Development Programs in Asaf Jahi Dynasty-11

TSStudies
Development Programs in Asaf Jahi Dynasty
హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ 
1938 జనవరి 29 హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ మాడపాటి హనుమంతరావు, బూర్గుల రామకృష్ణారావు ,స్వామి రామానంద తీర్థ, జి.రామాచారి మొదలగువారి ప్రయత్నాల ఫలితంగా ఏర్పాటు చేయబడింది 
హైదరాబాద్ పొలిటికల్ కాన్ఫరెన్స్ లు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పాటుకు స్ఫూర్తినిచ్చాయి 
హైదరాబాద్ పొలిటికల్ కాన్ఫరెన్స్లు  మొత్తం నాలుగు జరిగాయి అవి :
  • 1923 - కాకినాడ - మాధవరావు అనై 
  • 1926 - బొంబాయి - వై ఎం కాలే 
  • 1928 - పుణే - యస్ సి కాల్కర్
  • 1931 - అకోలా - రామచంద్రనాయక్ 
1938 జనవరిలో మాడపాటి హనుమంతరావు తెలుగు వారి అభివృద్ధిని చర్చించుటకు హైదరాబాదులో ఒక సదస్సును నిర్వహించారు.  సభలోనే 1938 జనవరి 29 తెలుగు వారి అభివృద్ధి కొరకు హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ ను స్థాపిస్తునట్లు ప్రకటన చేయబడింది. 
హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పై నిషేధం 
  • మహాసభ ముందు రోజు సెప్టెంబర్ 8 అప్పటి హైదరాబాద్ ప్రధాని అక్బర్ హైదరీ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అగ్ర నాయకులలో జి.రామాచారిని పిలిపించి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పై చర్చించాడు
  • హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ లో కాంగ్రెస్ అనే పదాన్ని తొలగించాలని అక్బర్ హైదరీ పట్టుపట్టాడు కానీ జి.రామాచారి తిరస్కరించాడు. 
  • దీనితో సెప్టెంబర్ 8 హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పై నిషేధం విధించ బడింది 
నిషేధం ఎత్తివేతకు సత్యాగ్రహం (1938 అక్టోబరు 24-డిసెంబర్ 24)
  • 1938 అక్టోబరు 24 సుల్తాన్ బజార్ నుండి సత్యాగ్రహం ప్రారంభమైంది 
  • అప్పుడే గోవిందరావు నానల్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు  
  • కాశీనాథ్ రావు వైద్య, గాంధీ బిల్లుతో సత్యాగ్రహాన్ని నిలిపివేశాడు 
  • గాంధీ విజ్ఞప్తి మేరకు అక్బర్ హైదర్ అలీ అరెస్ట్ అయిన వారిని విడుదల చేశాడు 
  • కాశీనాథ్ వైద్య హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనే పుస్తకాన్ని రచించాడు 
హైదరాబాదులో క్విట్ ఇండియా ఉద్యమం 1942 
  • దీనిని వ్యాప్తి చేయడంలో డా.మెల్కోటే కీలక పాత్ర పోషించాడు 
  • స్వామి రామానంద తీర్థ ఉత్తరం ఆధారంగా ఉద్యమ వ్యాప్తి జరిగింది 
  • పద్మజా నాయుడు హైదరాబాదులోని రెసిడెన్సి భవనంపై కాంగ్రెస్ పతకం ఎగురవేసింది 
హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పై నిషేధం ఎత్తివేత (1946 జూలై)
  • 1940లో రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి లు హైదరాబాదులో కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేశారు 
  • 1940-46 మధ్యకాలంలో కమ్యూనిస్టులు హైదరాబాదులో బాగా బలపడ్డారు 
  • 1946 జూలై లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పై నిషేధం ఎత్తివేత బడింది 
  • హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ మహాసభ (1947 మే) 
  • మొదటి మహాసభ హైదరాబాదులో నిర్వహించింది
  • 1947 జూన్ 12 నిజాం ఉస్మాన్ అలీఖాన్ సర్వస్వతంత్రుడని ప్రకటించుకున్నాడు 
  • దీని తర్వాత నిజాం వ్యతిరేక ఉద్యమాలు ఉధృతమయ్యాయి 
  • 1947 ఆగస్టు 7 న స్వామి రామానంద తీర్థ హైదరాబాద్ భారతదేశం లో విలీనం అవ్వాలని పేర్కొంటూ 'జాయిన్ ఇండియా' ఉద్యమాన్ని ప్రారంభించాడు. దీంతో ఇతను అరెస్ట్ చేయబడ్డాడు 
  • 1947 ఆగస్టు 15 మోతిలాల్ మంత్రి సుల్తాన్ బజార్ వద్ద భారత దేశ తిరంగా పతాకాన్ని ఎగురవేశాడు 
  • 1948 సెప్టెంబర్ 17  హైదరాబాద్ భారత యూనియన్ లో విలీనమైంది