రెండవ చంద్రగుప్తుడు (క్రీ, శ. 380-415):
సముద్రగుప్తని మరణానంతరం రామగుప్తడు గుప్త పాలకుడు అయ్యాడు.
ఇతని భార్య ధృవదేవి. ఉజ్జయిని శకరాజు 3వ రుద్రసింహుడు రామగుప్తుని ఓడించి ధృవదేవిని బంధించాడు.
రామగుప్తుని సోదరుడు 2వ చంద్రగుప్తుడు 3వ రుద్రసింహుడిని వధించి ధృవదేవిని విడిపించాడు. ఈ సందర్భంగా రెండవ చంద్రగుప్తడు 'శకారి” అనే బిరుదును పొందాడు.
ఈ వృత్తాంతమంతటిని విశాఖదత్తుడు 'దేవీచంద్రగ్తుము'లో పేర్కొన్నాడు.
తర్వాత రామగుప్తుడిని వధించి “విక్రమాదిత్య” అనే బిరుదును పొంది 2వ చంద్రగుప్తుడు సింహాసనాన్ని అధిష్టించాడు.
2వ చంద్రగుప్తుడు ధృవదేవిల గురించి ఈ క్రింది పుస్తకాలలో ప్రస్తావించబడింది.
1) కావ్య మీమాంస -రాజశేఖరుడు
2) శృంగార ప్రకాశ్ -భోజరాజు
3) కౌముదీ మహోత్సవం -వజ్జిక
4) నాట్య దర్చణి -రామచంద్ర
5) అభినవ్ భారత్ -అభినవ్ గుప్త
6) దేవీ చంద్రగుప్తం -విశాఖ దత్తుడు
ఇతని బిరుదులు:
1) సింహావిక్రమ
2) రాజాధిరాజ
3) శూరి
4) విక్రమాదిత్య
ఇతని ఆస్థానంలో నవరత్నాలు ఉండేవారు.
1) కాళిదాసు: అభిజ్ఞాన శకుంతలం, మాళవికాగ్నిమిత్రం, విక్రమౌర్వశీయం (నాటకాలు)
రవథలవంశం, మేఘదూతం, రుతుసంహారం, కుమారసంభవం (కావ్యాలు) రచించాడు.
2) అమర సింహుడు: అమరకోశము (మొట్టమొదటి సంస్కృతం-సంస్కతం నిఘంటువు)
3) వరాహ మిహిరుడు : బృహత్‌సంహిత, పంచ సిద్ధాంత, లఘుజాతక, బృహత్‌జాతక
4) ధన్వంతరి
5) వరారుచి
6) షప్నకుడు
7) శంఖుడు
8) బేతాళభట్టు
9) ఘట్‌కర్పార్
2వ చంద్రగుప్తుని యుగాన్ని ఎలిజబెత్ యుగంతో పోలుస్తారు. (ఆమె కాలంలో షేక్స్‌పియర్ మొదలగువారు ఉండేవారు)
ఇతని కాలంలోనే రామాయణం, మహాభారతం, పురాణాలు మొదలగునవి రచించబడ్డాయి. అందువల్లనే ఇతని యుగాన్ని స్వర్ణ యుగమని (ప్రధానంగా సాహిత్యం ఆధారంగా) అంటారు.
కామాంధకుడు -నీతి శాస్త్రమును
పాలకాప్యుడు - హస్తాయుర్వేదమును
శూద్రకుడు - మత్స్యకటికమును
వాత్సాయనుడు - కామసూత్రము, ఆర్య మంజశ్రీని రచించారు.
క్రీ.శ.405లో చైనా యాత్రికుడు ఫాహియాన్ గుప్త సామ్రాజ్యాన్ని దర్శించాడు.
ఇతను ఫోకోకో అనే పుస్తకాన్ని రచించాడు.
ఈ పుస్తకంలో గుప్తుల ఆర్థిక, సామాజిక, రాజకీయ విషయాలను పేర్కొనబడ్డాయి.
ఇతర చైనా యాత్రికుల వ్యాఖ్యలు :
ఫాహియాన్ -చండాలులు గ్రామ బయట ఉండేవారు. వీరు మాంసం, చేపలు తింటుండేవారు.
హుయాంగ్‌త్సాంగ్-శూద్రులు వ్యవసాయం చేసేవారు.
ఇత్సింగ్ -బౌద్ధం క్షీణ దశలో ఉంది. గయలో మఠంలో నిర్మాణం.
ఇతను ఢిల్లీ దగ్గర మొహ్రాలీ ఇనుప స్తంభ శాషనమును వేయించాడు. ఈ శాసనంలో బెంగాల్ ఆక్రమణ గురించి పేర్కొనబడింది.
చంద్రగుప్త విక్రమాదిత్యుడు తన కుమార్తె ప్రభావతిగుప్తను వాకాటక రాజు రెండవ రుద్రసేనుడికి ఇచ్చి వివాహం చేశాడు.
వాకాటకాలు ఎలిఫెంటా, కన్హరి గుహలను తొలిచారు.