పత్రికలు
The Role of Press in Public Awareness of Telangana
పత్రికలు
- భారతదేశంలో మొదటి పత్రిక-బెంగాల్ గెజిట్. దీన్ని ఆగస్టస్ హిక్కి ప్రకటనల కొరకు ప్రచురించాడు
- భారతదేశంలో తొలి పత్రికలలో ముఖ్యమైనది మిరాత్-ఉల్-అక్బర్ అని చెప్పవచ్చు. దీన్ని రాజా రామ్మోహన్ రాయ్ పర్షియన్ భాషలో ప్రచురించాడు
- హైదరాబాద్ తొలి పత్రిక రిసాలతబ్బి (ఉర్దూ). ఇది ఒక వైద్య పత్రిక. ఈ రిసాలతబ్బి పత్రిక తోనే హైదరాబాదులో జర్నలిజానికి బీజాలు పడ్డాయి
- హైదరాబాదులో మొదటి ఆంగ్ల పత్రిక - దక్కన్ టైమ్స్ (1864). ఇది సికింద్రాబాద్ నుండి వెలువడింది
తెలంగాణలో పత్రికా ప్రచురణలో ప్రధాన ఘట్టాలు:
1870 - వనపర్తిని పాలిస్తున్న పాలకులు బ్రహ్మ విద్యా విలాస అనే ముద్రణాలయంను ప్రారంభించారు
1875 - గద్వాలలో మరో ముద్రణాలయం ప్రారంభించబడింది
1882 - హైదరాబాద్ టెలిగ్రాఫి, 1885 లో ది హైదరాబాద్ రికార్డు అనే రెండు ఇంగ్లీషు పత్రికలు హైదరాబాద్ నుండి వెలువడ్డాయి
1886 - శేద్య చంద్రిక పత్రిక ప్రారంభించబడింది. శేద్య చంద్రిక ఉర్దూ పత్రిక పూనూన్కు అనువాదంగా పేర్కొంటారు రైతులకు ఉపయోగపడే వార్తలు ప్రచురించేది
1889 - డెక్కన్ స్టాండర్డ్ అనే ఇంగ్లీష్ పత్రిక హైదరాబాద్ నుండి వెలువడింది
1892 - జర్నలిజం రూపశిల్పిగా పేరుగాంచిన మాల్వి మోహిబ్ హుస్సేన్ మౌలామ్-ఇ-నిస్వాన్ అనే పత్రికను ప్రారంభించారు. ఈ పత్రిక ముస్లింలలో ఉన్న మూఢనమ్మకాలను రూపుమాపడానికి ప్రయత్నించేది. ఈ పత్రిక తర్వాత కాలంలో నిషేధించబడింది
1909 - క్రైస్తవ మత ప్రచారం కొరకు మధిర నుండి సంయుక్త సంఘ వర్తమాని అనే పత్రిక వెలువడింది
1913 - మహబూబ్ నగర్ నుండి హితబోధిని అనే వార పత్రిక వెలువడింది. తెలంగాణలో సంపూర్ణంగా స్వతంత్రంగా ఏర్పడిన మొట్టమొదటి పత్రిక. హితబోధిని సంపాదకులు - బండారు శ్రీనివాస శర్మ. ఈ పత్రికకు ఆత్మకూరు సంస్థానాధీశుడు రాజా శ్రీరామ భూపాల బల్వంత్ బహదూర్ ఆర్థిక సాయం చేశాడు. హితబోధిని వార పత్రిక కేవలం ఏడాది పాటు మాత్రమే నడిచింది
1917 - హైదరాబాద్ గౌలిగూడ లో ఆంధ్రమాత పత్రిక వెలువడింది. దీని సంపాదకులు - స్వామి వెంకట రావు. దివ్య జ్ఞాన సమాజం యొక్క భావాలతో పాటు ప్రభుత్వ కార్యకలాపాలను ఈ పత్రిక ప్రశ్నించేది. ఈ పత్రిక కేవలం ఎనిమిది నెలలు మాత్రమే నడిచింది
1918 - ది పంచమ అనే ఇంగ్లీష్ మాస పత్రిక వెలువడింది. దీని సంపాదకుడు - జె.ఎస్. ముత్తయ్య. దళితుల్లో చైతన్యం కోసం మన్య సంఘ కార్యదర్శి అయిన ముత్తయ్య దీనిని ఏర్పాటు చేశారు
1922 - నల్గొండ నుంచి నీలగిరి పత్రిక వెలువడింది దీని సంపాదకులు - షబ్నవీసు వెంకటరామ నరసింహారావు . ఇది ప్రారంభంలో ఇసుగుర్తి విజ్ఞాన ప్రచారిణీ ముద్రణాలయం నుండి, ఆ తర్వాత నల్గొండకు మార్చబడింది.