మౌర్య అనంతర యుగం
క్రీ.పూ. 2వ శతాబ్ధం నుండి క్రీ.శ. 3వ శతాబ్ధం మధ్యకాలంలో భారతదేశాన్ని అనేక వంశాలు పాలించాయి. ఈ మధ్య కాలాన్నే వర్తకుల యుగం అని కూడా అంటారు.
భారతీయ వర్తకులు ప్రపంచ వర్తకంపై ఆధిపత్యమును సాధించారు.
విదేశీయులను మ్లేచ్చాలు అనేవారు.
శుంగులు(Shunga dynasty):
శుంగ వంశ స్థాపకుడు -పుష్యమిత్ర శుంగుడు
ఇతను అశ్వవేధ యాగమును నిర్వపాంచి సింహాసనమును అధిష్టించాడు.
ఇతని కాలం నుంచి మరలా పురోహితుల ఆధిపత్యం ప్రారంభమైంది. ఇతని కాలంలోనే భగవత మతం ఆవిర్భవించింది. ఇది కర్మ మార్గం గురించి పేర్కొంది. ఇతని ఆస్థానంలోని పతంజలి 'మహాభాష్యము'ను రచించాడు.
ఇతను రాజధానిని విదిశకు (పాటలీపుత్రం నుండి) మార్చాడు.
ఇతని తర్వాత శుంగ పాలకుడు అగ్నిమిత్రుడు.
కాళిదాసుని మాళవికాగ్నిమిత్రంలో అగ్నిమిత్రుడు కథానాయకుడు.
తరువాత ముఖ్యమైన రాజు భాగుడు
భాగుని కాలంలో గ్రీకు రాయబారి హెలియో డోరస్ శుంగ రాజ్యాన్ని సందర్శించాడు. (ఇతను ఆంటియల్ సెడోస్ యొక్క రాయబారి)
హెలియోడోరస్ విదిశ దగ్గర గల బేస్‌నగర్ వద్ద విష్ణు స్థంభమును వేయించాడు.
శుంగుల చివరి పాలకుడు దేవభూతిని అతని మంత్రి వాసుదేవకణ్వ హతమార్చి మగధపై కణ్వ వంశాన్ని స్థాపించాడు.
కణ్వులు(Kanva Dynasty):
స్థాపకుడు - వాసుదేవకణ్వ
ఇతను రాజధానిని విదిశ నుంచి పాటలీపుత్రమునకు మార్చాడు.
ఇతని తర్వాత పాలకులు
- 1) భూమిమిత్ర
- 2) నారాయణ
- 3) సుశర్మ
శాతవాహన రాజు పులోమావి సుశర్మను అంతం చేసి మగధను శాతవాహన రాజ్యంలో విలీనం చేశాడు. దీంతో మగధ ప్రాముఖ్యత అంతమైంది.
ఇండో గ్రీకులు(Indo-Greeks):
ఇండో గ్రీకులలో మొట్టమొదటి దండయాత్రికుడు - డెమిట్రియస్
వీరిలో అతి గొప్పవాడు - మినాందర్
మినాండర్, నాగసేనుడు మధ్య జరిగిన బౌద్ధ సంభాషణపై మిళిందపన్హు అనే పుస్తకం రచించబడినది.
భారతదేశంలో మొట్టమొదటిసారిగా బంగారు నాణేలను ఇండోగ్రీకులు ప్రవేశపెట్టారు.
వీరి రాజధాని -సియోల్‌కోట్ లేదా సాకల
గాంధార శిల్చ్పకళ(వీరికాలం) ఇండోగ్రీకుల కాలం నుంచే ప్రారంభమైంది.
స్ట్రాటిగో లేదా మెరిడార్చి అనే సైనిక గవర్నర్‌షిప్‌ను (నిర్వహణా విధానం) వీరు ప్రవేశపెట్టారు
శకులు(Sakas Dynasty):
శకులు టొకారియన్ తెగకు చెందినవారు.
వీరులు త్రతార(రక్షకుడు) అనే బిరుదులు పొందేవారు.
వీరి మొదటి రాజధాని - జునాగడ్ / గిర్నార్
రెండవ రాజధాని - ఉజ్జయిని
చైనాలో శకులను సిథియన్‌లు అనేవారు.
సిథియన్‌ల దాడులను అంతం చేయుటకు చైనా రాజు షిా-హుయాంగ్-తి క్రీ.పూ.220లో గ్రేట్ చైనా వాల్‌ను నిర్మించాడు.
దీంతో జీవనాధారం కోల్పోయిన సిథియన్లు భారతదేశం వైపుకు మళ్లారు. వీరు భారతదేశం వైపుకు వస్తూ 5 శాఖలుగా చీలిపోయారు.
శకులలో మొట్టమొదటివాడు -మావుజ్
శకులలో మొదటి గొప్పవాడు -నహపాణుడు. ఇతను అత్యధికంగా వెండి నాణేలను ముద్రించాడు.
ఇతని అల్లుడు రిషభదత్త నాసిక్‌శాసనంలో పేర్కొనబడ్డాడు.
రిషభదత్తుడు శకుల వంశ పారంపర్య వివరములను పేర్కొన్నాడు.
రిషభదత్త బ్రాహ్మణులకు దానధర్మాలు చేశాడు.
గౌతమీపుత్ర శాతకర్ణి నహపాణున్ని ఓడించి వెండి నాణెములను తన పేరుతో ముద్రించాడు.
శకులలొ అతి గొప్పవాడు -రుద్రదామనుడు (కార్థమాక తెగెకు చెందినవాడు)
ఇతను జునాగఢ్ శాసనమును వేయించాడు. ఇది భారతదేశంలో మొట్టమొదటి సంస్కృత శాసనం.
జునాగఢ్ శాసనంలో సుదర్శన తటాకము గురించి పేర్కొనబడింది. దీని ప్రకారం సుదర్శన తటాకమును అశోకుడు, రుధ్రదామనుడు, ఖారవేల కళింగుడు మరమ్మతులు చేశారు.
క్రీ.పూ. 58లో గరుడబెల్ల కుమారుడు విక్రమాదిత్య శకులను ఉజ్జయిని నుంచి తరిమివేశాడు. ఈ సందర్చంగా క్రీ.వూ. 58లో “విక్రమ శకం”ను ప్రారంభించాడు.
పార్ధియన్‌లు(Parthian Empire):
వీరిలో అతి గొప్పవాడు గోండ ఫెర్నస్
ఇతని కాలంలో జీసస్ క్రిస్ట్ యొక్క 12 మంది శిష్యులలో ఒకడైన సెయింట్ థామస్ భారతదేశాన్ని సందర్శించాడు.
ఇతను చెన్నై దగ్గర మైలాపూర్ వద్ద హత్యకు గురయ్యాడు.
ఇతని జ్ఞాపకార్థం కొచ్చిలో సెయింట్ థామస్ అనే పేరుతో ఒక పెద్ద చర్చి నిర్మించబడింది.