Activities of Aryasamaj in Nizam State
2) ఆంధ్ర మహాసభ - 1930
3) ఆంధ్ర సారస్వత పరిషత్తు - 1943
ఆర్యసమాజ్ కార్యకలాపాలు
- 1875లో దయానంద సరస్వతి ఆర్యసమాజము మొదటిగా బాంబే లో స్థాపించాడు.
- 1892లో ఆర్యసమాజ్ శాఖ హైదరాబాదులో దయానంద సరస్వతిచే ఏర్పాటు చేయబడింది.
- దీని మొదటి అధ్యక్షుడు కమతా ప్రసాద్ మిశ్రా,
- కేశవరావు కోరట్కర్, గణపతి హార్దికార్, వామనరావ్ నాయక్, దామోదర్ సత్యలేకర్, అఘోరనాథ్ చటోపాధ్యాయ మొదలగువారు ఆర్యసమాజ్ లో సభ్యులుగా చేరి వేదాల ప్రాముఖ్యతను తెలియజేస్తూనే ప్రజల్లో రాజకీయ చైతన్యం కలిగించారు.
సంస్థలు
- తెలంగాణాలో సామాజిక సాంస్కృతిక రాజకీయ చైతన్యం రావడం లేదు. ఈ క్రింది సంస్థలు కీలక పాత్ర పోషించాయి.
2) ఆంధ్ర మహాసభ - 1930
3) ఆంధ్ర సారస్వత పరిషత్తు - 1943
నిజాం రాష్ట్ర జన సంఘం Nizam State Jan Sangh
- 1921 నవంబర్ 11, 12 తేదీలలో హైదరాబాద్ లోని వివేకవర్ధిని థియేటర్లో మహర్షి కార్వే అధ్యక్షతన నిజాం రాజ్యంలో సామాజిక సంస్కరణలు అనే ఒక అంశంపై సభ జరిగింది.
- ఈ సభలో కన్నడ, మరాఠీ, ఉర్దూ, ఆంగ్లం మరియు తెలుగు మాట్లాడే నాయకులు పాల్గొన్నారు.
- మొదటి రోజు ప్రధానంగా కన్నడ, మరాఠీ, ఉర్దూ, ఆంగ్ల భాషలోనే ప్రసంగాలు జరిగాయి
- మాడపాటి హనుమంతరావు మొదటిరోజున తెలుగులో ప్రసంగం చేశాడు. ఇతను తెలంగాణ లో అగ్ర నాయకుడు కావడం వల్ల అతని ప్రసంగాన్ని ఎవరూ అడ్డుకోలేదు
- నవంబర్ 12న న్యాయవాది అయిన ఆలంపల్లి వెంకటరామారావు తెలుగులో ప్రసంగిస్తున్నప్పుడు కన్నడిలు మరియు మరాఠీలు అతని ప్రసంగాన్ని అడ్డుకున్నారు
- దీంతో అల్లంపల్లి రామారావు తన ప్రసంగాన్ని మధ్యలోనే నిలిపివేయవలసి వచ్చింది.
- ఈ సంఘటనతో తెలుగు భాష ఎంత దీనమైన స్థితిలో ఉందో మన తెలుగు నాయకులకు అర్థమైంది.
