిదిద్ది ప్రస్తుత హైదరాబాద్ అభివృద్ధికి ప్రధాన కూడలి నిర్మించాడు
- బ్రిటిష్ వారు ఇతనికి ఇచ్చిన బిరుదు - HIS (His Exalted Highness)
- మొదటి ప్రపంచ యుద్ధం 1914-18 రెండవ ప్రపంచ యుద్ధం 1939-45 లలో బ్రిటిష్ వారికి సహకరించిన అందుకుగాను బ్రిటిష్ వారు HIS అనే బిరుదు ఉస్మాన్ అలీఖాన్ కు ఇచ్చారు
- భారతదేశానికి స్వతంత్రం రాక ముందే హైదరాబాద్ సంస్థానం ఎన్నో రంగాల్లో ప్రపంచానికే మార్గదర్శకం గా ఉంది
- దేశంలో ఎక్కడా లేనంత అభివృద్ధి హైదరాబాద్ సంస్థానంలో జరిగింది
- దేశంలోనే మొట్టమొదటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ హైదరాబాద్ ఆనాటి కాలంలో కలిగి ఉండి ప్రత్యేకతను సంతరించుకుంది
- తపాలా సర్వీసులు వంటి అనేక రంగాల్లో హైదరాబాద్ ఎంతో ముందంజలో ఉండేది
- ఇంతటి అభివృద్ధికి కారణమైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బ్రిటిష్ వారు ద గ్రేట్ హీరో అని అభివర్ణించారు
- బ్రిటిష్ వారితోనే ద గ్రేట్ హీరో అనిపించుకున్న మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గురించి ఇప్పటివరకు మన చరిత్ర పుస్తకాలలో ఒక విషయాన్ని మాత్రమే చూపాయి కానీ మీరు ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క మరో పార్శ్వాన్ని కూడా గమనించినట్లయితే అతను ఎంత అభివృద్ధి చేసాడో అర్థమవుతుంది
- తండ్రి మీర్ మహబూబ్ అలీఖాన్ మరణాంతరం 1911 సెప్టెంబర్ 18న మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ పాలకుడు అయ్యాడు
- మీర్ ఉస్మాన్ అలీఖాన్ వజ్రాల వ్యాపారం చేసేవాడు. అప్పటి ప్రపంచ వజ్రాల మార్కెట్లో 70 శాతం పైన వజ్రాలను ఇతనే సరఫరా చేసేవాడు. అందువల్లనే ఇతని ఆస్తి వేలకోట్ల లోకి ఎగబాకింది
- 1937 ఫిబ్రవరి 22న టైమ్ మ్యాగజైన్ ప్రచురించిన ప్రపంచ అత్యంత ధనికుల జాబితాలో మీర్ ఉస్మాన్ అలీఖాన్ అత్యంత ధనికుడిగా చోటు సంపాదించాడు
- ఇతను అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు. 10 వేల కోట్ల విలువ చేసే డైమండ్ పేపర్ వెయిట్ గా ఉపయోగించాడు
- 1948లో హైదరాబాద్ భారత యూనియన్ లో విలీనమైన తర్వాత ఉస్మాన్ అలీఖాన్ భారతదేశ అత్యంత ధనికుడు కొనసాగాడు
- మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1967 ఫిబ్రవరి 24న మరణించాడు.
- మీర్ ఉస్మాన్ అలీఖాన్ మృతితో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పది రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది
- మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మరణించినప్పుడు అతని అంతిమ యాత్రలో లక్షల మంది జనం పాల్గొన్నారు దేశంలోనే రెండవ అతిపెద్ద అంతిమయాత్ర మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యాత్ర ప్రసిద్ధిచెందింది (మొదటిది జవహర్ లాల్ నెహ్రూ అంతిమయాత్ర)