History of Andhra Saraswatha Parishath
ఆంధ్ర సారస్వత పరిషత్
ఆంధ్ర సారస్వత పరిషత్
- నిజాం రాష్ట్ర జనసంఘం 1930లో 'ఆంధ్రమహాసభ' అనే పేరుతో ఒక రాజకీయ సంస్థగా అవతరించిన తరువాత తెలుగు భాష వ్యాప్తికి కావలసిన చర్యలను నిర్లక్ష్యం చేసింది.
- దీంతో తెలుగు భాషపై అభిమానం గల కొంతమంది నాయకులు తెలుగు భాష వ్యాప్తికి కొరకు ఒక ఒక రాజకీయేతర సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఫలితంగా 1943 మే 26న ఆంధ్ర సారస్వత పరిషత్ ఒక రాజకీయేతర సంస్థగా తెలుగు భాషా వ్యాప్తి కొరకు ఆవిర్భవించింది.
- దీని స్థాపనలో దేవులపల్లి రామానుజరావు, లోక్ నంది శంకర నారాయణ రావు, రంగమ్మ ఓబుల్ రెడ్డి లు కీలక పాత్ర పోషించారు. దీని మొదటి అధ్యక్షుడు-లోక్ నంది శంకర నారాయణ రావు
- ఆంధ్ర సారస్వత పరిషత్తు యొక్క కార్యకలాపాలు మొదట్లో గోల్కొండ పత్రిక కార్యాలయం నుండి జరిగాయి.
ఈ సంస్థ కార్యకలాపాలు
1) తెలుగు పాఠశాలల ఏర్పాటును ప్రోత్సహించుట
2) గ్రంథాలయాలు ఏర్పాటును ప్రోత్సహించడం
3) వ్యాస పోటీలు నిర్వహించి బహుమానాలు ఇచ్చుట
4) తెలుగు కవులు, రచయితలను సన్మానించుట
5) తెలుగులో ఉపన్యాసాలు నిర్వహించుట
ఈ సంస్థ నిర్వహించిన ప్రధాన ఉపన్యాసాలు
1) మహాభారత ఉపన్యాసం
2) మహాభాగవత ఉపన్యాసం
3) ఆంధ్ర సప్తాహం