మౌర్యుల పరిపాలన:
మౌర్యుల పరిపాలన గురించి తెలుసుకోవడానికి మన దగ్గర ఉన్న ప్రధాన ఆధారం -కౌటిల్యుని అర్థశాస్త్రం
కేంద్రీకృత పరిపాలన ఉందేది.
రాజ్యం రాష్ర్రాలుగా/జనపదం, రాష్ట్రం ఆహారాలుగా, ఆహార, విషయములుగా, విషయ గ్రామాలుగా విభజించబడ్డాయి.
రాష్ట్రాన్ని కుమారమాత్యులు/ఆర్యపుత్రులు/ప్రతినిధులు (యువరాజులు) పాలించారు.
ఆహారాన్ని రజ్జుక (రెవెన్యూ, న్యాయపాలన), ప్రాదేశిక(శాంతి భద్రతలు) పాలించేవారు.
విషయాన్ని గోప(5-10 గ్రామాలకు అధిపతి), స్థానిక (వంద గ్రామాలకు అధిపతి) పాలించేవారు.
గ్రామానికి అధిపతి గ్రామిని
గ్రామినికి సహకరించే ఉద్యోగులు గణగ, లేఖక 
మౌర్య సామ్రాజ్యం 4 ప్రధాన జనవదాలుగా విభజించబడింది.
| 
 ప్రాంతం  | 
 రాజధాని  | 
| 
 ఉత్తరాపథం  | 
తక్షశిల   | 
| 
 పశ్చిమపథం  | 
ఉజ్జయిని   | 
| 
ప్రాచ్య తూర్పు పథం(కళింగ)   | 
తోసలి / ధౌళి   | 
| 
 దక్షణాపథం  | 
సువర్ణగిరి   | 
మౌర్యుల కాలంలో వివిధ శాఖల అధిపతులు
| 
 అధికారి  | 
 శాఖ  | 
| 
 అక్షపాల అధ్యక్ష  | 
గణకుడు/లెక్కలు చేసేవాడు   | 
| 
 అకార  | 
గనులు, ఖనిజాలు   | 
| 
 సువర్ణ   | 
బంగారు గనులు మారకం   | 
| 
పాణ్య    | 
 వ్యాపారం, వాణిజ్యం  | 
| 
లక్షణాధ్యక్ష   | 
 నాణేలు నియంత్రణ  | 
| 
కుప్య అధ్యక్ష   | 
అటవీశాఖ   | 
| 
ఆయుధాగారా  | 
ఆయుధాల నియంత్రణ  | 
| 
పోతువా  | 
కొలతల అధ్యక్షుడు  | 
| 
సీతాఅధ్యక్ష  | 
వ్యవసాయ భూముల అధ్యక్షుడు  | 
| 
సుత్రాధ్యక్ష  | 
నేతపనివారు, అల్లికలు  | 
| 
సురాధ్యక్షా  | 
మద్యపానం  | 
| 
నావాధ్యక్ష  | 
ఓడరేవులు | 
| 
పట్టణాధ్యక్ష  | 
పట్టణ నిర్వహణ అధ్యక్షుడు  | 
| 
ముద్రధ్యక్ష | 
విదేశాంగ విధానం  చూసేవాడు  | 
| 
సమూహర్త  | 
రెవిన్యూ అధ్యక్షుడు  | 
| 
ప్రాదేశిక  | 
శాంతి భద్రతలు  | 
| 
సన్నిదాత  | 
కోశాధికారి  | 
| 
అతిహజక మహామాత్య  | 
స్త్రీ సంక్షేమ అధికారి  | 
సమాజం: 
చతుర్వర్ణ వ్యవస్థ ఉన్నప్పటికీ పాలకులు జైన లేదా అజ్విక లేదా బౌద్ధ మతాలు స్వీకరించుటచే దాని ప్రభావం సమాజంపై పెద్దగా చూపలేదు.
3వ వర్ణమైన వైశ్యులు పశువుల కాపరులుగా సంచార జీవనం గడిపారు. వీరు పన్నుగా తమ పశువులను ఇచ్చేవారు.
ఒకే వృత్తి అవలంభించే పనివారల నాయకునిని జఠక అనేవారు.
వైశ్యులు మరియు శూద్రుల మధ్య వ్యత్యాసం తగ్గింది.
స్త్రీలను అంగ రక్షకులుగా, గూఢాచారులుగా కూడా నియమించారు.
నర్తకిలు సంగీత విధ్వాంసులు, ఇతర కళాకారిణిలు గణికులుగా(వేశ్యలు) పరిగణించబడ్డారు.
మెగస్తనీస్ 7 కులాల గురించి పేర్కొన్నాడు.
1 తాత్వికులు
2 రైతులు
2 రైతులు
3 సైనికులు
4 పశుపోషకులు
4 పశుపోషకులు
5 చేతివృత్తులవారు
6 న్యాయమూర్తులు
6 న్యాయమూర్తులు
7 కౌన్సిలర్‌లు
కన్యాశుల్కం ఉండేదని కొందరు చరిత్రకారుల అభిప్రాయం
అర్థశాస్త్రంలో కన్యాశుల్కంగా 2 గోవులను ఇచ్చేవారని పేర్కొనబడింది. దీనినే అర్ధ వివాహం అంటారు.
