మౌర్యులు
భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక సువిశాల సామ్రాజ్యమును స్థాపించినవారు మౌర్యులు.
బౌద్ధ, జైన గ్రంథాల ప్రకారం మౌర్యులు క్షత్రియ వంశానికి చెందినవారు.
పురాణాల ప్రకారం మౌర్యులు శూద్ర వంశానికి చెందినవారు.
మౌర్య సామ్రాజ్యమును స్థాపించినవాడు చంద్రగుప్త మౌర్యుడు
చంద్రగుప్త మౌర్యుడు మగధపై మౌర్య సామ్రాజ్య స్థాపనను గూర్చి విశాఖదత్తుడి “ముద్రారాక్షసం” పేర్కొంటోంది.
క్రీ. పూ. 327లో మాసిడోనియా రాజైన అలెగ్జాండర్ వాయువ్య భారత్‌పై దండయాత్ర వల్ల వాయువ్య ప్రాంతంలోని చిన్న రాజ్యాలు ఐక్యమైనాయి. దానివల్ల చంద్రగుప్తమౌర్యుని కాలంలో రాజకీయ ఐక్యత ఏర్పడింది.
చంద్రగుప్త మౌర్యుడు(క్రీ.పూ. 321-298):
క్రీ.పూ.321 -చంద్రగుప్త మౌర్యుడు చాణుక్యుడు/కౌటిల్యుడు/విష్ణుగుప్తుడు సహాయంతో మగధపై మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు.
క్రీ. పూ. 305 -చంద్రగుప్త మౌర్యుడు ఆసియా మైనర్ రాజు సెల్యూకస్ నికేటర్‌ను (అలెగ్జాండర్ యొక్కజనరల్) ఓడించాడు.
క్రీ.పూ. 303 -సెల్యూకస్ నికేటర్‌తో జరిగిన ఒప్పందం ప్రకారం హీరత్, కాబూల్, గాంధార, బెలూచిస్తాన్ ప్రాంతాలను చంద్రగుప్త మౌర్యుడు పొందాడు.
దీనికి బదులుగా చంద్రగుప్త మౌర్యుడు 500 ఏనుగులను సెల్యూకస్‌కు ఇచ్చాడు.
సెల్యూకస్ నికేటర్ కుమార్తె హేలన్‌ను చంద్రగుప్త మౌర్యుడు వివాహమాడాడు.
సెల్యూకస్ మెగస్తనీసును తన రాయబారిగా చంద్రగుప్త మౌర్యుడు ఆస్టానానికి పంపాడు.
చంద్రగుప్త మౌర్యుని కాలంలో అతని గుజరాత్ వైశ్రాయి పుష్యగుప్త సుదర్శన సరస్సును త్రవ్వించాడు. (ఈ సరస్సు గురించి రుద్రదాముని యొక్క జునాగఢ్ శాసనంలో పేర్మొనబడింది)
క్రీ.వూ. 298లో చంద్రగుప్త మౌర్యుడు తన సామ్రాజ్యమును తన పెద్ద కుమారుడు బిందుసారునికి అప్పగించి కర్ణాటకలోని శ్రావణ బెళగొళకు చేరుకున్నాడు.
శ్రావణ బెళగొళలో 'నల్లేఖన” (ఉపవాసంతో మరణించుట) ను పాటించి మరణించాడు. (పరిశిష్ట పర్వన్‌లో పేర్కొనబడింది)
చంద్రగుప్త మౌర్యుని జ్ఞాపకార్ధం శ్రావణ బెళగొళలో చంద్రగిరిగుట్ట అను దేవాలయం నిర్మించబడింది.
బిందుసారుడు (క్రీ.పూ. 298-273):
క్రీ. పూ. 298-273
ఇతని అసలు పేరు - సింహసేన
ఇతని బిరుదు - అమిత్రగధ(శత్రు విధ్వంసకుడు)
ఇతను అజ్వికా మతాన్ని పోషించాడు.
ఇతని ఆస్థానంలో పింగళి వాస్తవ అనే అజ్వికా సన్యాసి ఉండేవాడు.
ఇతనే బిందుసారుని తర్వాత అశోకుడు పాలకుడు అవుతాడని పేర్కొన్నాడు. కానీ బిందుసారుడు సుసిమా తన తర్వాత రాజు అవ్వాలని కోరుకునేవాడు.
ఇతని ఆస్థానంలో గ్రీకు రాయబారి డెమియోకస్ (డైమోకస్). ఇతన్ని ఆంటియోకస్ పంపాడని స్ట్రాబో పేర్కొన్నాడు.
ఇతని ప్రధాని - ఖల్లాటకుడు
తనకు మద్యం, అత్తిపళ్లు, ఒక తాత్వికుడిని పంపమని సిరియా రాజును కోరాడు. కానీ సిరియా రాజు ఆంటియోకస్-1 తాత్వికుడిని మినహాయించి మిగతావి పంపాడు.
