The Emergence of Sociocultural Movements in Telangana
తెలంగాణాలో సామాజిక సాంస్కృతిక ఉద్యమాల ఉద్భవం
తెలంగాణాలో సామాజిక సాంస్కృతిక ఉద్యమాల ఉద్భవం
తెలంగాణ ప్రజలలో సామాజిక సాంస్కృతిక పునరుజ్జీవనం రాజకీయ చైతన్యం ఉద్భవించడంలో ఈ క్రింది సంఘటనలు, ఉద్యమాలు, పత్రికలు, సంస్థలు మొదలైనవి తోడ్పడ్డాయి
1) చందా రైల్వే పథకం
2) గ్రంథాలయోద్యమం
4) విద్య
5) కార్మిక సంఘాలు
7) సంస్థలు
8) సంఘాలు
- మహిళా సంఘాలు
- విద్యార్థి సంఘాలు
- కార్మిక సంఘాలు
9) ఆది హిందూ ఉద్యమం
చందా రైల్వే పథకం Chanda Railway Movement
- 1870 దశకంలో హైదరాబాద్, వాడి గుల్బర్గాల మీదుగా మద్రాసు నుండి బొంబాయి వరకు రైల్వే లైన్ నిర్మించుట కొరకు 1వ సాలార్జంగ్ మరియు బ్రిటిష్ ప్రభుత్వం మధ్య ఒక ఒప్పందం కుదిరింది
- దీనిలో భాగంగా 1874లో సికింద్రాబాద్, వాడి ల మధ్య మొట్టమొదటి రైల్వేలైన్ హైదరాబాద్ సంస్థానంలో నిర్మించబడింది
- ఇదే సమయంలో సింగరేణి మరియు చందా (ప్రస్తుతం మహారాష్ట్రలోని చందాపూర్) లలో బొగ్గు నిక్షేపాలు కనుగొనబడ్డాయి
- ఈ రెండు ప్రాంతాల మీదుగా రైల్వేలైన్ నిర్మిస్తే బొగ్గు నిక్షేపాలను సునాయాసంగా వేరే ప్రాంతాలకు తరలించవచ్చు అని భావించిన 1వ సాలార్జంగ్ చందా రైల్వే పథకమునకు కొన్ని మార్పులు చేశాడు (మహారాష్ట్ర వరకు పొడిగించాలని)
- దీనివల్ల ఖజానాపై అధిక భారం పడుతుంది కానీ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదు అందువల్ల ఈ పథకాన్ని గోప్యంగా ఉంచారు
- ఈ రైల్వేలైను నిర్మాణానికి బ్రిటిష్ కంపెనీ అయినా నిజాం గ్యారెంటీ స్టేట్ రైల్వే కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వబడింది
- 1883లో చందా రైల్వే పథకం గురించి ప్రజలకు తెలిసింది. దీంతో అఘోరనాథ ఛటోపాధ్యాయ (సరోజినీ నాయుడు తండ్రి ,నిజాం కాలేజీ మొదటి ప్రిన్సిపాల్), ముల్లా అబ్దుల్ ఖయ్యూం (హైదరాబాద్ నుండి భారత జాతీయ కాంగ్రెస్ లో చేరిన మొదటి ముస్లిం), ఆవూసింగ్ హూషాంగ్ లు ఈ చందా రైల్వే పథకం పునః సమీక్ష వలసిందిగా కోరుతూ ఒక విజ్ఞప్తి పత్రాన్ని హైదరాబాద్ నవాబ్ మీర్ మహబూబ్ అలీ ఖాన్ కు అందజేశారు.
- దీనికి ఆగ్రహించి మహబూబ్ అలీఖాన్ వీరు ముగ్గురిని రాజ్య బహిష్కరణ చేశాడు
- తక్షణమే దీన్ని ఖండిస్తూ తెలంగాణలో ప్రజలు సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించారు.
- దీంతో ప్రజలలో చైతన్యం ప్రారంభమైంది
- ఈ విధంగా తెలంగాణ ప్రజలలో చైతన్యం రావటానికి చందా రైల్వే పథకం నాంది పలికింది
- చందా రైల్వే పథకానికి అత్యధిక ప్రాధాన్యత నిచ్చిన ఆంగ్ల పత్రికలు - టైమ్స్ ఆఫ్ ఇండియా బెంగాల్ గెజిట్