వాస్తు శిల్పకళ
మౌర్యుల కాలంలో బౌద్ద మతానికి సంబంధించిన నిర్మాణాలు కన్పిస్తాయి. వీటిలో ప్రధానంగా స్థూపాలు, స్థంభాలు. వీటితోపాటు రాజభవనాల నిర్మాణం, బొమ్మల తయారీ కూడా కన్పిస్తుంది.
స్థూపాలు
బుద్దుని అవశేషాలపై నిర్మాణాలను స్థూపాలు అంటారు. 
స్థూపాలు 3 రకాలు
1 ఉద్దేశిక స్థూపాలు -బుద్దునిపై గల భక్తి భావాలతో నిర్మించినవి.
2 దాతుగర్భ స్థూపాలు -బుద్ధుని అవశేషాలపై నిర్మించబడినవి.
3 పారిభోజక స్ఫూపాలు -గొప్ప బౌద్ద్ధాచార్యులు ఉ పయోగించిన వస్తువులపై నిర్మించబడినవి.
స్థూపాల్లో అతి ముఖ్యమైనది -సాంచీ స్థూపం. ఇది అతి పెద్దది. దీనిని అశోకుడు ఇటుకలతో నిర్మించాడు.
క్రీ.శ. 7వ శతాబ్ధంలో హుయాంగ్‌త్సాంగ్ భారతదేశంలో పర్యటించి చాలావరకు స్థూపాలను సందర్శించాడు.
సారనాథ్ స్థూపం
భారత ప్రభుత్వం యొక్క అధికారిక చిహ్నం అశోకుని యొక్క సారనాథ్ స్థూపంలోని 4 సింహాల చిహ్నాన్ని తీసుకుంది. 
భారత జాతీయ చిహ్నంపై చెక్కబడిన ఇతర జంతువులు. ఏనుగు, గుర్రం, ఎద్దు, ఒక సింహం. 
రాజ భవనాలు
మౌర్యులు మొదటిగా రాజ భవనాన్ని పాట్నా సమీవంలో గల కుమ్రాహోర్‌లో చెక్కతో నిర్మించారు.
మౌర్యులు కొన్ని నిర్మాణ మెలుకవలను పర్షియాలోని పెర్సిపోలీస్ పట్టణ కళాకారుల నుంచి నేర్చుకున్నారు.
మట్టి బొమ్మలు
మట్టి బొమ్మల తయారీకి టెర్రకోటను(కాల్చిన మట్టి) ఉపయోగించారు.
ఏనుగు బొమ్మలను అధికంగా తయారు చేశారు. 
గుహాలయాలు
బౌద్ధ సన్యాసుల కొరకు గుహాలయాలు తొలుచబడ్డాయి.
బీహార్‌లోని బరాబరా గుహలు ప్రముఖమైనవి. బరాబరా గుహల్లో సుధామ మరియు లోమాస్‌రుషి గుహలు అజ్విక సన్యాసులకు దానం ఇచ్చినట్లు తెలుస్తుంది.
అలెగ్జాండర్ దండయాత్ర క్రీ.పూ. 327
అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాలని మాసిడోనియా నుండి తూర్పు ఆసియా వైపు బయల్దేరాడు. మొదటిగా పర్షియా ఏకమీనియన్ రాజు అయిన డేరియస్‌ను ఓడించి అఫ్ఘానిస్తాన్‌లోని కైబర్ కనుమ గుండా భారతదేశంలో ప్రవేశించాడు. తక్షశిల రాజైన అంబి అలెగ్జాండర్‌కు లొంగిపోయాడు.
క్రీ. పూ. 297లో హైడాస్పస్/జీలం/కర్రీ ప్లెయిన్ యుద్ధంలో అలెగ్జాండర్ అభిసార (పంజాబ్ రాజు) అయిన పురుషోత్తం/పోరస్‌ను ఓడించాడు.
అలెగ్జాండర్ పురుషోత్తం యొక్క ధైర్య సాహసాలకు మెచ్చి వాయవ్య భారత దేశంలో తాను ఆక్రమించిన ప్రాంతాలను పురుషోత్తంకే అప్పగించి పాకిస్థాన్‌లోని బోలాన్ కనుమ గుండా తిరిగి వెళ్లిపోయాడు.
ఇతను బాబిలోనియాలో క్రీ.పూ. 323లో తన 33వ యేట మరణించాడు.
అలెగ్జాండర్ దండయాత్ర కారణంగా చరిత్ర రచనలో కాలనిర్ణయానికి సంబంధించిన ఆధారాలు మనకు లభ్యమయ్యాయి.
గ్రీకు శిల్పకళ భారతదేశంలో ప్రవేశించింది. దీని కారణంగా తర్వాత కాలంలో గాంధార శిల్పకళ అభివృద్ధి చెందింది.
అలెగ్జాండర్ గురువు అరిస్టాటిల్, అరిస్టాటిల్ గురువు ప్లేటో, ప్లేటో గురువు సోక్రటిస్. 


