కుషాణులు(Kushan Empire) :
వీరి మొదటి రాజధాని - పురుషపురం / పెషావర్
రెండవ రాజధాని - మధుర
కుషాణులు 'యూచీ' తెగకు చెందినవారు.
కుషాణులలో మొట్టమొదటివాడు - కుజల కాద్‌పైజస్
విమాఖాడ్ స్టైజన్ శివుని రూవంతో బంగారు నాణెములను ముద్రించాడు.
కనిష్కుడు(Kanishka):
కుషాణులలో అతి గొప్పవాడు - కనిష్కుడు
కనిష్కుని బిరుదులు - దేవపుత్ర, రెండవ అశోకుడు, సీజర్ (చక్రవర్తి), మహారాజ, మహారాజాధిరాజ
ఇతను క్రీ.శ. 78లో శక యుగమును ప్రారంభించాడు.
కనిష్కుడు 4వ బౌద్ధ సంగీతిని కుందలవనం(జులంధర్- కాశ్మీర్)లో నిర్వహించాడు.
ఇతని ఆస్థానంలో వసుమిత్రుడు మహా విభాష శాస్త్రమును రచించాడు. ఇది త్రిపీఠకాలపై వ్యాఖ్య. దీన్ని Encyclopedia of Buddhism అంటారు.
అశ్వఘోషుడు - బుద్ధ చరితం, సౌందరనందం, మహావిచియ, సారిపుత్ర ప్రకరణం, వజ్రసూచి, సూత్రలంకార (దీనిని అసంగుడు కూడా రాశాడు) అనే గ్రంథాలను రచించాడు.
సుస్రోత- సుస్రోత సంహితలో అనేక సర్జరీల గూర్చి పేర్కొన్నాడు. (కొందరు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఇతను గుప్తలకు సమకాలికుడు)
చరకుడు - చరక సంహితమును రచించాడు. భరద్వాజుని ఆయుర్వేద ప్రస్తావన చేశాడు.
కనిష్కుడు - సూయి విహార్ శాసనమును చెక్కించాడు.
ఇతను పెషావర్‌లో ఒక పెద్ద బౌద్ధ విగ్రహాన్ని నిర్మించాడు.
ఇతను చైనా జనరల్ పాంచియాగో చేతిలో ఓడిపోయాడు.
కనిష్కుడు మహాయాన బౌద్ధ మతాన్ని పోషించి మధ్య ఆసియా మొదలగు ప్రాంతాలలో వ్యాప్తి చేశాడు.
అప్పట్లో మధురలో 'శతక' అనే వస్త్రము ప్రసిద్ధి చెందినది.
కుషాణుల సామంతుడైన సహపానుడు పశ్చిమ భారతదేశంలో విదేశీ వర్తకాన్ని నియంత్రించేవాడు.
వీరి కాలంలో బారిగజ (భరకచ్చ లేక బ్రోచ్) ఒక ముఖ్య రేవు పట్టణం. ఈ కాలంలో రోమ్‌తో భారతదేశానికి సంబంధాలు ఉన్నట్లు “పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ” గ్రంథం ద్వారా తెలుస్తుంది.
కుషాణులు భారత దేశంలో బంగారు నాణేలను విరివిగా జారీ చేశారు.
వీరి కాలంలోనే ప్రసిద్ధ గాంధార శిల్పకళ విలసిల్లింది.
బమియాన్ వడ గల బుద్ధ విగ్రహం అత్యంత ప్రాచీనమైనదని పండితుల అభిప్రాయం. దీనిలో బుద్దుడిని రక్షకునిగా మరియు”ఖభయ ముద్రలో చెక్కారు.
కుషాణుల కాలంలో మధుర శిల్పకళ కూడా బాగా అభివృద్ధి చెందింది.
కుషాణుల చరిత్రలో కనిష్కుని పాలనాకాలం స్వర్ణ ఘట్టంగా ఎంచదగినది.
ఇతని కాలంలోనే మధుర శాసనం వేయించబడింది.
కనిష్క వంశపు సామ్రాజ్యాల్లో చివరి ప్రభువు వాసుదేవుడు.
ఖారవేల కళింగుడు(Kharavela Kalinga):
కళింగ రాజ్యాన్ని స్థాపించినవాడు -మహామేఘవర్మ
ఇతని వంశం పేరు కూడా మహామేఘవర్మ
ఖారవేలుడు జైన మతాన్ని పోషించాడు. ఇతను ఉదయగిరి కొండల్లో, .హంథిగుంపా శాసనమును చెక్కించాడు.
ఇతను దక్షిణాన కన్నబెన్న(కృష్ణా నది) నది వరకు దండయాత్ర చేశాడు.
మూసిక నగరంపై కూడా దాడి చేశాడు.
ఉత్తరాన మగధపై దాడిచేసి అక్కడ దోచుకున్నా సొత్తుతో భువనేశ్వర్‌లో ఒక దేవాలయమును నిర్మించాడు.
ఖారవేలుని భవంతి పేరు -మహావిజయ ప్రసాదము
ఖారవేలుని బిరుదులు - మూసిక అధిపతి, కళింగ చక్రవర్తి, భిక్షు రాజు
సంగమ రాజ్యాలు/ వంశాలు(Sangama Dynasty) :
మొత్తం 3 సంగమ వంశాలు ఉన్నాయి
1) చోళ వంశం
2) పాండ్య వంశం
3) చేర వంశం
చోళులు(Chola Dynasty):
రాజధాని-ఉరైయూరు. తర్వాత పుహార్(కావేరిపట్నం)
అతి గొప్పరాజు - కరికాల చోళుడు
వీరి చిహ్నం - పులి
ఇతను పుహార్ లేదా కావేరి పట్టణమును నిర్మించాడు.
కావేరి నదిపై 160 కి.మీ. పొడవున కరకట్టలను నిర్మించాడు. దీని కొరకు శ్రీలంక నుండి 12,000 మంది బానిసలను తీసుకువచ్చాడు.
ఇతను వెన్ని యుద్ధంలో 11 మంది రాజులను ఓడించాడు.
పాండ్య వంశం(Pandya Dynasty) :
రాజధాని - మధురై
చిహ్నం - చేప
అతి గొప్పరాజు - నెడుంజెలియన్
ఇతను తలైలంగనం యుద్ధంలో చోళ మరియు చేర వంశ రాజులను ఓడించాడు.
చేర(Chera Dynasty):
రాజధాని - వంజి
చిహ్నం - ధనుస్సు
గొప్ప రాజు - సెంగుత్తవాన్
సెంగుత్తవాన్‌ను ఎర్ర చేర అని అంటారు.
ఇతను కన్నగి లేదా పట్టిని మతాన్ని ఆవిష్కరించాడు.