Development Programs in Asaf Jahi Dynasty-10

TSStudies
Development Programs in Asaf Jahi Dynasty
హైదరాబాదులో ప్రస్తుతం వివిధ అధికారాల కార్యకలాపాలు కార్యక్రమాల కొరకు వినియోగిస్తున్న భవనాలన్నీ ఉస్మాన్ అలీఖాన్ నిర్మించినవే 
  • అసెంబ్లీ (1913): దీన్ని టౌన్ హాల్  అనే వారు దీన్ని పురపాలక ఆఫీసులో ఉపయోగించేవారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 1934 లో ఏర్పాటయింది
  • హైకోర్టు (1919) 
  • సాలార్ జంగ్ మ్యూజియం (1918): దీనిలోని వస్తువులను మూడవ సాలార్జంగ్ మీర్ యూసుఫ్ అలీఖాన్ సేకకరించాడు 
  • ఉస్మానియా హాస్పటల్ (1920-25) 
  • జూబ్లీ హాల్ (1936): ఉస్మాన్ అలీఖాన్ 25 సంవత్సరాల పరిపాలన (సిల్వర్ జూబ్లీ) సందర్భంగా 1936 లో దీని నిర్మాణం జరిగింది 
  • సెంట్రల్ లైబ్రరీ 
  • లేకేవ్యూ  గెస్ట్ హౌస్
  • రాజ్ భవన్ (1930) 
  • కింగ్ కోఠీ ప్యాలెస్-కమలాకర్ నిర్మించాడు 
  • నిజామియా అబ్జర్వేటరీ - దీన్ని జాఫర్ బహదూర్ ఏర్పాటు చేశాడు 

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మొట్టమొదటి భవంతి అయినా ఆర్ట్స్ కళాశాల 1919 ఆగస్టు 28 ప్రారంభమైంది పార్ట్ కళాశాల ను నిర్మించింది - నవాబ్ అలీ జంగ్ 
తెలంగాణ ప్రభుత్వం నవాబ్ అలీ జంగ్ జయంతి జూలై 11 రాష్ట్ర ఇంజనీర్స్ డే గా నిర్వహిస్తుంది

నిజాం కాలంలో ఏర్పడిన సంస్థలు 
  • 1921 - నిజాం రాష్ట్ర జన సంఘం
  • 1927 - ఎం..ఎం మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్
  • 1930 - ఆంధ్ర మహాసభ 
  • 1938 - హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ 
  • 1943 - ఆంధ్ర సారస్వత పరిషత్తు
ఉస్మాన్ అలీఖాన్ రాజకీయ సంస్కరణ కొరకు అవరముదం అయ్యంగార్ కమిటీని ఏర్పాటు చేశాడు 


మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలంలో అనేక ఆసుపత్రులు ఏర్పడ్డాయి 
  • 1916 హోమియోపతి శాల ఆసుపత్రి 
  • 1925-27 ఉస్మానియా జనరల్ ఆసుపత్రి 
  • 1927 చార్మినార్ యునానీ ఆయుర్వేదిక్ ఆసుపత్రి 
  • 1945 నీలోఫర్ చిన్నపిల్లల ఆసుపత్రి 

దీంతో పాటు గాంధీ దవాఖానా, టి. బి. దవాఖానా (ఎర్రగడ్డ), కాన్సర్ దవాఖాన, .ఎన్.టి దవాఖానా, నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్, కోరంటి దవాఖానాలు ఉస్మాన్ అలీఖాన్ కాలంలో ఏర్పాటు చేయబడ్డాయి 

1940లో బహదూర్ రజాకార్ వ్యవస్థను రూపొందించాడు 
1946లో రజాకార్లకు ఖాసిం రజ్వీ నాయకుడు అయ్యాడు 
1948 సెప్టెంబర్ 13-17 జరిగిన 'ఆపరేషన్ పోలో' కారణంగా హైదరాబాద్ భారతదేశం లో విలీనం అయింది దీంతో అసఫ్ జాహీల పాలన అంతమైంది.