- అదే రోజు సాయంత్రం తెలుగు నాయకులైన మాడపాటి, జమలాపురం కేశవరావు, బూర్గుల రామకృష్ణారావు కె.వి.రంగారెడ్డి, ఆర్ రాజగోపాల్ రెడ్డి మొదలగువారు న్యాయవాది అయిన టేకుమళ్ళ రంగారావు గారి ఇంట్లో సమావేశమయ్యారు
- తెలుగుభాష ఉనికిని చాటుతూ చాటుటకు ఒక సంస్థను ఏర్పాటు చేయాలని నాయకులు నిర్ణయించారు
- 1921 నవంబర్ 12న తెలుగుభాష ఉనికిని చాటుటకై నిజాం రాష్ట్ర జన సంఘం ఒక రాజకీయ సంస్థగా టేకుమళ్ళ రంగారావు గారి ఇంటిలో ఆవిర్భవించింది
- దీని స్థాపనలో కీలక పాత్ర పోషించిన వాడు మాడపాటి హనుమంతరావు
- 1922 ఫిబ్రవరి 24న నిజాం రాష్ట్ర జన సంఘం యొక్క మొదటి సమావేశం హైదరాబాద్ లో జరిగింది. దీనికి అధ్యక్షుడు - కె.వి.రంగారెడ్డి, కార్యదర్శి - మాడపాటి హనుమంతరావు
- 1923లో తెలంగాణలో తెలుగు భాష కొరకు స్థానికంగా ఆవిర్భవించిన సంస్థలన్నీ నిజాం రాష్ట్ర జన సంఘం లో విలీనమయ్యాయి. అప్పటి నుండి ఈ సంస్థ నిజాం రాష్ట్ర కేంద్ర జలసంఘం గా పిలువబడింది
- నిజాం రాష్ట్ర కేంద్ర జల సంఘం యొక్క మొదటి సమావేశం 1923 ఏప్రిల్ 1న హనుమకొండలో జరిగింది. దీనికి అధ్యక్షుడు - రాజగోపాల్ రెడ్డి, కార్యదర్శి - మాడపాటి హనుమంతరావు.
నిజాం రాష్ట్ర కేంద్ర జల సంఘం యొక్క కార్యకలాపాలు
1. గ్రంథాలయాలు ఏర్పాటు చేయుట
2. తెలుగు పాఠశాలలను ఏర్పాటు చేయుట
3. తెలుగు విద్యార్థులకు స్కాలర్ షిప్ లు ఇచ్చుట
4. తెలుగులో వ్యాస పోటీలు నిర్వహించి బహుమానాలు ఇచ్చుట
5. తెలుగు కళలను ప్రోత్సహించటం
6. క్రీడలను ప్రోత్సహించుట
7. తెలుగువారి చరిత్ర పరిశోధన కొరకు లక్ష్మణరాయ పరిశోధన మండలి ఏర్పాటు
లక్ష్మణరాయ పరిశోధన మండలి కార్యదర్శి అయినా వీరభద్ర రాజు అనేక తాళపత్రాలను శాసనాలను సేకరించాడు.
నిజాం రాష్ట్ర కేంద్ర జలసంఘం క్రింది పుస్తకాలు కరపత్రాలు ప్రచురణ ద్వారా బాగా ప్రసిద్ధి చెందింది.
i) వర్తకుల స్వేచ్ఛ - అవినీతి అధికారుల నుండి వర్తకులకు రక్షణ కల్పించింది
ii) వెట్టిచాకిరి - వెట్టిచాకిరి రద్దుకు చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చింది
iii) మోతుర్బా మగ్గం పన్ను - చేనేతకారులపై విధించే ఈ మగ్గం పన్నులను రద్దు చేయించింది
నిజాం రాష్ట్ర కేంద్ర జలసంఘం ఇతర పుస్తకాలు
1) నిజాం రాష్ట్ర అభివృద్ధి మార్గములు
2) నిజాం రాష్ట్ర ఆంధ్రులు
- 1930లో కాకతీయుల చరిత్ర గోష్ఠి అనే పేరుతో వరంగల్లో ఒక సభను నిర్వహించింది. ఈ సభ అనంతరం వరంగల్ నుండి కాకతీయ సంచిక ప్రచురించబడింది
- 1930లో సురవరం ప్రతాప రెడ్డి అధ్యక్షతన నిజాం రాష్ట్ర కేంద్ర జలసంఘం మెదక్ లోని జోగిపేటలో సమావేశం అయ్యింది. ఈ సమావేశంలోనే నిజాం రాష్ట్ర కేంద్ర జల సంఘం ఆంధ్ర మహాసభ అనే పేరుతో ఒక రాజకీయ సంస్థగా అవతరించింది.