తారానాధ్ అను సన్యాసి బిందుసారుడు 2 సముద్రాల మధ్య (బంగాళాఖాతం, అరేబియా) భూభాగాన్ని ఆక్రమించాడని పేర్కొన్నాడు.
క్రీ.పూ. 273లో బిందుసారుని మరణానంతరం 4 సం॥ల పాటు సింహాసనం కొరకు వారసత్వ పోరు జరిగింది.
ఈ పోరులో అశోకుడు తన 99 మంది సోదరులను (మొగలి పుత్రతిస్యను మినహాయించి) హతమార్చి సింహాసనం అధిష్టించాడు (రాధాగుప్తుని సహాయంతో).
దీని గురించి దివ్య వదనలో ప్రస్తావించబడింది.
అశోకుని తల్లి పేరు-సుభద్రాంగి/జనపద కళ్యాణి
అశోకుడు (క్రీ.పూ. 269-232):
క్రీపూ. 261 - కళింగ యుద్ధంలో కళింగాధిపతిని ఓడించాడు. ఈ యుద్ధంలో లక్షమంది శత్రు సైన్యం హతమార్చబడింది. లక్షా 50 వేల మంది యుద్ధ ఖైదీలుగా పట్టుబడ్డారు.
ఈ యుద్ధం దయా నది తీరాన జరిగింది.
అప్పటి కళింగ రాజు రాజా అనంతన్. అప్పటి కళింగ సైన్యాధిపతి పద్మనాభన్.
యుద్ధం తర్వాత యుద్ధభూమిని సందర్శించిన అశోకుడు ఆ భీకర దృశ్యాలను చూసి హింన ద్వారా ఏమీ సాధించలేమని భావించి హింసను త్యజించుటకు నిర్ణయించాడు.
అశోకుడు బౌద్ద మతం స్వీకరించక ముందు శివుడు అతని ఇష్టదైవము అని కల్హణుడు తన 'రాజతరంగిణి'లో పేర్కొన్నాడు. .
క్రీపూ. 259 - అశోకుడు అశోక ధర్మాన్ని ప్రకటించాడు.
ఇది భారతదేశంలో మొట్టమొదటి లౌకిక మతము. దీని సిద్ధాంతాలు బౌద్ధ మతం, జైన మతం, హిందూ మతం నుంచి తీసుకోబడ్డాయి.
అశోకుడు ధర్మవ్యాప్తి కొరకు ధర్మ మహామాత్రికులు, రాజుకల(మొదట్లో వీరు రెవెన్యూ అధికారులు)ను నియమించాడు.
క్రీపూ. 251 - ౩వ బౌద్ధ సంగీతిని పాటలీపుత్రంలో నిర్వహించాడు.
క్రీపూ. 232 - అశోకుడు మరణించాడు.
అశోకుని ప్రధానమంత్రి రాధాగుప్పుడు. .
అశోకుని ఆస్థానమునకు తిహాప లేదా తుసప్ప అనే గ్రీకు రాయబారి సందర్శించాడు. తరువాత కాలంలో తుసస్పను గుజరాత్ వైస్రాయిగా నియమించాడు.
అశోకుడు, దశరథుడు బీహార్‌లోగల బరాబరా గుహలను (సుదామ గుహలు) అజ్వికా సన్యాసులకు ఇచ్చారు.
అశోకుని యొక్క పట్టమహిషి -అసంధిమిత్ర
అశోకుని యొక్క 2వ పట్టమహిషి -త్రిశ్య రక్షిత. త్రిశ్య రక్షిత బోధి వృక్షమునకు హాని చేసింది.
అశోకుని 3వ భార్య - కారువాకి
ఈమె అలహాబాద్ శాసనం లేదా రాణి శాసనంలో పేర్కొనబడింది. కుమారుడు తివారా కూడా ఈ శాసనంలో పేర్కొనబడ్డాడు.
అశోకుని 4వ భార్య -పద్మావతి
అశోకుని 5వ భార్య -దేవి (సంఘమిత్ర, మహేంద్రలకు తల్లి)
అశోకుడు బౌద్ధ మత వ్యాప్తి కొరకై మహేంద్ర, సంఘమిత్రలను శ్రీలంకకు పంపాడు.
అశోకుని మరణానంతరం సామ్రాజ్యం రెండుగా చీలిపోయింది.
1) తూర్పు
2) పశ్చిమ
తూర్పు ప్రాంతాన్ని దశరథుడు పాలించాడు.
పశ్చిమ ప్రాంతాన్ని కునలుడు పాలించాడు.
సాంప్రాతి మరలా మౌర్యసామ్రాజ్యమును విలీనం చేశాడు.
మౌర్యుల చివరి రాజు బృహద్రధను అతని మంత్రి పుష్యమిత్ర శుంగుడు హత్య చేశాడు. దీంతో మౌర్య సామ్రాజ్యము అంతమై మగథపై శుంగుల వంశం స్థాపించబడింది.