ఉస్మాన్ అలీ ఖాన్ వ్యవసాయ అభివృద్ధి కొరకు సాగు మరియు త్రాగునీటి కొరకు ఈ క్రింది చెరువులను త్రవ్వించాడు
- ఉస్మాన్ సాగర్ (గండిపేట) - 1920
- నిజాం సాగర్
- హిమాయత్ సాగర్ - 1927
- అలీసాగర్ (నిజామాబాద్)
- రాయపల్లి చెరువు (మెదక్)
తుంగభద్ర, నిజాంసాగర్ ప్రాజెక్టులు ఇతని కాలంలో ప్రారంభమైనవవే.
ఉస్మాన్ అలీఖాన్ పరిశ్రమల ఏర్పాటును పెద్దఎత్తున ప్రోత్సహించాడు
- 1910 - సోడా ఫ్యాక్టరీ
- 1910 - ఐరన్ ఫ్యాక్టరీ
- 1916 - దక్కన్ బటన్ ఫ్యాక్టరి
- 1920 - సింగరేణి కాలరీస్ (కరీంనగర్)
- 1921 - కెమికల్ లేబరేటరీ
- 1927 - దక్కన్ గ్లాస్ ఫ్యాక్టరీ
- 1929 - డి.బి.ఆర్. మిల్స్
- 1930 వి.ఎస్. టి ఫ్యాక్టరీ (వజీర్ సుల్తాన్ టొబాకో ఫ్యాక్టరీ)
- 1934 - అజంజాహి మిల్స్ (వరంగల్)
- 1932 - నిజాం స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్
- 1937 - నిజాం షుగర్ ఫ్యాక్టరీ (బోధన్ చక్కెర ఫ్యాక్టరీ)
- 1939 - సిర్పూర్ పేపర్ మిల్
- 1941 - గోల్కొండ సిగరెట్ ఫ్యాక్టరీ
- 1942 - హైదరాబాద్ ఆల్విన్ మెటల్స్
- 1943 - ప్రాగా టూల్స్
- 1946 - హైదరాబాద్ ఆస్బెస్టాస్
- 1947 హైదరాబాద్ లామినేషన్ ప్రొడక్ట్
- 1874లో మొట్టమొదటి రైల్వే లైన్ సికింద్రాబాద్ మరియు వాడి ల మధ్య మహబూబ్ అలీఖాన్ కాలంలో నిర్మించబడింది. దీని తర్వాత హైదరాబాద్ నుండి ప్రముఖ పట్టణాలను కలుపుతూ ఉస్మాన్ అలీఖాన్ రైల్వేలైను నిర్మించాడు
- ఉస్మాన్ అలీ ఖాన్ భారతదేశంలోనే మొట్టమొదటిగా డబుల్ డెక్కర్ బస్సులను 1940లో ప్రారంభించాడు
- 1941లో హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ ను ఏర్పాటు చేశాడు. ఇది హైదరాబాద్ యొక్క కేంద్రీయ బ్యాంకుగా విధులు నిర్వహించింది
- అప్పటి బ్రిటిష్ భారతదేశంలో సొంత కరెన్సీ కలిగిన ఏకైక సంస్థానం హైదరాబాద్. ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ రూపీ, ఉస్మానియా సిక్కా అనే పేరుతో సొంత కరెన్సీని ముద్రించాడు. ఇతని కాలంలో రూ. 100, రూ. 1000 నోట్లు ఉండేది