కుమారగుప్తుడు(క్రీ. శ. &415-455):
ఇతన్ని వ్యాఘ్రహ బలపరాక్రమ అంటారు.
ఇతను తన పరిపాలనను వివరిస్తూ తామ్ర పత్రాలను విడుదల చేశాడు.
నలంద విశ్వవిద్యాలయంను ఏర్పాటు చేశాడు.
ఇతను వేయించిన నాణేలు
1. ఏనుగుపై స్వారీ చేస్తున్నట్లు
2. ఖడ్గ మృగాన్ని వధిస్తున్నట్లు
3. అశ్వమేధ నిర్వహణ
స్కందగుప్తుడు (క్రీ.శ. 455-467):
ఇతను చివరి గొప్ప గుప్త పాలకుడు
ఇతని కాలంలోనే హుణుల దండయాత్ర అత్యధికమైనది. ఇతను చైనాకు రాయబారిని పంపాడు.
స్కందగుప్తుని గుజరాత్ వైస్రాయి చక్రపాలిత, అతని కుమారుడు పన్నదత్తుడు సుదర్శన తటాకమునకు మరమ్మతులు చేశారు.
ఇతని తర్వాత పాలకులను మలి గుప్తులు అంటారు.
భానుగుప్తుడు:
క్రీ.శ. 510 లో ఎరాన్ శాసనమును వేయించాడు. ఈ శాసనంలో మొట్టమొదటిసారిగా సతీసహగమనం గురించి పేర్కొనబడింది.
మలి గుప్తులలో గొప్పవాడు -నరసింహగుప్త బాలాదిత్య.
ఇతను మాళ్వా పాలకుడు యశోధర్శన్‌తో కలిసి హూణా దండయాత్రికుడు మిహిర్‌కులుడిని ఓడించాడు.
హూనా దండయాత్రికుల్లో ప్రముఖులు- తోరమానుడు, మిహిర్ములుడు
పరిపాలన:
గుప్తులు తమ రాజ్యాన్ని ఈ క్రింది విధంగా విభజించారు.
రాజ్యం -భుక్తులుగా
భుక్తి -విషయాలుగా
విషయ -విత్తిలుగా
విత్తి - గ్రామాలుగా
భుక్తి అధికారిని. ఉపరికుడు అంటారు. ఇతనికే భోగిక, భోగపతి, గోప్త, రాజస్థానీయ అనే పేర్లు కూడా కలవు.
విషయ అధిపతిని విషయపతి లేదా అయుక్త అనేవారు
విషయపతికి సలహాలిచ్చే సభ నగర సభ
నగరసభలో నలుగురు సభ్యులుంటారు
1 నగర శ్రేష్టి -వర్తక సంఘ అధ్యక్షుడు
2 సార్ధవాహ -వర్తక సంఘాల రక్షణ నాయకుడు
3 ప్రథమ కులిక- పురాధ్యక్షుడు (కార్మికాధ్యక్షుడు)
4 ప్రథమ కాయస్థ -ముఖ్య లేఖకుడు
విత్తి అనగా కొన్ని గ్రామాల కలయిక
గ్రామ అధ్యక్షున్ని గ్రామికుడు అంటారు.
గ్రామం అనేది పరిపాలనాపరంగా ప్రాథమికమైన విభాగం.
అడవుల పరిరక్షణ కొరకు నియమించబడిన అధికారి-గౌల్మికుడు
గుప్తుల కాలంలో రాజుల వద ఉన్న ప్రధాన భూస్వాములను ఉక్కకల్ప అనేవారు.
సమాజం:
చతుర్వర్ణ వ్యవస్థ ఉండేది.
బ్రాహ్మణులకు అత్యున్నత స్థానం కల్పించబడింది. గుప్తుల కాలంలోనే బ్రాహ్మణులు తాము భూమిపై కన్పిస్తున్న దేవుళ్లమని ప్రకటించుకున్నాడు.
గుప్తుల కాలంలో వివిధ గ్రామాలు వివిధ వ్యక్తులకు దానంగా ఇవ్వబడేది
ఉదా||
1) అగ్రహార గ్రామాలు -బ్రాహ్మణులకు దానమిచ్చిన గ్రామాలు
2) బ్రహ్మధేయ గ్రామాలు -మత కార్యక్రమాల నిర్వహణ కోసం బ్రాహ్మణేతర వర్ణాలకు దానమిచ్చిన గ్రామాలు
3) భూస్వామ్య గ్రామాలు -సేవలకు ప్రతిఫలంగా ఉద్యోగులకు, సేనానులకు దానమిచ్చిన గ్రామాలు
2వ చంద్రగుప్తుడు బ్రాహ్మణులకు తన ఆస్థానంలో ఉన్నత స్థానం ఇచ్చాడు. అప్పుడే బ్రాహ్మణులు భారతదేశ ఇతిహాసాలైన రామాయణం, మహాభారతంలను లిఖించారు.
18 వురాణాల్లో అధిక వురాణాలు అప్పుడే లిఖించబడ్డాయి.
గుప్తుల కాలంలోనే సమాజంలో జాజ్‌మనీ అనే విధానం అమలులోకి వచ్చింది. దీని ప్రకారం సమాజం వృత్తుల ఆధారంగా శాస్ర్తీయ పద్ధతిలో విభజించబడింది.
గుప్తుల కాలంలో నైపుణ్యత ఆధారంగా కుల వృత్తులు అనేవి పెద్దఎత్తున చేపట్టబడ్డాయి. వారి వృత్తులకు వారు యజమానులుగా వ్యవహరించేవారు. దీనినే జాజ్‌మని విధానంగా పరిగణిస్తారు. 'జాజ్‌మని' అనే పదం సంస్కృత పదమైన 'యజమాన' నుంచి వచ్చింది.
సతీ సహగమనం గుప్తుల కాలంలో ఉండేదని చెప్పుటకు క్రీ.శ. 510లో వేయించబడిన ఎరాన్ శాసనం ద్వారా తెలుస్తుంది.