సంగమ పరిషత్తులు(Sangama Parishat's) :
మొదటి సంగమ పరిషత్తు :
ఇది తిన్ మధురైలో జరిగింది.
అధ్యక్షుడు - అగస్తుడు
దీనికి దేవుళ్లు, దేవతలు హాజరయ్యారని పేర్కొంటారు.
రెండవ సంగమ పరిషత్తు :
ఇది కపటపురంలో జరిగింది.
అధ్యక్షుడు - తోల్‌కప్పియార్
దీనిలో అనేక మంది కవులు పాల్గొన్నారు.
తోల్‌కప్పియార్ తోల్‌కప్పియంను రచించాడు. ఇది
తమిళంలో మొట్టమొదటి వ్యాకరణ గ్రంథం.
మూడవ సంగమ పరిషత్తు :
ఇది మధురైలో జరిగింది.
అధ్యక్షుడు - నక్కిరార్
దీనిలో అనేక మంది కవులు పాల్గొన్నారు.
పట్టు పట్టు (10 పుస్తకాలు), ఎట్టుతోగై (8 పుస్తకాలు) రచించబడ్డాయి. ఈ 18 ప్రధాన పుస్తకాలను మెల్మినక్కు అంటారు.
18 చిన్న పుస్తకాలను కల్మినక్కు అంటారు.
కల్మినక్కులో అతి ముఖ్యమైనది తిరుకురల్. దీనిని తిరువళ్లు వర్ రచించాడు. దీనిని తమిళ బైబిల్ అంటారు. దీనిని తమిళులు పంచమ వేదంగా పరిగణిస్తారు.
శిలప్పధికారంను ఇలంగో అడిగల్ రచించాడు (ప్రముఖపాత్ర-కోవలన్స, కన్నగి, మాధవి).
మణిమేఖలైను సత్తినార్ రచించాడు (ప్రిన్స్ ఉదయ్‌కుమార్, మణిమేఖలై).
జీవక సింథామణిని తిరుటక్కర తేవర్ రచించాడు (జీవకుడు-విన్యాసాలు).
పెరుందేవనార్ తమిళంలో మహాభారతాన్ని రచించాడు.
సంగమ ప్రజల ప్రధాన దేవుడు -మురుగన్/ కుమారస్వామి
సైనికులకు 'ఎనాడి' అనే బిరుదు ఇవ్వబడేది.
సైనిక వీరుల కొరకు విరుగల్ (విగ్రహాలు ప్రతిష్టించడం) సాంప్రదాయంగా ఉండేది.
నాణేలు- కాసు, కణకం, పోన్, వేంగ్‌పోన్
ఎర్రిపట్టి గ్రామాలు - వీటినుండి వసూలు చేసిన పన్నులు కేవలం నీటిపారుదల కొరకు-మూత్రమే ఉపయోగిస్తారు.
వేలాండర్ -మతపరమైన నృత్యం
కోయిల్ -దేవాలయాలు
ఖాజా-దక్షిణ భారతదేశంలో అతి ప్రాచీన గుహ